వైఫై, ఎమోజీ, క్యూఆర్ కూడా ఇలా దైనందిత జీవితంలో ఉపయోగించే ఈ అద్భుత ఆవిష్కరణల వెనుక ఉన్న దేశాలేవో తెలుసా?
వైఫై టెక్నాలజీ అభివృద్ధిలో ఆస్ట్రేలియా, వరల్డ్ వైడ్ వెబ్ రూపకల్పనలో బ్రిటన్ కీలక పాత్ర పోషించాయి. బ్లూటూత్ స్వీడన్, క్యూఆర్ కోడ్, ఎమోజీలు జపాన్, బార్‌కోడ్ అమెరికా నుంచి వచ్చాయి. రూబిక్స్ క్యూబ్ హంగరీలో రూపుదిద్దుకోగా, మాగ్నెటిక్ కంపాస్ చైనాలో అభివృద్ధి చెందింది. ప్రపంచ ప్రసిద్ధి పొందిన చెస్ మాత్రం భారత్‌లోనే పుట్టింది.
By: Tupaki Desk | 6 Nov 2026 12:00 PM ISTమనం రోజూ వాడే వైఫై నుంచి మొదలుపెట్టి ఆడుకునే ఆటల వరకు ప్రతి దాని వెనుక ఎంతోమంది పరిశోధకుల కష్టం ఉంది. అసలు మనం నిత్యం ఉపయోగించే ఈ టెక్నాలజీ, వస్తువులు, ఆటలను ఏ దేశాలు కనిపెట్టాయో తెలుసుకోవడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మన దైనందిన జీవితాన్ని ఇంత సులభం చేసిన ఆ అద్భుత ఆవిష్కరణలు ఏ దేశం నుంచి వచ్చాయో ఇప్పుడు సరదాగా తెలుసుకుందాం..
వైఫై, ఇంటర్నెట్ ఎవరివి?:
ప్రపంచాన్ని ఒక చిన్న ఊరులా మార్చేసిన 'వైఫై' టెక్నాలజీని ఆస్ట్రేలియా దేశం కనిపెట్టింది. అలాగే ఇంటర్నెట్‌ను మనం సులభంగా వాడేలా చేసిన 'డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ' వ్యవస్థను యునైటెడ్ కింగ్‌డమ్ నిపుణులు అభివృద్ధి చేశారు. ఈ రెండూ లేకపోతే అసలు ఈరోజు మనం డిజిటల్ ప్రపంచంలో ఇంత వేగంగా ఉండగలిగేవాళ్లమే కాదు.
బ్లూటూత్, క్యూఆర్ కోడ్, బార్‌కోడ్:
ఫోన్లలో డేటా షేర్ చేసుకోవడానికి వాడే 'బ్లూటూత్' టెక్నాలజీ స్వీడన్ దేశం సృష్టి. ఇక ఇప్పుడు ఎక్కడ చూసినా కనిపిస్తున్న 'క్యూఆర్ కోడ్' మరియు మన భావాలను ఈజీగా చెప్పే 'ఎమోజీలు' జపాన్ దేశం అందించినవే. అలాగే షాపింగ్‌లో వాడే 'బార్‌కోడ్' టెక్నాలజీని అమెరికా దేశం ప్రపంచానికి పరిచయం చేసింది.
రూబిక్స్ క్యూబ్, మ్యాగ్నెటిక్ కంపాస్:
మనదగ్గర ఉన్న బుర్రను బాగా మేత పెట్టిస్తోన్న 'రూబిక్స్ క్యూబ్' ఆటను హంగేరి దేశానికి చెందిన రూపకర్త కనిపెట్టారు. ఇక సరైన దిశలను తెలుసుకోవడానికి, వాస్తు చూసుకోవడానికి మనం వాడే 'మ్యాగ్నెటిక్ కంపాస్' తయారు చేసిన ఘనత చైనా దేశానిది. ఇక ఈ రెండు ఆవిష్కరణలు మానవ చరిత్రలో చాలా కీలకమైనవి.
మన ఇండియా ఇచ్చిన గొప్ప ఆట 'చెస్':
ప్రపంచవ్యాప్తంగా మేధావుల ఆటగా పేరు తెచ్చుకున్న 'చెస్' క్రీడను మన దేశమే ప్రపంచానికి అందించింది. ఇక ప్రాచీన కాలంలో మన ఇండియాలో పుట్టిన ఈ మేధస్సు ఆట, నేడు ప్రపంచ దేశాలన్నింటిలోనూ ఎంతో ఆదరణ పొందుతూ మన దేశం గర్వపడేలా చేస్తోంది.
ఇక ప్రతి దేశం ఏదో ఒక రూపంలో మానవ నాగరికత అభివృద్ధికి ఎంతో కొంత సహాయం చేశాయి. ఈ ఆవిష్కరణలన్నీ మన రోజూవారీ జీవితాన్ని ఎంతగానో ఈజీ చేశాయి. ఇక ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడం వల్ల మన జనరల్ నాలెడ్జ్ కూడా పెరుగుతుంది..
