Begin typing your search above and press return to search.
ఆన్‌లైన్ షాపింగ్ కోసం ఇదొక అడ్డా!
By: Tupaki Desk | 8 April 2015 8:14 PM ఆన్‌లైన్ షాపింగ్ అందరికీ ఇష్టమైనదే... అనేక రకాల ఉత్పత్తులను పరిశీలించడానికి, బోలెడంత సమయాన్ని సేవ్ చేయడానికి ఆన్‌లైన్ షాపింగ్ ఉత్తమమైన మార్గం. ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాకా దేశంలో ఆన్‌లైన్ షాపింగ్ విస్తృతం అవుతోంది. అనేక వెబ్‌సైట్‌లు అనేక ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకొచ్చి మార్కెటింగ్ చేస్తున్నాయి. మరి ఆన్‌లైన్ షాపింగ్‌కుఏ సైట్ ఉత్తమమైనది? అంటే... ఎందులో మంచి ఆఫర్‌లు ఉంటే అది బెస్ట్ అని చెప్పవచ్చు. మరి ఆన్‌లైన్ షాపింగ్‌కు అవకాశం ఇస్తున్న వెబ్‌సైట్‌లు ఎన్నో ఉంటాయి... వాటిలో పాపులర్ అయినవి కొన్ని పాపులర్ కాని, మనకు తెలియనివి కొన్ని. మరి అన్నింటినీ తెలుసుకొని, గుర్తు పెట్టుకొని, ఆ సైట్లను క్లిక్ చేసి మనకు కావాల్సిన ప్రోడక్ట్‌ను వెదుక్కొవడం కొంచెం కష్టమైన పనే! ఈ కష్టాన్ని నిరోధిస్తుంది క్లిప్‌డాట్‌ఇన్ (klip.in) ఇ కామర్స్ కు సంబంధించిన సైట్‌లన్నింటినీ ఒక చోటికి చేర్చింది ఈ సైట్. మనదేశం పరిధిలో సేవలనందించే అన్ని ఇ-కామర్స్ వెబ్‌సైట్‌లూ ఇందులో కనిపిస్తాయి. సైట్‌లోకి లాగిన్ అయితే చాలు... వాటన్నింటినీ హోం పేజీలోనే చూడొచ్చు. ఆన్‌లైన్ షాపింగ్ చేసుకోవచ్చు. ఇదీ దీంతో ఉన్న సౌకర్యం. ఇది అప్లికేషన్ గా కూడా అందుబాటులో ఉంది. దీంట్లోకి వెళ్లి వివిధ సైట్లను క్లిక్ చేసుకొంటూ.. వాటిల్లో మనకు కావాల్సిన వస్తువుల ధరల మధ్య పోలికను గమనిస్తూ.. షాపింగ్ చేయవచ్చు. నిస్సందేహంగా ఈ సైట్ బ్రౌజింగ్ శ్రమను నివారించేదే కదా!
