Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్‌ డిజాస్టర్‌ మూవీకి ఓటీటీలో రికార్డ్‌

టాలీవుడ్‌ స్టార్‌ ఎన్టీఆర్‌ నటించిన మొదటి బాలీవుడ్‌ మూవీ 'వార్‌ 2' ఫ్యాన్స్‌కి, తెలుగు ప్రేక్షకులకు తీవ్ర నిరాశను మిగిల్చింది.

By:  Ramesh Palla   |   14 Oct 2025 11:05 AM IST
ఎన్టీఆర్‌ డిజాస్టర్‌ మూవీకి ఓటీటీలో రికార్డ్‌
X

టాలీవుడ్‌ స్టార్‌ ఎన్టీఆర్‌ నటించిన మొదటి బాలీవుడ్‌ మూవీ 'వార్‌ 2' ఫ్యాన్స్‌కి, తెలుగు ప్రేక్షకులకు తీవ్ర నిరాశను మిగిల్చింది. మన స్టార్స్ తెలుగు సినిమాలు చేసి హిందీలో మంచి వసూళ్లు సాధిస్తున్నారు. కానీ డైరెక్ట్‌ హిందీ సినిమాల్లో నటిస్తే మాత్రం తిరస్కరణకు గురి అవుతున్నారు అని సినీ విశ్లేషకులు సైతం వార్‌ 2 విడుదల సమయంలో మాట్లాడుకోవడం జరిగింది. బాలీవుడ్‌లో టాలీవుడ్‌ నుంచి వెళ్లి జెండా పాతాబోతున్నాడు అంటూ ఎన్టీఆర్‌ గురించి నందమూరి అభిమానులు చాలా అంచనాలు పెట్టుకున్నారు. కానీ వార్‌ 2 సినిమా హిందీ బాక్సాఫీస్‌ వద్దనే కాకుండా తెలుగు బాక్సాఫీస్‌ వద్ద కూడా బొక్కబోర్లా పడింది. ఓవరాల్‌గా వార్‌ 2 థియేట్రికల్‌ రిలీజ్ డిజాస్టర్‌గా నిలిచింది. సినిమా ఫ్లాప్‌ అయినా కూడా ఓటీటీ స్ట్రీమింగ్‌ కోసం అభిమానులు చాలా వారాలు వెయిట్‌ చేయాల్సి వచ్చింది. ఎట్టకేలకు వార్‌ 2 నెట్‌ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ మొదలైంది.

హృతిక్‌ రోషన్‌, ఎన్టీఆర్‌ కాంబో..

సాధారణంగా మెజార్టీ సినిమాలు నాలుగు వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతున్నాయి. కానీ వార్‌ 2 సినిమాను ముందస్తు ఒప్పందం కారణంగా దాదాపు ఏడు వారాల తర్వాత స్ట్రీమింగ్‌ చేయడం జరిగింది. నందమూరి ఫ్యాన్స్‌తో పాటు తెలుగు, హిందీ ప్రేక్షకులు వార్ 2 స్ట్రీమింగ్‌ కోసం వెయిట్‌ చేశారు. హృతిక్‌ రోషన్‌, ఎన్టీఆర్‌ల కాంబోను థియేటర్‌లో చూడని వారు సైతం ఓటీటీ స్ట్రీమింగ్‌పై ఆసక్తి కనబర్చారు. ఎట్టకేలకు స్ట్రీమింగ్‌ మొదలైన వార్‌ 2 కి అన్ని భాషల ప్రేక్షకుల నుంచి ఊహించని స్పందన లభించింది. నెట్‌ఫ్లిక్స్‌లో సినిమాకు ఎక్కువ రీచ్ దక్కింది. స్ట్రీమింగ్‌ అయిన వారం రోజుల్లోనే ఏకంగా 3.5 మిలియన్‌ వ్యూస్‌ను నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా దక్కించుకుంది. ఇండియాలో గతవారం అత్యధికంగా ఓటీటీ ద్వారా స్ట్రీమింగ్‌ చేసిన సినిమాల జాబితాలో వార్ 2 సినిమా నెం.1 స్థానంలో నిలవడం విశేషం.

నెట్‌ఫ్లిక్స్‌లో వార్ 2 స్ట్రీమింగ్‌

ఇద్దరు సూపర్‌ స్టార్స్ నటించిన సినిమా కావడంతో సహజంగానే సినిమాపై అంచనాలు భారీగా ఉంటాయి. థియేట్రికల్‌ రిలీజ్ సమయంలో నెగిటివ్‌ రివ్యూలు వచ్చాయి. దాంతో సినిమాను థియేట్రికల్‌ స్క్రీనింగ్‌ చేసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపించలేదు. కానీ ఓటీటీ ద్వారా స్ట్రీమింగ్‌ అయిన సమయంలో ఫలితంతో సంబంధం లేకుండా ఇద్దరు హీరోలను ఒకే సినిమాలో, ఒకే స్క్రీన్‌ పై చూసేందుకు చాలా మంది ఆసక్తిని కనబర్చారు. ఎన్టీఆర్‌, హృతిక్‌ రోషన్‌ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా తెలుగు, హిందీ రెగ్యులర్‌ ప్రేక్షకులు సైతం సినిమాను చూసేందుకు ఆసక్తి చూపడం వల్లే మొదటి వారంలో అత్యధిక వ్యూస్ వచ్చి ఉంటాయి అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ముందు ముందు వార్‌ 2 కి ఓటీటీ ద్వారా మరింతగా ప్రేక్షకుల నుంచి మద్దతు లభించే అవకాశాలు ఉన్నాయి అని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కియారా అద్వానీ హీరోయిన్‌గా...

హృతిక్‌ రోషన్‌ హీరోగా ఎన్టీఆర్‌ ముఖ్య పాత్రలో నటించిన ఈ సినిమాలో హీరోయిన్‌గా కియారా అద్వానీ నటించింది. ఎన్టీఆర్‌, హృతిక్ మధ్య ఉండే యాక్షన్‌ సీన్స్‌తో పాటు, కొన్ని స్పై థ్రిల్లర్‌ సీన్స్‌, మరికొన్ని యాక్షన్‌ సీన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి. వార్‌ 2 థియేట్రికల్‌ రిలీజ్ సమయంలో ఎదుర్కొన్న నెగిటివిటీ ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్‌ సమయంలో లేదని చెప్పాలి. సాధారణంగా చాలా సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్‌ సమయంలో ఎక్కువ నెగిటివిటీని ఎదుర్కొంటాయి. కానీ ఈ సినిమా విషయంలో అలా జరగక పోవడంతో అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో యశ్‌రాజ్‌ ఫిల్మ్స్ బ్యానర్‌లో ఈ సినిమా రూపొంది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వార్‌ స్పై యూనివర్స్‌లో మరిన్ని సినిమాలు వస్తాయని యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్‌ ప్రతినిధులు అంటున్నారు.