Begin typing your search above and press return to search.

ఓటీటీ షోలో బ‌ల‌వంతంగా.. మ‌హిళా క‌మీష‌న్ సీరియస్

వెబ్ సిరీస్ లు, రియాలిటీ షోల్లో విచ్ఛ‌ల‌విడిత‌నాన్ని ప్ర‌మోష‌న‌ల్ మెటీరియ‌ల్ గా ప్ర‌ద‌ర్శించ‌డం చిక్కులు తెచ్చిపెడుతోంది.

By:  Tupaki Desk   |   3 May 2025 1:39 PM IST
Ullu App House Arrest Sparks Outrage
X

వెబ్ సిరీస్ లు, రియాలిటీ షోల్లో విచ్ఛ‌ల‌విడిత‌నాన్ని ప్ర‌మోష‌న‌ల్ మెటీరియ‌ల్ గా ప్ర‌ద‌ర్శించ‌డం చిక్కులు తెచ్చిపెడుతోంది. ఇప్పుడు `హౌస్ అరెస్ట్` వెబ్ సిరీస్‌లో మహిళలను బలవంతంగా, అసభ్యకరంగా చిత్రీక‌రించిన వీడియో వైర‌ల్ కావ‌డంపై జాతీయ మహిళా కమిషన్ (NCW) సీరియ‌స్ యాక్ష‌న్ కి దిగ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ అస‌భ్య‌క‌ర కంటెంట్ ఉల్లు యాప్ సీఈవో విభు అగర్వాల్ , నటుడు - హోస్ట్ అజాజ్ ఖాన్‌లకు క‌మిష‌న్ సమన్లు జారీ చేసింది. ఎన్సీడ‌బ్ల్యూ నోటీసు ప్రకారం.. వారిద్దరూ మే 9న కమిషన్ ముందు హాజరు కావాల్సి ఉంది.

ప్ర‌స్తుతం సిరీస్ కంటెంట్‌పై తీవ్ర వివాదం చెలరేగుతున్న నేపథ్యంలో రియాలిటీ షో `హౌస్ అరెస్ట్` స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నుండి తొల‌గించారు. ముఖ్యంగా అశ్లీల కంటెంట్ తో ఉల్లు యాప్ భ్ర‌ష్టు ప‌ట్టిస్తోంద‌ని మ‌హిళా క‌మీష‌న్ సీరియ‌స్ యాక్ష‌న్ కి దిగిన‌ట్టు తెలుస్తోంది. అశ్లీల కంటెంట్ ఆరోపణలపై నటుడు అజాజ్ ఖాన్, నిర్మాత రాజ్‌కుమార్ పాండే స‌హా ప‌లువురిపై ముంబై పోలీసులు శుక్రవారం ఎఫ్‌.ఐ.ఆర్ నమోదు చేశారని ఒక అధికారి పేర్కొన్న‌ట్టు జాతీయ మీడియా వెల్ల‌డించింది. ఈ షో గురించి కలవరపెట్టే క‌థ‌నాలు మీడియాలో వ‌ర‌ల్ అయ్యాయ‌ని, దీంతో మ‌హిళా క‌మీష‌న్ సుమోటోగా విచారణ చేపట్టింద‌ని స‌మాచారం.

ఏప్రిల్ చివ‌రిలో ఈ షో నుండి ఒక చిన్న క్లిప్ వైరల్ అయిన త‌ర్వాత ఇదంతా మొద‌లైంది. దీనిలో హోస్ట్ అజాజ్ ఖాన్ కెమెరా ముందు మ‌హిళ‌ల్ని కించ‌ప‌రిచారు. ప్ర‌యివేట్ పార్ట్స్ చూపిస్తూ, అస‌భ్య‌క‌ర‌ భంగిమలను ప్రదర్శించమని బలవంతం చేస్తున్నట్లు వీడియోలో చూపించారు. ఆ స‌మ‌యంలో ఆర్టిస్టు అసౌక‌ర్యం, తిర‌స్క‌ర‌ణ వీడియోలో స్ప‌ష్ఠంగా క‌నిపించాయని క‌మీష‌న్ పేర్కొంది.