ఓటీటీలో అందుబాటులో ఉన్న కోర్టు రూమ్ సినిమాలివే
నేచురల్ స్టార్ నాని సమర్పణలో రామ్ జగదీష్ దర్శకత్వం వహించిన సినిమా కోర్టు: స్టేట్ వర్సెస్ ఎ నోబడీ. ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా సక్సెస్‌ఫుల్ గా థియేటర్ రన్ ముగించుకుని ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది.
By: Tupaki Desk | 12 April 2025 2:24 PM ISTనేచురల్ స్టార్ నాని సమర్పణలో రామ్ జగదీష్ దర్శకత్వం వహించిన సినిమా కోర్టు: స్టేట్ వర్సెస్ ఎ నోబడీ. ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా సక్సెస్‌ఫుల్ గా థియేటర్ రన్ ముగించుకుని ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. థియేటర్లలో బ్లాక్ బస్టర్ గా నిలిచి కమర్షియల్ గా బాగా వసూలు చేసిన కోర్టు సినిమా నెట్‌ఫ్లిక్స్ లోఅన్ని భాషల్లో అందుబాటులోకి వచ్చింది.
లీగల్ థ్రిల్లర్ జానర్ ను ఇష్టపడే ఆడియన్స్ కు అలాంటి మరికొన్నిఇండియన్ కోర్ట్ రూమ్ డ్రామా సినిమాలు మరికొన్ని ఓటీటీలో ఉన్నాయి. ఆ సినిమాలు ఏంటి? ఏ ప్లాట్‌ఫామ్స్ లో అందుబాటులో ఉన్నాయో చూద్దాం.
పింక్: ముగ్గురు యువతల కేసును వాదించే రిటైర్డ్ లాయర్ గా ఈ మూవీలో అమితాబ్ కనిపిస్తాడు. 2016లో వచ్చిన ఈ కోర్టు రూమ్ డ్రామా మంచి హిట్ గా నిలిచింది. ఈ సినిమా ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. పింక్ సినిమాను తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ పేరుతో రీమేక్ చేయగా ఆ సినిమా కూడా ప్రైమ్ వీడియోలోనే ఉంది.
సెక్షన్ 375: ఈ లీగల్ థ్రిల్లర్ లో చట్టాల దుర్వినియోగాన్ని చూపించారు. ఎత్తుకి పై ఎత్తులు, ఎంతో ఉద్రిక్తతతో సాగే ఈ మూవీ కోర్ట్ రూమ్ డ్రామా జానర్లలో బెస్ట్ మూవీగా చెప్పుకోవచ్చు. ఈ మూవీ ప్రైమ్ వీడియోలో తెలుగు సబ్‌టైటిల్స్‌తో అందుబాటులో ఉంది.
కోర్ట్: 2014లో వచ్చిన ఈ మరాఠీ సినిమా మూబీ అనే ఓటీటీలో అందుబాటులో ఉంది. జానపద గాయకుడి యొక్క విచారణ, పలు కలవరపెట్టే అంశాలతో కూడిన ఈ మూవీ అందరినీ ఆలోచింపచేసేదిలా ఉంటుంది. కానీ ఈ సినిమా తెలుగులో అందుబాటులో లేదు.
జై భీమ్: సూర్య హీరోగా తెరకెక్కిన ఈ తమిళ సినిమా 2021లో వచ్చింది. జై భీమ్ లో కుల వివక్షత, పోలీసుల క్రూరత్వాన్నిచూపించారు. యదార్థ సంఘటన ఆధారంగా రూపొందిన జై భీమ్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. తెలుగులో కూడా జై భీమ్ అందుబాటులో ఉంది.
జన గణ మన: సాధారణ కోర్టు కేసుగా మొదలయ్యే ఈ సినిమా తర్వాత చాలా పెద్ద పొలిటికల్ థ్రిల్లర్ గా మారుతుంది. 2022లో వచ్చిన ఈ మలయాళ మూవీ నెట్‌ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. ఈ సినిమాకు తెలుగు వెర్షన్ కూడా నెట్‌ఫ్లిక్స్ లో ఉంది.
నాంది: అనవసరంగా జైలు శిక్ష అనుభవించిన తర్వాత ఓ వ్యక్తి చేసే పోరాటమే నాంది. ఈ సినిమా ఎంతో ఉత్కంఠభరితంగా తెరకెక్కింది. అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా 2021లో రిలీజైంది. నాంది ఆహా లో తెలుగులో అందుబాటులో ఉంది.
వాషి: 2022లో వచ్చిన ఈ మలయాళ సినిమా ఒక కేసు, ఇద్దరు లాయర్ల మధ్య జరిగే క్లాష్ తో నడుస్తోంది. నెట్‌ఫ్లిక్స్ లో ఈ సినిమా అందుబాటులో ఉంది. దీనికి తెలుగు వెర్షన్ కూడా నెట్‌ఫ్లిక్స్ లో ఉంది.
విసరాణై: 2015లో వచ్చిన ఈ తమిళ సినిమా పూర్తిగా కోర్టు రూమ్ డ్రామా కాకపోయినా అందులోని కథ అందరినీ కలతపెట్టిస్తుంది. ఈ తమిళ మూవీ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. దీనికి తెలుగు వెర్షన్ అందుబాటులో లేదు.
