Begin typing your search above and press return to search.

థగ్ లైఫ్ ఓటీటీ.. లేటెస్ట్ అప్డేట్ ఏంటి?

ప్రముఖ నటుడు కమల్ హాసన్ లీడ్ రోల్ లో నటించిన మూవీ థగ్ లైఫ్. దిగ్గజ దర్శకుడు మణిరత్నం దర్శకత్వం వహించిన ఆ సినిమా జూన్ 5వ తేదీన వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది.

By:  Tupaki Desk   |   25 Jun 2025 4:06 PM IST
థగ్ లైఫ్ ఓటీటీ.. లేటెస్ట్ అప్డేట్ ఏంటి?
X

ప్రముఖ నటుడు కమల్ హాసన్ లీడ్ రోల్ లో నటించిన మూవీ థగ్ లైఫ్. దిగ్గజ దర్శకుడు మణిరత్నం దర్శకత్వం వహించిన ఆ సినిమా జూన్ 5వ తేదీన వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. అయితే కమల్ హాసన్, మణిరత్నం కాంబో మూడు దశాబ్దాల తర్వాత రిపీట్ కావడంతో సినీ ప్రియుల్లో, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

కానీ సినిమా దారుణంగా నిరాశపరిచింది. కనీస అంచనాలు కూడా అందుకోలేకపోయింది. డైరెక్టర్ అనేక విమర్శలు ఎదుర్కొన్నారు. మూవీ వల్ల డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు వచ్చినట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే ఓటీటీ డీల్ వల్ల థగ్ లైఫ్ నిర్మాతలు కమల్ హాసన్, మణిరత్నం వల్ల నష్టపోనున్నారని కొద్ది రోజులుగా టాక్ వినిపిస్తోంది.

ఎందుకంటే.. ధగ్ లైఫ్ రిలీజ్ కు ముందే డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల్ని ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. రూ.130 కోట్ల భారీ ధరకు డీల్ కుదుర్చుకుంది. మూవీ రిలీజ్ అయిన 8 వారాలకు సినిమాను స్ట్రీమింగ్ చేస్తామని తెలిపింది. కానీ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చాక రిజల్ట్ చూసి.. ఒప్పందాన్ని పూర్తిగా సవరించింది

ఎనిమిది వారాల బదులు నాలుగు వారాలకే మూవీని అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించుకుంది. సినిమా పెద్దగా ఆడకపోవడంతో ధరను రూ. 110 కోట్లకు తగ్గించాలని నెట్‌ ఫ్లిక్స్.. మేకర్స్ తో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ముందుకు అనుకున్న ఒప్పందం ప్రకారం చెల్లించలేమని, రూ.20 కోట్ల కోత విధించింది ఓటీటీ సంస్థ.

మేకర్స్ కూడా ఒప్పుకున్నారని సమాచారం. అయితే సినిమా పేలవమైన ప్రదర్శన కారణంగా రూ. 20 కోట్లు నష్టపోయారు. సినిమాకు నిర్మాతలుగా వ్యవహరించిన కమల్ హాసన్, మణిరత్నం ఓటీటీ డీల్ తో భారీగా లాస్ అయ్యారు. జులై మొదటి వారంలో థగ్ లైఫ్ మూవీ స్ట్రీమింగ్ కు రానుందని సినీ వర్గాల్లో టాక్.

ఇక మూవీ విషయానికి వస్తే, రంగరాయ శక్తిరాజు (కమల్ హాసన్) ఓ గ్యాంగ్‌ స్టర్. అయితే అనుకోకుండా తండ్రిని కోల్పోయిన అమర్ (శింబు) అనే కుర్రాడిని పెంచుకుంటాడు. తన ముఠాకు అమర్‌ను నాయకుడిగా చేస్తాడు. దీన్ని అదే ముఠాలోని ఇతర సభ్యులు జీర్ణించుకోలేకపోతారు. ఇంతలోనే శక్తిరాజును చంపాలని అనకుంటారు. మరి చివరికి ఏం జరిగిందనేది సినిమా.