నెట్ ఫ్లిక్స్ తో కమల్ మరోసారి బేరాలు.. దేనికంటే?
లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో లోక నాయకుడు చేసిన సినిమా థగ్ లైఫ్. రీసెంట్ గానే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది.
By: Tupaki Desk | 10 Jun 2025 11:37 AM ISTలెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో లోక నాయకుడు చేసిన సినిమా థగ్ లైఫ్. రీసెంట్ గానే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. మణిరత్నం- కమల్ హాసన్ కాంబినేషన్ లో గతంలో వచ్చిన నాయగన్ సినిమా బ్లాక్ బస్టర్ అవడం, ఆ తర్వాత వీరిద్దరి కలయికలో 37 ఏళ్లకు వస్తున్న సినిమా కావడంతో థగ్ లైఫ్ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
దానికి తగ్గట్టే కమల్ హాసన్ కూడా థగ్ లైఫ్ ప్రమోషన్స్ లో సినిమా చాలా బాగా వచ్చిందని, నాయగన్ సినిమాను మించి ఈ సినిమా హిట్ అవుతుందని ధీమా వ్యక్తం చేయడంతో థగ్ లైఫ్ పై ఉన్న అంచనాలు తారా స్థాయికి చేరాయి. అదే నమ్మకంతో నెట్‌ఫ్లిక్స్ తో మాట్లాడి 8 వారాల తర్వాతే సినిమాను స్ట్రీమింగ్ చేసేలా ఒప్పించామని కూడా కమల్ చాలా గొప్పగా చెప్పారు.
కానీ థగ్ లైఫ్ రిలీజ్ తర్వాత మొత్తం మారిపోయింది. గత పదేళ్లలో భారీ ఫ్లాపులుగా నిలిచిన ఇండియన్2, కంగువా సినిమాలను దాటేలా థగ్ లైఫ్ కలెక్షన్లు కనిపిస్తున్నాయి. మరీ ఇంత దారుణమైన రిజల్ట్ వస్తుందని ఊహించని చిత్ర యూనిట్ కు ఈ సినిమా ద్వారా తీవ్ర నిరాశ ఎదురైంది. అయినప్పటికీ చేసేదేమీ లేక ఉన్న దాంట్లోనే డబ్బుని ఎలా రాబట్టుకోవాలనే ఆలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
అందులో భాగంగానే థగ్ లైఫ్ యూనిట్ తిరిగి నెట్ ఫ్లిక్స్ తో బేరసారాలు మొదలుపెట్టినట్టు కోలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి. 8 వారాలకు బదులు నెలకే సినిమాను స్ట్రీమింగ్ చేసేలా డీల్ కుదుర్చుకుని నెట్ ఫ్లిక్స్ నుంచి భారీ మొత్తం తీసుకోవాలని చూస్తున్నారట. ఆల్రెడీ థగ్ లైఫ్ టాక్ బయటకు వచ్చింది. డిజాస్టర్ అయిన థగ్ లైఫ్ సినిమాకు నెట్ ఫ్లిక్స్ ఎక్కువ మొత్తం ఇవ్వకపోయినా ముందు డీల్ కుదుర్చున్న దాని కంటే ఎక్కువే వచ్చే అవకాశముంది.
దానికి కారణం లేకపోలేదు. కొన్ని సినిమాలను థియేటర్లలో చూడకపోయినా ఓటీటీలో ఎక్కువ మంది చూస్తారు. కంగువా, విడాముయార్చి, రెట్రో లాంటి సినిమాలు దీన్ని ప్రూవ్ చేసి మంచి వ్యూస్ తెచ్చుకున్నాయి. ఇప్పుడు థగ్ లైఫ్ కూడా అదే దారిలో వెళ్లాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. మణిరత్నం కెరీర్లోనే వీక్ మూవీగా నిలిచిన థగ్ లైఫ్ రిజల్ట్ ను కమల్ హాసన్ కూడా ఇప్పట్లో మర్చిపోలేడు.