ఈ వారం కొత్త రిలీజులివే!
మరో వారం వచ్చేసింది. ప్రతీ వారం లానే ఈ వారం కూడా పలు సినిమాలు థియేటర్లలో రిలీజ్ కానుండగా ఇంకొన్ని ఓటీటీల్లోకి రాబోతున్నాయి.
By: Tupaki Desk | 21 July 2025 1:10 PM ISTమరో వారం వచ్చేసింది. ప్రతీ వారం లానే ఈ వారం కూడా పలు సినిమాలు థియేటర్లలో రిలీజ్ కానుండగా ఇంకొన్ని ఓటీటీల్లోకి రాబోతున్నాయి. అయితే ఈ వారం టాలీవుడ్ లో ఓ పెద్ద సినిమా రిలీజ్ కాబోతుంది. అదే హరి హర వీరమల్లు. పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ఎన్నో వాయిదాల తర్వాత జులై 24న రిలీజ్ కానుంది. తెలుగులో వీరమల్లు కాకుండా మరో సినిమా ఏదీ రిలీజవడం లేదు. దీంతో పాటూ ఈ వారం హోంబలే ఫిల్మ్ నిర్మించిన మహావతార్: నరసింహా కూడా రిలీజ్ కానుంది. అశ్విన్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ జులై 25న రిలీజ్ కానుంది.
ఇవి కాకుండా పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఓటీటీల్లోకి రానున్నాయి. అవేంటో, ఏ ప్లాట్‌ఫామ్స్ లో ఏవి రిలీజవుతున్నాయో చూద్దాం.
నెట్‌ఫ్లిక్స్‌లో..
ట్రైన్ రెక్: పీఐ మామ్స్ అనే ఇంగ్లీష్ మూవీ
ది హంటింగ్ వైవ్స్ అనే హాలీవుడ్ వెబ్‌సిరీస్
లెటర్స్ ఫ్రమ్ ది పాస్ట్ అనే ఇంగ్లీష్ వెబ్‌సిరీస్
క్రిటికల్: బిట్వీన్ లైఫ్ అండ్ డెత్ అనే హాలీవుడ్ వెబ్‌సిరీస్
హిట్ మేకర్స్ అనే హాలీవుడ్ సినిమా
ఏ నార్మల్ ఉమెన్ అనే ఇండోనేషియన్ మూవీ
మై మెలోడీ అండ్ కురోమి అనే జపనీస్ వెబ్‌సిరీస్
ట్రిగ్గర్ అనే కొరియన్ సిరీస్
మండల మర్డర్స్ అనే బాలీవుడ్ వెబ్‌సిరీస్
ప్రైమ్ వీడియోలో..
జస్టిస్ ఆన్ ట్రయల్ అనే హాలీవుడ్ వెబ్‌సిరీస్
హ్యాండ్సమ్ గాయ్స్ అనే కొరియన్ మూవీ
నోవాక్సిన్ అనే హాలీవుడ్ ఫిల్మ్
టిన్ సోల్జర్ అనే హాలీవుడ్ సినిమా
రంగీన్ అనే బాలీవుడ్ వెబ్‌సిరీస్
జియో హాట్‌స్టార్‌లో..
రోంత్ అనే తెలుగు డబ్బింగ్ మూవీ
ది సొసైటీ అనే బాలీవుడ్ రియాలిటీ షో
వాషింగ్టన్ బ్లాక్ అనే హాలీవుడ్ వెబ్‌సిరీస్
సర్జమీన్ అనే బాలీవుడ్ మూవీ
జీ5 లో..
సౌంకన్ సౌంకనీ అనే పంబాజీ మూవీ
సన్‌నెక్ట్స్‌లో..
ఎక్స్ అండ్ వై అనే కన్నడ సినిమా
షో టైమ్ అనే తెలుగు సినిమా
యాపిల్ ప్లస్ టీవీలో..
అకపుల్కో అనే హాలీవుడ్ వెబ్‌సిరీస్ సీజన్4
లయన్స్ గేట్ ప్లేలో..
ది ప్లాట్ అనే కొరియన్ సినిమా
ది సస్పెక్ట్ అనే హాలీవుడ్ వెబ్‌సిరీస్
జానీ ఇంగ్లీష్ స్టైక్స్ ఎగైన్ అనే ఇంగ్లీష్ మూవీ
ఎంఎక్స్ ప్లేయర్‌లో..
హంటర్ అనే బాలవుడ్ వెబ్‌సిరీస్ సీజన్2
