బిగ్‌బాస్ 9 : ఈ పాత వాళ్లు రీ ఎంట్రీ ఇవ్వనున్నారా?
తెలుగు బిగ్ బాస్ సీజన్ 9కు గ్రౌండ్ వర్క్ చాలా స్పీడ్‌గా జరుగుతోంది. ఇప్పటికే కంటెస్టెంట్స్ ఎంపిక విషయంలో ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
By: Tupaki Desk | 22 July 2025 12:42 PM ISTతెలుగు బిగ్ బాస్ సీజన్ 9కు గ్రౌండ్ వర్క్ చాలా స్పీడ్‌గా జరుగుతోంది. ఇప్పటికే కంటెస్టెంట్స్ ఎంపిక విషయంలో ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. దాదాపుగా 25 మందితో ఫైనల్ జాబితా తయారు చేశారని, అందులో సామాన్యులు కూడా ఉన్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ 25 మందికి మెసేజ్‌లు వెళ్లాయి, వారు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అందులో నుంచి కొందరిని తప్పించి ఫైనల్ కంటెస్టెంట్స్‌గా హౌస్‌లోకి పంపించే అవకాశాలు ఉన్నాయి. షో ప్రారంభానికి ముందు ఎవరైనా నియమ నిబంధనలు పాటించకుంటే వెంటనే వారిని తప్పించి వేరే వారికి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో అయిదు నుంచి పది మందిని స్టాండ్ బై లో పెడతారు అని టాక్. ఆ విషయం గురించి పక్కన పెడితే బిగ్ బాస్ 9 లో కొత్త వారు మాత్రమే కాకుండా పాత వారు కూడా ఉండే అవకాశం ఉందట. సెప్టెంబర్ మొదటి వారంలో షో మొదలు కావచ్చు.
సాధారణంగా బిగ్ బాస్‌కి వెళ్లాలి అంటే జీవితంలో ఒక్కసారి మాత్రమే అవకాశం ఉంటుంది అంటారు. కానీ ఇతర భాషల బిగ్‌బాస్‌కి అది వర్తిస్తుందేమో కానీ, తెలుగు బిగ్ బాస్‌కి మాత్రం అది వర్తించడం లేదు. గతంలోనూ బిగ్ బాస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన వారు ఉన్నారు. ఒక సీజన్‌లో ఎలిమినేట్ అయ్యి, అదే సీజన్‌లో బిగ్ బాస్ రీ ఎంట్రీ ఇచ్చిన వారు చాలా మంది ఉన్నారు. అంతే కాకుండా బిగ్ బాస్ ఒక సీజన్‌లో పాల్గొన్న వారు మరో సీజన్‌లు కనిపించారు. ఇతర భాషల బిగ్‌బాస్ లో పాల్గొన్న వారు తెలుగు బిగ్‌బాస్‌లో సందడి చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇతర భాషల బిగ్‌బాస్‌లతో పోల్చితే మన తెలుగు బిగ్ బాస్ చాలా విభిన్నం అనడంలో సందేహం లేదు.
తెలుగు బిగ్‌బాస్ సీజన్ 9 లో సెలబ్రిటీలతో పాటు దాదాపు సమానంగా సామాన్యులను హౌస్‌లోకి పంపించే యోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఆడిషన్స్ జరిగాయి. సెలబ్రిటీల్లో కొందరు ఇంతకు ముందు కంటెస్టెంట్స్‌గా వెళ్లిన వారు సైతం ఈ సీజన్‌కి వెళ్లే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. వారిలో ముఖ్యంగా వీజే సన్నీ, ప్రియాంక జైన్, మానస్‌లు బిగ్ బాస్‌లో సందడి చేశారు. ముగ్గురికి ముగ్గురు కూడా తమదైన శైలిలో మంచి వినోదాన్ని అందించారు. అందుకే బిగ్ బాస్ నిర్వాహకులు మరోసారి వీరిని హౌస్‌లోకి పంపించాలనే ఉద్దేశంతో ఉన్నారని తెలుస్తోంది. ఈ ముగ్గురు రీ ఎంట్రీ ఇవ్వడం వల్ల హౌస్‌లో ఉన్న ఇతర కంటెస్టెంట్స్ ఎలా రియాక్ట్ అవుతారు అనేది చూడాలి.
బిగ్ బాస్ సీజన్ 9 కి హోస్ట్ మారే అవకాశాలు ఉన్నాయని వార్తలు వచ్చాయి. విజయ్ దేవరకొండ, బాలకృష్ణ మొదలుకుని పెద్ద ఎత్తున హీరోల పేర్లు వినిపించాయి. కానీ నాగార్జున తప్ప ప్రస్తుతానికి మరే హీరో కూడా బిగ్ బాస్ కి హోస్ట్‌గా వ్యవహరించేందుకు ఆసక్తి చూపడం లేదు. తెలుగులో ఎంతో మంది స్టార్స్ ఉన్నప్పటికీ నాగార్జునకు మాత్రమే తెలుగు బిగ్ బాస్ చేసే అవకాశం దక్కుతుంది. అంతే కాకుండా ఆయనకు భారీ పారితోషికం ను నిర్వాహకులు ఇస్తున్నారు. సినిమాలు నిరాశ పరుస్తున్న ఈ సమయంలో నాగార్జున బ్యాక్ టు బ్యాక్ వరుసగా బిగ్ బాస్ సీజన్‌లను చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఈ సీజన్‌తో ఆయన ఎనిమిదవ సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరించబోతున్నారు.
