Begin typing your search above and press return to search.

ఫేమస్ 'స్ట్రేంజర్ థింగ్స్'.. సీజన్ 5 ట్రైలర్ చూశారా?

స్ట్రేంజర్ థింగ్స్ వెబ్ సిరీస్ గురించి అందరికీ తెలిసిందే. వరల్డ్ వైడ్ ఓటీటీ కంటెంట్ లో సెన్సేషనల్ హిట్ గా నిలిచిన ఆ వెబ్ సిరీస్ కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు.

By:  Tupaki Desk   |   17 July 2025 12:31 PM IST
ఫేమస్ స్ట్రేంజర్ థింగ్స్.. సీజన్ 5 ట్రైలర్ చూశారా?
X

స్ట్రేంజర్ థింగ్స్ వెబ్ సిరీస్ గురించి అందరికీ తెలిసిందే. వరల్డ్ వైడ్ ఓటీటీ కంటెంట్ లో సెన్సేషనల్ హిట్ గా నిలిచిన ఆ వెబ్ సిరీస్ కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఆ సిరీస్ కు యమా క్రేజ్ ఉంది. ఇప్పుడు స్ట్రేంజర్ థింగ్స్ సీజన్- 5 స్ట్రీమింగ్ కు సిద్ధమవుతోంది.

ఇప్పటికే స్ట్రేంజర్ సిరీస్ కు సంబంధించిన నాలుగు సీజన్లు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కించుకున్నాయి. ఇప్పుడు సీజన్ 5పై భారీ అంచనాలు ఉన్నాయి. సైన్స్ తో పాటు ఫాంటసీ థ్రిల్లర్ గా రూపొందిన ఆ సిరీస్ లో సీజన్ 5 చివరిది కాబోతుందని మేకర్స్ అనౌన్స్ చేయడంతో.. లాస్ట్ సీజన్ కోసం ఈగర్ గా అంతా వెయిట్ చేస్తున్నారు.

విజువల్ వండర్ గా ఉండబోతున్న ఆ సిరీస్.. దశలవారీగా విడుదల అవుతుంది. వాల్యూమ్ 1 నవంబర్ 26న ప్రీమియర్ అవుతుంది, వాల్యూమ్ 2 డిసెంబర్ 25న స్ట్రీమింగ్ కోసం అందుబాటులో ఉంటుంది. చివరగా డిసెంబర్ 31న సందడి చేయనుంది. ప్రస్తుతం సీజన్ 5 పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

అయితే సీజన్ 5 లో మిల్లీ బాబీ బ్రౌన్, విన్నా రైడర్, డేవిడ్ హార్బర్, ఫిన్ వోల్ఫ్‌హార్డ్, గేటెన్ మాటరాజ్జో, కాలేబ్ మెక్‌లాఫ్లిన్, నోహ్ ష్నౌ, సాడీ సింక్ సహా మరికొంత మంది కొత్త నటీనటులు కనిపించబోతున్నారు. నెల్ ఫిషర్, జేక్ కాన్నేల్లీ, అలెక్స్ బ్రూక్స్, లిండా హామిల్టన్ తదితరులు సీజన్ 5లో సందడి చేయనున్నారు.

ఇప్పుడు మేకర్స్ టీజర్ రిలీజ్ చేయగా.. మంచి రెస్పాన్స్ వస్తోంది. సిరీస్ లవర్స్ ను ఆకట్టుకుని మెప్పిస్తోంది. సిరీస్ భయానకంగా, భావోద్వేగపరంగా గాఢంగా ఉంటుందని హామీ ఇస్తుంది. దీంతో ఈ టీజర్ తర్వాత మాత్రం అంచనాలు మరింత పెరగడమే కాకుండా.. సిరీస్ కు ఒక పర్ఫెక్ట్ ముగింపుగా కూడా నిలుస్తుందనే చెప్పాలి.

ఎమోషనల్ గ్రావిటీ, ఎపిక్ సినిమాటిక్ స్కేల్, దెయ్యాల వాతావరణాలు, నీడ లాంటి రాక్షసులు, భావోద్వేగకరమైన కలయికలు, ఉత్కంఠభరితమైన సౌండ్‌ ట్రాక్, అద్భుతమైన VFX , అద్భుతమైన సినిమాటోగ్రఫీ.. అలా టీజర్ లో అన్నీ అంచనాలు పెంచుతున్నాయి. కొన్ని విజువల్స్ ఊహకు అందని విధంగా ఉన్నాయి. మరి సిరీస్ ఎలా ఉంటుందో.. ఎలా మెప్పిస్తుందో వేచి చూడాలి.