స్క్విడ్ గేమ్ 3.. పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే?
మరి ఇప్పుడు స్క్విడ్ గేమ్ 3 ఎలాంటి? ఆడియన్స్ ఏమంటున్నారు? పబ్లిక్ టాక్ సంగతేంటి?
By: Tupaki Desk | 28 Jun 2025 3:47 PM ISTవెబ్ సిరీస్ స్క్విడ్ గేమ్ కు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఇప్పటికే రెండు సీజన్లు వచ్చి ఆడియన్స్ ను ఓ రేంజ్ లో ఆకట్టుకోగా.. ఇప్పుడు మూడో సీజన్ అందుబాటులోకి వచ్చేసింది. స్ట్రీమింగ్ కు ముందే ఆడియన్స్ లో సూపర్ బజ్ క్రియేట్ అయింది. మరి ఇప్పుడు స్క్విడ్ గేమ్ 3 ఎలాంటి? ఆడియన్స్ ఏమంటున్నారు? పబ్లిక్ టాక్ సంగతేంటి?
ఆడియన్స్ రివ్యూస్ ప్రకారం, సీజన్ 2 ఎక్కడైతే ముగిసిందో.. అక్కడి నుంచే సీజన్ 3 కథ ప్రారంభం అవుతుంది. సిరీస్ చూస్తున్నంత సేపు ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ పెరుగూ పోతూ ఉంటోంది. కత్తులు- తాళాలు ఆట ఆద్యంతం ఉత్కంఠతో సాగుతుంది. స్కిప్పింగ్ గేమ్ మొదలయ్యాక అయితే సిరీస్ ఆద్యంతం థ్రిల్ పంచుతుంది.
ఒక్కో సీన్ వేరే లెవెల్ అని నెటిజన్లు చెబుతున్నారు. కొన్ని సన్నివేశాలు ఎవరూ ఊహించరని అంటున్నారు. ఎమోషనల్ డ్రామాపై ఎక్కువ ఫోకస్ పెట్టారని తెలుస్తోంది. అప్పటికప్పుడే మారిపోయే మనుషుల మనస్తత్వాలను ప్రతిబింబించేలా సన్నివేశాలను డైరెక్టెర్ హ్వాంగ్ డాగ్ హ్యూక్ తీర్చిదిద్దిన విధానం ఆద్యంతం అందిరనీ మెప్పిస్తుందని చెబుతున్నారు.
సిరీస్ లో నటించిన వారంతా తమ పాత్రలకు న్యాయం చేశారని కామెంట్లు పెడుతున్నారు. ప్రతీ రోల్ కూడా ఆకట్టుకునేలా ఉందని అంటున్నారు. థ్రిల్లింగ్ అండ్ ఎంగేజింగ్ సిరీస్ అని చెబుతున్నారు. టెక్నికల్ పరంగా సిరీస్ సూపర్ అని, సినిమాటోగ్రఫీ, సెట్ డిజైన్స్ తో ప్రతి ఒక్క ప్రేక్షకుడిని మేకర్స్ మరో ప్రపంచంలోకి తీసుకెళ్లారని అంటున్నారు.
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో పాటు చిన్నారుల గేమ్స్ సూపర్ అని చెబుతున్నారు. డైలాగ్స్ అన్నీ బాగున్నాయని, ముఖ్యంగా మేము గుర్రాలం కాదు.. మనుషులం అంటూ జీ హును చెప్పే డైలాగ్ హార్ట్ టచింగ్ అని అంటున్నారు. మొత్తం ఆరు ఎపిసోడ్స్ ఉండగా.. ఒక్కో ఎపిసోడ్ సుమారు 1 గంట పైనే ఉందని, కానీ బోర్ కొట్టలేదని రివ్యూ ఇస్తున్నారు.
చివరగా గేమ్స్ లో ట్విస్టుల మీద ట్విస్టులు, లీడ్ రోల్స్ యాక్టింగ్ తో పాటు వాటి క్యారెక్టరైజేషన్, సినిమాటోగ్రఫీ, నేపథ్య సంగీతం, డైరెక్షన్ ప్లస్ పాయింట్స్ అని చెబుతున్నారు. అక్కడక్కడ నెమ్మదిగా సాగే సన్నివేశాలతో పాటు రన్ టైమ్ మైనస్ పాయింట్లుగా కామెంట్లు పెడుతున్నారు. కానీ ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ పెంచుతూనే సిరీస్ ఉంటుందని అంటున్నారు. మరి మీరు చూశారా?