Begin typing your search above and press return to search.

అప్పుడే మూడో సీజన్‌... ఈసారైనా హిట్‌ కొట్టేనా?

ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీ సొంతం చేసుకున్న స్క్విడ్‌ గేమ్‌ వెబ్‌ సిరీస్‌ ఇప్పటి వరకు రెండు సీజన్‌లు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

By:  Tupaki Desk   |   6 May 2025 10:33 AM IST
Squid Game Season 3 Set to Stream on June 27
X

ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీ సొంతం చేసుకున్న స్క్విడ్‌ గేమ్‌ వెబ్‌ సిరీస్‌ ఇప్పటి వరకు రెండు సీజన్‌లు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నెట్‌ఫ్లిక్స్‌ అత్యధిక వ్యూస్‌ను సొంతం చేసుకున్న వెబ్‌ సిరీస్‌గా ఈ సిరీస్‌ నిలిచిన విషయం తెల్సిందే. స్వ్కిడ్‌ గేమ్ వెబ్‌ సిరీస్‌ మొదటి సీజన్‌కి ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల నుంచి సూపర్‌ హిట్ టాక్‌ వచ్చింది. పలు భాషల్లో స్ట్రీమింగ్‌ అయ్యి దాదాపు అన్ని భాషల్లోనూ అత్యధిక వ్యూస్ సొంతం చేసుకున్న వెబ్‌ సిరీస్‌గా నిలిచింది. మొదటి సీజన్‌ ను 2021 సెప్టెంబర్‌ 17 నుంచి స్ట్రీమింగ్‌ చేశారు. మొదటి సీజన్‌కి వచ్చిన స్పందనతో మరిన్ని సీజన్‌లను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు మేకర్స్ రెడీ అయ్యారు.

మొదటి సీజన్‌ స్ట్రీమింగ్‌ అయిన దాదాపు మూడు ఏళ్ల తర్వాత స్క్విడ్‌ గేమ్‌ సీజన్‌ 2 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గత ఏడాది డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సీజన్‌ 2 కి మిశ్రమ స్పందన దక్కింది. మొదటి సీజన్‌తో పోల్చితే కంటెంట్‌ పరంగా క్వాలిటీ మిస్ అయిందనే విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా కొన్ని సీన్స్ విషయంలో ప్రేక్షకులు నిరుత్సాహం వ్యక్తం చేశారు. సీజన్ 2 కూడా ఎక్కువ భాషల్లో స్ట్రీమింగ్ అయింది. అయినా కూడా మొదటి సీజన్‌ స్థాయిలో వ్యూస్‌, వాచ్ టైమ్‌ను సొంతం చేసుకోలేక పోయింది. కథను బలంతంగా ప్రేక్షకుల మీద రుద్దినట్లుగా సీజన్ 2 ఉందని కొందరు నెటిజన్స్‌, ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

మొదటి సీజన్‌ తర్వాత రెండో సీజన్‌ రావడానికి మూడు ఏళ్ల సమయం పట్టింది. కానీ మూడో సీజన్‌కి ఏడాది కూడా గ్యాప్ ఇవ్వకుండా స్ట్రీమింగ్‌కు రెడీ చేశారు. స్క్విడ్‌ గేమ్‌ సీజన్‌ 3 ను ఈ ఏడాది జూన్‌ 27 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటన చేసింది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. అంతే కాకుండా టీజర్‌ను సైతం విడుదల చేశారు. ఎప్పటిలాగే టీజర్‌ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంది. మూడో సీజన్‌లో మంచి కంటెంట్‌ ఉంటుంది అనే విశ్వాసం కలిగిస్తుంది. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసి పోస్ట్‌ ప్రొడక్షన్ వర్క్ కూడా దాదాపు పూర్తి చేసినట్లు సమాచారం అందుతోంది.

రెండో సీజన్‌ నిరాశ పరచిన నేపథ్యంలో మూడో పార్ట్‌ విషయంలో జాగ్రత్తలు తీసుకుని ఉంటారని తెలుస్తోంది. మొదటి పార్ట్‌ రేంజ్‌లో మూడో పార్ట్‌ విజయాన్ని సొంతం చేసుకుంటుందా అనే ఆసక్తి అందరిలోనూ వ్యక్తం అవుతోంది. సీజన్‌ 1 వచ్చిన సమయంలో కంటెంట్‌ కొత్తగా అనిపించి, అప్పటి వరకు చూడని సన్నివేశాలు ఉండటంతో అంతా ఆశ్చర్యపోయారు. అందుకే ఆ సీజన్‌ను ఎక్కువ మంది చూశారు. కానీ ఇప్పుడు అదే కంటెంట్‌ను మళ్లీ మళ్లీ చూపించడం వల్ల ప్రేక్షకులు బోర్‌ ఫీల్‌ అవుతున్నారేమో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సీజన్‌ 2 జరిగిన తప్పులు పునరావృతం కాకుండా సీజన్‌ 3 కి జాగ్రత్త పడితే హిట్ కొట్టేనా చూడాలి.

ఈ సర్వైవల్‌ థ్రిల్లర్‌కి హ్వాంగ్‌ దర్శకత్వం వహించగా, లీ జంగ్‌ జే ముఖ్య పాత్రలో నటించాడు. మొదటి సీజన్‌కి గాను పలు అవార్డులు, రివార్డులు అందుకున్న మేకర్స్‌ ఎన్నో అరుదైన రికార్డ్‌లను సొంతం చేసుకున్నారు. సీజన్‌ 1 94 దేశాల్లో అత్యధికంగా వీక్షించిన వెబ్‌ సిరీస్‌గా నిలిచింది. 1.65 బిలియన్ వ్యూ అవర్స్‌ను సొంతం చసుకుంది. 14 ప్రైమ్‌ టైమ్ ఎమ్మీ అవార్డ్‌ను అందుకున్న విషయం తెల్సిందే. స్క్విడ్‌ గేమ్‌ వచ్చిన తర్వాత ఇలాంటి వెబ్‌ సిరీస్‌లు పేరడీగా చాలానే వస్తున్నాయి. సీజన్‌ 3 హిట్ అయితే ముందు ముందు మరిన్ని సీజన్‌లు వచ్చే అవకాశాలు ఉన్నాయి.