వరల్డ్ ఫేమస్ సిరీస్ ఫైనల్ సీజన్ డేట్ ఫిక్స్
ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ఆధరణ దక్కించుకున్న వెబ్ సిరీస్‌ల్లో స్క్విడ్ గేమ్ ముందు ఉంటుంది అనడంలో సందేహం లేదు.
By: Tupaki Desk | 13 Jun 2025 7:03 AMప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ఆధరణ దక్కించుకున్న వెబ్ సిరీస్‌ల్లో స్క్విడ్ గేమ్ ముందు ఉంటుంది అనడంలో సందేహం లేదు. ఈ కొరియన్ వెబ్ సిరీస్ ఇప్పటి వరకు రెండు సీజన్‌లు పూర్తి చేసుకుంది. చివరిదైన మూడో సీజన్ కోసం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కొన్ని వారాల క్రితం స్క్విడ్ గేమ్ సీజన్ 3 ట్రైలర్ వచ్చింది. మొదటి రెండు సీజన్‌లకు ఏమాత్రం తీసి పోకుండా మూడో సీజన్ ఉండబోతుందని ఆ ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరు అనుకున్నారు. సర్వైవల్ గేమ్స్ మరింత హింసాత్మకంగా మారబోతున్నాయని, మరింత ఆసక్తికరంగా సీజన్ 3 ఉంటుందనే నమ్మకంతో ఎప్పుడు ఎప్పుడు చూస్తామా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.
మోస్ట్ అవైటెడ్ స్క్విడ్ గేమ్ సీజన్ 3 స్ట్రీమింగ్ డేట్‌ను నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. జూన్ 27, 2025 నుంచి సీజన్ 3 స్ట్రీమింగ్ కాబోతుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌తో పాటు, కొన్ని పోస్టర్స్ కారణంగా అంచనాలు పెరుగుతూ వచ్చాయి. మొదటి రెండు సీజన్‌లకు కొనసాగింపుగా ఈ సీజన్ కథ ఉంటుంది. అంతే కాకుండా ఈ సీజన్‌తో కథ ముగుస్తుందని కూడా అధికారికంగా ప్రకటన వచ్చింది. ది ఫైనల్ సీజన్ అంటూ స్క్విడ్ గేమ్ సీజన్ 3 ని నెట్ ఫ్లిక్స్ అధికారికంగా పేర్కొనడంతో మొదటి రెండు సీజన్‌లు చూసిన ప్రతి ఒక్కరూ మూడో సీజన్‌ను చూడాలి అనుకుంటున్నారు. అంతే కాకుండా మొదటి రెండు సీజన్‌లలో ఏ ఒక్క సీజన్ చూసిన వారు అయినా సీజన్ 3 చూసేందుకు ఆసక్తిగా ఉన్నారు.
మొదటి సీజన్ 2021, సెప్టెంబర్ 17న నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్ చేసింది. మొదట కొరియన్ భాషలో వచ్చిన ఈ వెబ్ సిరీస్ ఆ తర్వాత అంతర్జాతీయ స్థాయిలో పదుల సంఖ్య భాషల్లో స్ట్రీమింగ్ అవుతూ వచ్చింది. ఇండియాలోనూ పలు భాషల్లో స్ట్రీమింగ్ అయింది. మీడియాలో ఈ వెబ్ సిరీస్‌కి వచ్చిన పబ్లిసిటీ నేపథ్యంలో ఇండియాలోనూ చాలా మంది ఈ వెబ్ సిరీస్‌కి ఫ్యాన్స్ అయ్యారు. అందుకే తెలుగు ప్రేక్షకులకు ఇతర సౌత్ ఇండియన్ ప్రేక్షకులు ఈ వెబ్ సిరీస్‌ను అందించాలనే ఉద్దేశంతో సీజన్ 2 ను తెలుగులో అనువదించి అందించారు. ఈ కొరియన్ వెబ్ సిరీస్‌కి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఈ వెబ్ సిరీస్ మొత్తం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారు ప్రాణాంతకమైన ఆటను ఆడి డబ్బులు గెలుచుకోవడం అనే కథ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఈ సిరీస్ టైటిల్కొరియన్ పిల్లల ఆట అయిన ఓజింజియో అంటే స్క్విడ్ గేమ్ నుంచి తీసుకున్నారు. నెట్‌ఫ్లిక్స్ లో యొక్క అత్యధికంగా వీక్షించబడిన సిరీస్‌గా ఇది నిలిచింది. అంతే కాకుండా ఆరు ప్రైమ్‌టైమ్ ఎమ్మీ అవార్డులు, ఒక గోల్డెన్ గ్లోబ్‌తో సహా అనేక అవార్డులను, ప్రశంసలను అందుకుంది. ప్రపంచ వ్యాప్తంగా నెట్‌ఫ్లిక్స్ ఖాతాదారులను అత్యధికంగా పెంచడంలో ఈ సిరీస్ కీలక పాత్ర పోషించిందని మార్కెట్ వర్గాల వారు అంటూ ఉంటారు. ఇలాంటి వెబ్ సిరీస్ చివరి సీజన్ ఇదే కావడంతో అభిమానులు సైతం ఒకింత నిరుత్సాహం ను వ్యక్తం చేస్తున్నారు. మూడో సీజన్‌కి ఎలాంటి ఫలితం దక్కుతుంది అనేది జూన్ 27తో తేలిపోనుంది. తెలుగులోనూ అదే సమయంలో స్ట్రీమింగ్ అవుతుందా అనేది చూడాలి.