Begin typing your search above and press return to search.

సంక్రాంతికి ఓటీటీ సినిమాల జాతర..!

ఈ వారం కూడా మొత్తం 29 సినిమాలు, సిరీస్ లు ఓటీటీ ప్రేక్షకులను ఎంటర్‌ టైన్ చేసే అవకాశాలు ఉన్నాయి.

By:  Tupaki Desk   |   8 Jan 2024 9:34 AM GMT
సంక్రాంతికి ఓటీటీ సినిమాల జాతర..!
X

ఈ వారం సంక్రాంతి సందర్భంగా తెలుగు ప్రేక్షకుల ముందుకు గుంటూరు కారం, నా సామి రంగ, సైంధవ్‌ మరియు హనుమాన్ సినిమాలు రాబోతున్న విషయం తెల్సిందే. వాటితో పాటు రెండు తమిళ సినిమాలను కూడా ఈ వారంలోనే తెలుగు లో డబ్‌ చేసి విడుదల చేయబోతున్నారు. మొత్తానికి ఈ వారం థియేట్రికల్‌ రిలీజ్ లు చాలానే ఉన్నాయి.

ప్రతి వారం మాదిరిగానే ఈ వారం కూడా థియేట్రికల్‌ రిలీజ్ సినిమాలకు ఏమాత్రం తగ్గకుండా ఓటీటీ సినిమాలు మరియు సిరీస్ లు రాబోతున్నాయి. ఈ వారం ఏకంగా 29 సినిమాలు, సిరీస్ లు ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అందులో కొన్ని పెద్ద తెలుగు సినిమాలు కూడా ఉన్నాయి.

ఓటీటీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌, కిల్లర్ సూప్‌, అజయ్‌ గాడు, ద లెజెండ్‌ ఆఫ్ హనుమాన్‌, ఉస్తాద్‌ టాక్‌ షో ఈ వారం స్ట్రీమింగ్‌ కి రెడీగా ఉన్నాయి. నేటి నుంచే సిరీస్ లు మరియు సినిమాల స్ట్రీమింగ్ మొదలు అవ్వబోతున్నాయి.

నెట్ ఫ్లిక్స్ లో ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌ సినిమా జనవరి 12న స్ట్రీమింగ్ అవ్వబోతుంది. జీ5 లో అజయ్ గాడు సినిమా సంక్రాంతి సందర్భంగా స్ట్రీమింగ్ అవ్వబోతుంది. ఇవే కాకుండా పలు వెబ్‌ సిరీస్‌ లు మరియు సినిమాలు ఆయా ఓటీటీ ల్లో ప్రేక్షకులకు వినోదాన్ని అందించబోతున్నాయి.

ఇంగ్లీష్ వెబ్‌ సిరీస్‌ తో పాటు ఇతర విదేశీ భాషల సినిమాలు, వెబ్ సిరీస్ లు ఇండియన్‌ ఓటీటీ ప్రేక్షకులను ఎంటర్‌ టైన్ చేస్తున్నాయి. ఈ వారం కూడా మొత్తం 29 సినిమాలు, సిరీస్ లు ఓటీటీ ప్రేక్షకులను ఎంటర్‌ టైన్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ సంక్రాంతికి కచ్చితంగా వినోదాల విందు ఖాయం.