Begin typing your search above and press return to search.

సామజవరగమన OTT అప్డేట్..!

థియేట్రికల్ రన్ లోనే బ్లాక్ బస్టర్

By:  Tupaki Desk   |   21 July 2023 8:23 AM GMT
సామజవరగమన OTT అప్డేట్..!
X

శ్రీవిష్ణు హీరోగా రామ్ అబ్బరాజు డైరెక్షన్ లో వచ్చిన సినిమా సామజవరగమన. జూన్ 29న రిలీజైన ఈ సినిమా సూపర్ హిట్ అందుకుంది. చాలాకాలం తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం ఫుల్ ఎంటర్టైన్ అయ్యేలా సినిమా వచ్చిందని ఆడియన్స్ రెస్పాన్స్ ఈ సినిమాకు మంచి వసూళ్లను తెచ్చి పెట్టింది. లో బడ్జెట్ లో తెరకెక్కిన ఈ సినిమా మౌత్ టాక్ తో మెమరబుల్ హిట్ అందుకుంది. కొన్నాళ్లుగా శ్రీ విష్ణుకి సరైన హిట్ లేకపోవడంతో సామజవరగమన ఆకలి తీర్చేసింది.

తన కథలతో మంచి ఎంటర్టైనర్స్ ని ఆడియన్స్ కు అందిస్తున్న శ్రీ విష్ణు సామజవరగమన సినిమాతో కమర్షియల్ హిట్ అందుకున్నాడు. ఇక ఈ సినిమా థియేటర్ లో చూసి మళ్లీ చూడాలనుకునే ఆడియన్స్ తో పాటుగా థియేటర్ లో మిస్సైన ఆడియన్స్ కూడా ఓటీటీ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. సామజవరగమన సినిమాను ఆహా ఓటీటీ డిజిటల్ రైట్స్ కొనేసింది. సినిమాను ఓటీటీ ఆడియన్స్ కోసం జూలై 28న రిలీజ్ చేస్తున్నారు.

థియేటర్ లో ఆడియన్స్ ని కడుపుబ్బా నవ్వించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసేందుకు వచ్చేస్తుంది. శ్రీ విష్ణు, నరేష్ ల మధ్య వచ్చే సన్నివేశాలు ఆడియన్స్ ని అలరించాయి. శ్రీ విష్ణు సరసన రెబా మోనికా జాన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను రాజేష్ దండ నిర్మించారు.

థియేట్రికల్ రన్ లోనే బ్లాక్ బస్టర్ కొట్టిన సామజవరగమన సినిమా ఓటీటీ ఆడియన్స్ ని కూడా మెప్పిస్తుందా లేదా అన్నది చూడాలి. ఓటీటీ ఆడియన్స్ అంతా ఈగర్ గా ఎదురుచూస్తున్న సామజవరగమన ఆహా ఓటీటీకి ఏ రేంజ్ వ్యూయర్ షిప్ తెస్తుందో చూడాలి. శ్రీ విష్ణు కి సామజవరగమన హిట్ ఫుల్ ఎనర్జీని ఇచ్చింది. ఈ సినిమా తర్వాత మరింత ఉత్సాహంతో యువ హీరో సినిమాలు చేస్తాడని చెప్పొచ్చు.

సామజవరగమన సినిమాను వెంకటేష్ నటించిన నువ్వు నాకు నచ్చావ్ సినిమాతో పోల్చారు కొందరు ఆడియన్స్. కంప్లీట్ ఎంటర్టైనర్ గా ఆడియన్స్ ని మెప్పించడంలో సూపర్ సక్సెస్ అయ్యింది ఈ సినిమా. తప్పకుండా ఈ సినిమా విజయం ఇలాంటి మరెన్నో సినిమాలకు నాంది పలుకుతుందని చెప్పొచ్చు.