ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకున్న రాకాస.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?
ఈ సినిమా విడుదలకు ముందే డిజిటల్ హక్కులను ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ సుమారుగా 10 కోట్ల రూపాయల ఫ్యాన్సీ ధరను వెచ్చించి మరీ దక్కించుకుంది.
By: Madhu Reddy | 26 April 2026 9:57 AM ISTప్రముఖ యంగ్ హీరో సంగీత్ శోభన్ హీరోగా, నయన్ సారిక హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన లవ్ యాక్షన్ కామెడీ ఫాంటసీ మూవీ రాకాస. గుడ్ ఫ్రైడే సందర్భంగా ఏప్రిల్ 3వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటి షో తోనే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇక పైగా ఈ సినిమా ప్రమోషన్స్ లో అటు నిహారిక ఇటు డైరెక్టర్ మానస శర్మ అందరి దృష్టిని ఆకట్టుకున్నారు.. ముఖ్యంగా మానస శర్మ లుక్స్ చూసి హీరోయిన్ షామిలి లా ఉంది అంటూ చాలామంది కామెంట్లు కూడా చేశారు.. అలా ఒక్కసారిగా పాపులర్ అయిపోయారు. దీంతో ఈ సినిమా ఎలాగైనా చూడాలని అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూడగా .. అభిమానులను మెప్పిస్తూ ప్రేక్షకుల చేత ప్రశంసలు కురిపించుకుంది ఈ సినిమా. ఇకపోతే ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూడగా.. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి రాబోతోంది.
ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమైన రాకాస..
ఈ సినిమా విడుదలకు ముందే డిజిటల్ హక్కులను ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ సుమారుగా 10 కోట్ల రూపాయల ఫ్యాన్సీ ధరను వెచ్చించి మరీ దక్కించుకుంది. ఇకపోతే తక్కువ బడ్జెట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి రూ.14 కోట్ల షేర్ వసూలు చేయడమే కాకుండా పంపిణీ దారులకు సుమారుగా కోటి రూపాయల మేరా లాభాలను మిగిల్చి.. క్లీన్ హిట్ గా నిలిచిన ఈ సినిమాను.. ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ గా మే 1వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ చేయడానికి మేకర్స్ సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని నెట్ ఫ్లిక్స్ తన కేటలాగ్ లో అధికారికంగా అనౌన్స్ చేసింది. తెలుగుతోపాటు తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమాను అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. రూ.15 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా సుమారుగా రూ.27 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.
రాకాస మూవీ స్టోరీ..
అమెరికాలో ఉద్యోగం చేస్తూ ఇండియాలో తాను ప్రేమించిన సుకన్యను వివాహం చేసుకోవాలని సొంతూరు కి వస్తాడు వీరు( సంగీత్ శోభన్). అయితే అప్పటికే సుకన్య పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకోవడానికి సిద్ధమవుతుంది. బ్రేకప్ బాధలో ఉన్న వీరు.. అదే సమయంలో సోము (వెన్నెల కిషోర్) అనే వ్యక్తిని హత్య చేశాడని ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే అతని పాస్పోర్టును పోలీసులు తీసుకెళ్లి పోతారు. సోము జాడను కనిపెడితే తన పాస్పోర్ట్ తిరిగి వస్తుందని స్నేహితుడు బాలు (గెటప్ శ్రీను) తో కలసి సోముని వెతికే ప్రయత్నం చేస్తాడు.. అదే సమయంలో ఆ ఊరి చివరిలో ఎన్నో దశాబ్దాలుగా ఉన్న బ్రహ్మ రాక్షసుడికి నరబలి ఇవ్వాల్సిన సమయం వస్తుంది . దీంతో ఆ ఊరంతా కలిసి ఒక ముసలివాడిని బలివ్వడానికి సిద్ధమవుతారు. అయితే చివరి క్షణంలో అతడు చనిపోతాడు. దాంతో అతడికి బదులుగా బాలు వెళ్లాల్సి వస్తుంది. ఇక వీరు దానికి అడ్డుపడతాడు.. దీంతో బాలుకి బదులుగా వీరు ఆ కోటలోకి ప్రవేశిస్తాడు? ఆ తర్వాత ఏమైంది? ఆ కోట ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఏంటి? నిజంగానే బ్రహ్మ రాక్షసుడు అక్కడ ఉన్నాడా ?ఈ ప్రయాణంలో హీరోయిన్తో పరిచయం ఎలా ఏర్పడింది? ఆమె ఎందుకు ఈ కోటలోకి వెళ్ళింది? సోము సంగతి ఏంటి ? ఇలా పలు ప్రశ్నలకు సమాధానం తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే. ఇప్పటికే థియేటర్లలో సందడి చేసిన ఈ సినిమా ఇటు ఓటిటిలో ఎలాంటి వ్యూస్ సొంతం చేసుకుంటుందో చూడాలి.
