Begin typing your search above and press return to search.

మోస్ట్‌ అవైటెడ్‌ అడల్ట్‌ కామెడీ మూవీ ఓటీటీలో వచ్చేసింది..!

రాధిక ఆప్టే ముఖ్య పాత్రలో నటించిన 'సిస్టర్‌ మిడ్‌నైట్‌' సినిమా పలు అవార్డులను సొంతం చేసుకోవడం మాత్రమే కాకుండా, విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది.

By:  Tupaki Desk   |   18 Jun 2025 4:24 PM IST
మోస్ట్‌ అవైటెడ్‌ అడల్ట్‌ కామెడీ మూవీ ఓటీటీలో వచ్చేసింది..!
X

రాధిక ఆప్టే ముఖ్య పాత్రలో నటించిన 'సిస్టర్‌ మిడ్‌నైట్‌' సినిమా పలు అవార్డులను సొంతం చేసుకోవడం మాత్రమే కాకుండా, విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ఇండియాలో కాకుండా ఈ సినిమా విదేశాల్లో మొదట విడుదలైంది. 2024 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో డైరెక్టర్స్ ఫోర్ట్‌నైట్ విభాగంలో 19 మే 2024న వరల్డ్ ప్రీమియర్‌ను ప్రదర్శించింది. అంతే కాకుండా బ్రిటీష్ రచయిత, దర్శకుడు, నిర్మాత అత్యుత్తమ మొదటి సినిమా కేటగిరీలో 78వ BAFTA అవార్డ్స్‌లో నామినేట్ చేయబడింది. ఇలా ఎన్నో చోట్ల ఈ సినిమాకు ప్రశంసలు దక్కాయి. పలు అవార్డ్‌లకు నామినేట్‌ కాబడింది. ఇలాంటి అడల్ట్‌ కామెడీ సినిమాను ఇండియాలో థియేట్రికల్‌ రిలీజ్‌ చేశారు, కానీ ప్రేక్షకుల ఆధరణ దక్కలేదు.

థియేట్రికల్‌ రిలీజ్‌లో ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. మేకర్స్ పెద్దగా ప్రమోట్‌ చేయలేదనే విమర్శలు వచ్చాయి. సినిమా థియేట్రికల్‌ రిలీజ్‌లో నిరాశ పరచడంతో ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్‌కి సిద్ధం అయ్యారు. థియేట్రికల్‌ రిలీజ్‌ అయిన తక్కువ సమయంలోనే ఈ సినిమాను ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు మేకర్స్ సిద్ధం అయ్యారు. ప్రస్తుతం ఈ సినిమా యూకేలో కొన్ని ఓటీటీ ప్లాట్‌ ఫామ్స్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్‌ అవుతోంది. త్వరలోనే ఇతర దేశాల్లోనే ఈ సినిమా స్ట్రీమింగ్‌ కాబోతుంది. ఇండియాలో ఓటీటీ స్ట్రీమింగ్‌ కావాలంటే కొంత సమయం వెయిట్‌ చేయాల్సి ఉంది. అయితే యూకేలో హిందీ భాషలో స్ట్రీమింగ్‌ కావడం విశేషం.

ఈనెల చివరి వారంలో ఇండియాలో కూడా అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ఈ సినిమాను స్ట్రీమింగ్‌ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌ కావడంతో అందుబాటులో ఉన్నవారు తెగ చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇండియాలో కూడా ఈ సినిమాను చూడటం కోసం ఓటీటీ ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మోస్ట్‌ అవైటెడ్‌ అడల్ట్‌ కంటెంట్‌ కామెడీ సినిమాగా నిలిచిన ఈ సినిమాను ఇండియాలో అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోతో పాటు మరో ప్రముఖ ఓటీటీలోనూ అందుబాటులో ఉంచే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ సినిమా సడెన్‌గా అక్కడ ఓటీటీ స్ట్రీమింగ్‌ కావడంతో ఇక్కడ ఎప్పుడు అంటూ నెటిజన్స్‌ సోషల్‌ మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నారు.

రాధిక ఆప్టే ఈ సినిమాలో విభిన్నమైన పాత్రలో నటించింది. ఆమె లుక్‌తో పాటు, ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఇష్టం లేని పెళ్లి చేసుకుని ముంబై లోని ఒక మురికి వాడలో జీవితాన్ని సాగిస్తూ ఉంటుంది. భర్తతో శారీకర సుఖం లేకపోవడంతో ఏం చేసింది అనేది ఈ సినిమాలో చూపించారు. విభిన్నమైన కథ, కథనంతో రూపొందిన సినిమా కావడంతో కమర్షియల్‌ ఎలిమెంట్స్ ఉన్నాయనే టాక్‌ వచ్చింది. మరో వైపు ఈ సినిమాలో అడల్ట్‌ కంటెంట్‌ మాత్రమే కాకుండా మంచి మెసేజ్‌ కూడా ఉందని నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమాలో రాధిక ఆప్టే నటన విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ఈ సినిమాకు కరణ్‌ కంధారి దర్శకత్వం వహించారు.