భారీ రేటుకు డ్యూడ్ డిజిటల్ రైట్స్
షార్ట్ ఫిల్మ్స్ తో కెరీర్ ను స్టార్ట్ చేసిన ప్రదీప్ రంగనాథన్ ఆ తర్వాత డైరెక్టర్ గా, హీరోగా మారి తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు.
By: Tupaki Desk | 4 July 2025 3:24 PM ISTషార్ట్ ఫిల్మ్స్ తో కెరీర్ ను స్టార్ట్ చేసిన ప్రదీప్ రంగనాథన్ ఆ తర్వాత డైరెక్టర్ గా, హీరోగా మారి తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. హీరోగా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో దూసుకెళ్తున్న ప్రదీప్ స్వీయ దర్శకత్వంలో చేసిన లవ్ టుడే సినిమాతో మంచి హిట్ ను అందుకున్నారు. ఆ తర్వాత డ్రాగన్ సినిమాతో తెలుగు, తమిళ భాషల్లో చాలా బాగా పాపులరయ్యారు.
డ్రాగన్ సినిమాతో రూ.100 కోట్ల క్లబ్ లో చేరిన ప్రదీప్ రంగనాథన్ ఆ సక్సెస్ ఇచ్చిన జోష్ లో వరుస సినిమాలను లైన్ లో పెట్టారు. అందులో భాగంగానే ప్రస్తుతం ప్రదీప్ రెండు సినిమాలు చేస్తున్నారు. అందులో ఒకటి లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ కాగా రెండోది డ్యూడ్ అనే యూత్ ఫుల్ సినిమా. స్టార్ డైరెక్టర్ సుధా కొంగర వద్ద అసిస్టెంట్ గా వర్క్ చేసిన కీర్తీశ్వరన్ డ్యూడ్ తో డైరెక్టర్ గా మారుతున్నారు.
తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రేమలు ఫేమ్ మమిత బైజు హీరోయిన్ గా నటిస్తుండగా, ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. డ్యూడ్ మూవీలో సీనియర్ హీరో శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తుండగా, ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ రైట్స్ గురించి సోషల్ మీడియాలో ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తోంది.
డ్యూడ్ సినిమా రైట్స్ భారీ ధరకు అమ్ముడయ్యాయని అంటున్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ డ్యూడ్ సినిమా డిజిటల్ హక్కులను ఏకంగా రూ.25 కోట్లకు కొనుగోలు చేసిందని సమాచారం. డ్యూడ్ సినిమా హక్కులు ఈ రేంజ్ రేటుకు అమ్ముడు పోవడానికి కారణం ప్రదీప్ కు ఉన్న వరుస హిట్లతో పాటూ, అతనికి ఉన్న ఫాలోయింగేనని అంతా భావిస్తున్నారు. సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. వరుస హిట్లతో దూసుకెళ్తున్న ప్రదీప్ కు ఈ సినిమా ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి