Begin typing your search above and press return to search.

పంచాయత్ 4 ఎలా ఉంది..?

పంచాయత్ సీజన్ 1 సూపర్ సక్సెస్ అవ్వడంతో ఆ తర్వాత మరో రెండు సీజన్లు తెరకెక్కించారు. ఇక లేటెస్ట్ గా పంచాయత్ సీజన్ 4 ని ప్రైం ఆడియన్స్ కోసం తీసుకొచ్చారు.

By:  Tupaki Desk   |   25 Jun 2025 1:21 PM IST
పంచాయత్ 4 ఎలా ఉంది..?
X

ప్రైమ్ వీడియోలో వచ్చే వెబ్ సీరీస్ లకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఆ సీరీస్ ల ఫ్రాంచైజీలు ఎప్పుడొస్తాయా అన్న విధంగా ఆడియన్స్ ని ఎంగేజ్ చేస్తూ వచ్చాయి. అలాంటి సీరీస్ లో ఒకటి పంచాయత్ ఒకటి. 2020 లో మొదటి సీజన్ రాగా అది ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. రాజకీయ నేపథ్యంతో ఫన్ అండ్ ఎంటర్టైనర్ గా ఈ సీరీస్ సాగుతుంది. పంచాయత్ సీజన్ 1 సూపర్ సక్సెస్ అవ్వడంతో ఆ తర్వాత మరో రెండు సీజన్లు తెరకెక్కించారు. ఇక లేటెస్ట్ గా పంచాయత్ సీజన్ 4 ని ప్రైం ఆడియన్స్ కోసం తీసుకొచ్చారు.

దీపక్ కుమార్ మిశ్రా డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ వెబ్ సీరీస్ లో జితేంద్ర కుమార్, రఘబీర్ యాదవ్, ఫైసల్ మాలిక్, నీనా గుప్తా లీడ్ రోల్ లో నటించారు. ఈ సీరీస్ కు చందన్ కుమార్ స్క్రీన్ రైటర్ గా పనిచేశారు. పంచాయత్ సీజన్ 4 మొత్తం 8 ఎపిసోడ్ తో 5 గంటల రన్ టైం తో వచ్చింది.

ఇంతకీ పంచాయత్ సీజన్ 4 కథ ఏంటంటే.. పులేరా విలేజ్ లో అభిషేక్ త్రిపాఠి (జితేంద్ర కుమార్) CAT పరీక్షలకు సిద్ధం అవుతాడు. ఐతే మరోపక్క ఒక యాక్సిడెంట్ నుంచి తప్పించుకున్న ప్రధాన్ జీ బ్రిజ్ భూషణ్ (రఘుబీర్ యాదవ్) ఎమ్మెల్యే చందు సింగ్ (పంకజ్ ఝా) ఇంజ్కా భూషణ్ (దుర్గేష్ కుమార్)పై కేసు పెడతాడు. అభిషేక్ భూషణ్ సంధి కుదర్చాలని అనుకోగా భూషణ్ తనకు క్షమాపణ చెప్పాలని చూసిన అభిషేక్ కి ఒక పనిచెబుతాడు. ఈ క్రమంలో భూషణ్, ప్రధాన్ జీ ల మధ్య ఎలాంటి రాజకీయ శత్రుత్వం ఏర్పడింది.. ఈ పరిణామాలు ఎక్కడికి దారి తీశాయి అన్నది పంచాయత్ 4 కథ.

విలేజ్ బ్యాక్ డ్రాప్ తో వచ్చిన ఈ వెబ్ సీరీస్ లో మెయిన్ లీడ్ అయిన జితేంద్ర ఇంప్రెస్ చేశారు. ముందు వచ్చిన సీజన్లు ఎంటర్టైనింగ్ విషయంలో ఆడియన్స్ ని డిజప్పాయింట్ చేయలేదు. సీరీస్ లో లడ్డూ గొడవ, భోజనాల దగ్గర అల్లరి ఇలా కొన్ని బలంగా ఉన్నా సీజన్ మొత్తం చూస్తే మాత్రం కాస్త నిరుత్సాహపరిచిందని అనిపిస్తుంది.

ముఖ్యంగా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఈ సీజన్ అంతగా ఇంప్రెస్ చేయలేదు. కామెడీతో ప్రేక్షకులను మెప్పించాలని అనుకున్నా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ సీన్స్ అసలు వర్క్ అవుట్ అవ్వలేదు. ఇక కథనం కూడా స్లో అవ్వడం వల్ల సాగదీసిన ఫీలింగ్ వస్తుంది. ఎలాంటి ట్విస్టులు లేకుండా చేయడం వల్ల ఆడియన్స్ కి బోర్ కొట్టేస్తుంది. పంచాయత్ మునుపటి సీజన్లలో ఉన్న కామెడీ ఎంటర్టైన్మెంట్ ఇందులో లోపించిందనిపిస్తుంది. 8 ఎపిసోడ్స్ తో 5 గంటల రన్ టైం తో వచ్చిన పంచాయత్ 4 సీరీస్ ముగింపుని కూడా సరిగా లేదని చెప్పొచ్చు.

టెక్నికల్ గా ఓకే అనేలా అనిపించిన సీరీస్ బలమైన కథ ఉన్నా దాన్ని మెప్పించేలా నడిపించలేకపోయారని చెప్పొచ్చు. పంచాయత్ 4 సీజన్ పై అంచనాలు బాగున్నాయి. ఐతే ఇదివరకు సీజన్లతో పోలిస్తే కామెడీ ఇంకా కథనం మైనస్ అనిపిస్తాయి.