Begin typing your search above and press return to search.

ఈవారం ఓటీటీ.. కిక్కిచ్చే కంటెంట్ రెడీ

ఈ వారం ఫ్యామిలీ ఆడియన్స్ ఇంట్లో కూర్చొని హ్యాపీగా వీటిని వీక్షించవచ్చు.

By:  Tupaki Desk   |   21 July 2023 9:02 AM GMT
ఈవారం ఓటీటీ.. కిక్కిచ్చే కంటెంట్ రెడీ
X

ప్రస్తుతం బిగ్ స్క్రీన్ తో పాటు డిజిటల్ ఎంటర్టైన్మెంట్ కూడా ప్రేక్షకులకి వినోదాన్ని అందిస్తున్నాయి. థియేటర్స్ లోకి వచ్చిన సినిమాలు అన్ని కూడా నెలరోజులు వ్యవధిలోనే థియేటర్స్ లోకి వస్తున్నాయి. ప్రేక్షకులకి వినోదాన్ని అందించడంలో డిజిటల్ ఛానెల్స్ కూడా పోటీ పడుతున్నాయని చెప్పాలి. మంచి సినిమాలు ఉంటే ముందుగానే ఎక్కువ మొత్తంలో రైట్స్ కోసం చెల్లించి హక్కులు సొంతం చేసుకుంటున్నారు.

ఈ కాంపిటేషన్ లో ప్రతివారం ప్రేక్షకులకి కొత్త సినిమాలని ఓటీటీ సంస్థలు తీసుకొస్తున్నాయి. అలాగే ఈ వారం డిజిటల్ మాధ్యమాలలో ప్రేక్షకులని అలరించడానికి రెడీ అవుతోన్న సినిమాలు చూసుకుంటే అమెజాన్ ప్రైమ్ లో హిందీ మూవీ బవాల్ ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. వరుణ్ ధావన్, జాన్వీ కపూర్ హీరో, హీరోయిన్స్ గా ఈ చిత్రంలో నటించారు. ఈ మూవీ నేరుగా ఓటీటీలోకి రిలీజ్ అయ్యింది.

వెన్నెల కిషోర్, సునీల్ కీలక పాత్రలలో నటించిన కామెడి అండ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ భువన విజయం కూడా అమెజాన్ ప్రైమ్ లో ప్రసారం అవుతోంది. అలాగే హర్రర్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన అశ్విన్స్ అనే మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. కొత్తవాళ్లతో తెరకెక్కిన ఈ చిత్రం మిస్టీరియస్ స్టోరీ లైన్ తో ప్రేక్షకులని అలరిస్తోంది.

ఆహా తెలుగు ఓటీటీలో ఇంటరెస్టింగ్ మూవీ కూడా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. కనెక్ట్ పేరుతో తెరకెక్కిన ఈ మూవీ హర్రర్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో ఉంటుంది. వీడియో కాల్ లో పరిచయం అయిన స్నేహితులు రోడ్డు ట్రిప్ కంప్లీట్ చేసుకుని తిరిగి వస్తున్నప్పుడు వారిని ఓ అమ్మాయి ఆత్మ వెంటాడుతుంది. వారిని భయపెడుతూ ఉంటుంది. అస్సలు ఆ అమ్మాయికి స్నేహితులకి మధ్య కనెక్షన్ ఏంటి అనేది కనెక్ట్ మూవీలో ఉంది.

ఇలా నాలుగు డిజిటల్ మాధ్యమాలలో నాలుగు సినిమాలు ప్రేక్షకులని అలరించడానికి అందుబాటులో ఉన్నాయి.వీటిలో పాటుగా మరికొన్ని వెబ్ సిరీస్ లు కూడా స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ వారం ఫ్యామిలీ ఆడియన్స్ ఇంట్లో కూర్చొని హ్యాపీగా వీటిని వీక్షించవచ్చు.