Begin typing your search above and press return to search.

ఓటీటీ అలవాటు చేశారు... ఇక వాళ్ల ఇష్టం!

నాలుగు సంవత్సరాల్లో ఓటీటీ మార్కెట్‌ పదుల రెట్లు పెరిగింది. ముఖ్యంగా కరోనా ముందు ఓటీటీ కి పెద్దగా ఆధరణ ఉండేది కాదు

By:  Tupaki Desk   |   27 Sep 2023 11:30 AM GMT
ఓటీటీ అలవాటు చేశారు... ఇక వాళ్ల ఇష్టం!
X

నాలుగు సంవత్సరాల్లో ఓటీటీ మార్కెట్‌ పదుల రెట్లు పెరిగింది. ముఖ్యంగా కరోనా ముందు ఓటీటీ కి పెద్దగా ఆధరణ ఉండేది కాదు. కానీ కరోనా సమయంలో థియేటర్లు నెలల తరబడి మూతపడి ఉండటంతో అనూహ్యంగా ఓటీటీ మార్కెట్‌ పెరిగింది. వినియోగదారులు పెరుగుతూ ఉంటే ఓటీటీ వారు రేట్లు పెంచుతూనే ఉన్నారు.

కొత్త ఓటీటీ లు ఎన్ని వచ్చినా కూడా రేట్లు మాత్రం తగ్గడం లేదు. ఒకరిని మించి ఒకరు అన్నట్లుగా డబ్బు సంపాదించేందుకు గాను ఓటీటీ కంపెనీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. మొన్నటి వరకు ప్రేక్షకులకు ఓటీటీ కంటెంట్ రుచి చూపించి, తక్కువ మొత్తంకు సబ్ స్క్రిప్షన్ ను ఇచ్చిన ఓటీటీ లు ఇప్పుడు భారీ మొత్తంలో రేటు పెంచేస్తున్నారు.

ఓటీటీ కంటెంట్ అలవాటు అయిన వారు ఎంత పెద్ద మొత్తంను ఖర్చు చేసి అయినా కూడా సినిమాలు, సిరీస్ లు చూడాలని కోరుకుంటున్నారు. ఇదే అదునుగా అమెజాన్ వారు కొత్త ఆదాయ మార్గంను వెతుకుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు కేవలం కొన్ని ఓటీటీ లకే పరిమితం అయిన యాడ్స్ ని అమెజాన్‌ కూడా తీసుకు వచ్చేందుకు సిద్ధం అవుతోందట.

ఇప్పటికే రెంటల్ విధానం లో కొత్త కంటెంట్ ను అందిస్తున్న అమెజాన్ ముందు ముందు యాడ్స్ తో కూడా రెవిన్యూ సంపాధించాలని భావిస్తుందట. ప్రతి 20 నిమిషాల్లో 3 నుంచి 4 నిమిషాల యాడ్స్ ను వినియోగదారులు చూడాల్సి ఉంటుందట. ఒక వేళ యాడ్స్ వద్దు అనుకుంటే మరో ప్లాన్ తీసుకోవాల్సి ఉంటుందట.

మొత్తానికి ఓటీటీ లు వినియోగదారుల నుంచి డబ్బు పిండుకునేందుకు సాధ్యం అయినన్ని మార్గాల్లో ప్రయత్నాలు చేస్తున్నారు. ఆహా మరియు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో యాడ్స్ తో చిరాకు పడుతున్న ఓటీటీ ప్రేక్షకులు ఇకపై అమెజాన్ లో కూడా ఆ యాడ్స్‌ ను చూడాల్సి ఉంటుంది. అలవాటు అయిన ప్రాణం... యాడ్స్ వచ్చినా, మరేం వచ్చినా కూడా తప్పదు అనుకుంటూ చూడాల్సిందే.