Begin typing your search above and press return to search.

OTT: ఆగస్టంతా బోలేడు సినిమా/ సిరీస్ లు

ఈ నేపథ్యంలో ఏఏ చిత్రాలు, వెబ్ సిరీస్ లు ఏఏ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో రాబోతున్నాయో చూద్దాం..

By:  Tupaki Desk   |   4 Aug 2023 8:11 AM GMT
OTT: ఆగస్టంతా బోలేడు సినిమా/ సిరీస్ లు
X

ఎప్పటిలాగే ఈ నెల కూడా పలు ఇంట్రెస్టింగ్ సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. ఎలాగో వీకెండ్ కూడా వచ్చేసింది. ఈ నేపథ్యంలో ఏఏ చిత్రాలు, వెబ్ సిరీస్ లు ఏఏ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో రాబోతున్నాయో చూద్దాం..

'ది ఫ్యామిలీమాన్‌', 'ఫర్జీ' లాంటి వెబ్‌సిరీస్‌ లతో ఓటీటీ ఆడియెన్స్ ను ఆకట్టుకుంది రాజ్‌ అండ్‌ డీకే దర్శక ద్వయం. ఇప్పుడీ దర్శక ద్వయం నుంచి వస్తున్న మరో ఇంట్రెస్టింగ్ క్రైమ్‌ థ్రిల్లర్‌ సిరీస్‌ 'గన్స్‌ అండ్‌ గులాబ్స్‌'. మలయాళ స్టార్ హీరో దుల్కర్‌ సల్మాన్‌, బాలీవుడ్‌ హీరో రాజ్‌కుమార్‌ రావు కలిసి నటించిన ఈ సిరీస్ ఆగస్టు 18 నుంచి 'నెట్ ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్‌ కానుంది.

ఇంకా గాల్‌ గాడోట్‌, అలియాభట్‌ ప్రధాన పాత్రల్లో నటించిన హాలీవుడ్‌ స్పై యాక్షన్‌ చిత్రం 'హార్ట్‌ ఆఫ్‌ ది స్టోన్‌' తెలుగుతో సహా పలు భారతీయ భాషల్లో ఆగస్టు 11నుంచి 'నెట్‌ఫ్లిక్స్‌'లో స్ట్రీమింగ్‌ కానుంది. ఇంకా పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ 'చూన' ఆగష్టు 3నుంచి స్ట్రీమ్ అవుతోంది. 'ది లింకన్ లాయర్ పార్ట్ 2' మూవీ, 'హార్ట్‌ స్టాపర్' సీజన్ 2 కూడా ఆగష్టు 3నుంచి అందుబాటులో ఉంది. 'ది హంట్ ఫర్ వీరప్పన్' డాక్యూ సిరీస్ ఆగస్ట్ 4 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది.

ఇక 'అమెజాన్‌ ప్రైమ్‌' వీడియోలో తెలుగందం శోభిత ధూళిపాళ్ల, అర్జున్‌ మాథుర్‌ కీలక పాత్రల్లో నటించిన 'మేడ్‌ ఇన్‌ హెవెన్‌' సిరీస్‌ స్ట్రీమింగ్ కు రెడీ అయింది. ఆగస్టు 10 నుంచి అందుబాటులో ఉండనుంది.

వివేగ్ అగ్నిహోత్రి 'ది కశ్మీర్ ఫైల్స్' దేశవ్యాప్తంగా ఎంతటి సెన్సేషన్ సృష్టించిందో తెలిసిన విషయమే. ఇప్పుడు 'ది కశ్మీర్ ఫైల్స్ : అన్ రిపోర్టెడ్' నాన్ ఫిక్షన్ సిరీస్ 'జీ5'లో ఆగస్ట్ 11 నుంచి స్ట్రీమింగ్ కానుంది. రవి జాదవ్‌ దర్శకత్వంలో బాలీవుడ్ నటి సుస్మితాసేన్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'తాళి'. ట్రాన్స్‌జెండర్‌ శ్రీగౌరి సావంత్‌ బయోపిక్‌ ఆధారంగా ఇది రానుంది. దేశంలో అణచివేతకు గురౌతున్న ట్రాన్స్ జెండర్‌ పోరాటమే ఈ సినిమా కథ. ఆగస్ట్ 15 నుంచి 'జియో' సినిమాస్ లో ఇది స్ట్రీమింగ్ కానుంది.

'డిస్నీ హాట్ స్టార్ ప్లస్'లో ఆగస్ట్ 23 నుంచి స్టార్ వార్స్ ఫ్రాంచైజీలో రూపొందించిన 'స్పిన్ ఆఫ్ ది మండాలోరియన్' అందుబాటులో ఉండనుంది. అలాగే విపుల్‌ అమృతలాల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన 'కమాండో' ఆగస్టు 11వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది. ఇంకా జేడీ చక్రవర్తి నటించిన 'దయా' ఆగస్టు 4 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఇంకా 'సోనిలివ్'లో ఆగస్ట్ 9 నుంచి 'ది జెంగబురు కర్స్', ఆగస్ట్ 11 నుంచి కాప్ థీమ్ 'పోర్ థోజిల్' చిత్రం అందుబాటులో ఉండనున్నాయి.