Begin typing your search above and press return to search.

ఒక్కరోజే ఓటీటీలోకి 24 చిత్రాలు, సిరీస్ లు.. మీ ఛాయిస్ ఏంటి?

ఓటీటీ లవర్స్ ను మెప్పిస్తున్నాయి. ఆ విధంగా వీకెండ్ సందర్భంగా ఒక్క రోజే (జూన్ 20) 24 చిత్రాలు అందుబాటులోకి వచ్చాయి.

By:  Tupaki Desk   |   20 Jun 2025 4:55 PM IST
ఒక్కరోజే ఓటీటీలోకి 24 చిత్రాలు, సిరీస్ లు.. మీ ఛాయిస్ ఏంటి?
X

ప్రతి వారం ఓటీటీలో సినిమాలు ఆడియన్స్ ను ఓ రేంజ్ లో ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. థియేటర్స్ లో కొత్త చిత్రాలు సందడి చేస్తుండగా.. ఓటీటీల్లో పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఓటీటీ లవర్స్ ను మెప్పిస్తున్నాయి. ఆ విధంగా వీకెండ్ సందర్భంగా ఒక్క రోజే (జూన్ 20) 24 చిత్రాలు అందుబాటులోకి వచ్చాయి.

థియేటర్స్ లో ప్రస్తుతం 8 వసంతాలు, కుబేర, సితారే జమీన్ పర్ సినిమాలు మంచి రెస్పాన్స్ అందుకుంటున్నాయి. సినీ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. అదే సమయంలో హారర్, రొమాంటిక్ కామెడీ, క్రైమ్ థ్రిల్లర్, ఇన్వెస్టిగేటివ్, ఫ్యామిలీ డ్రామా సహా అన్ని రకాల జోనర్ లో రూపొందిన మూవీలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ అవుతున్నాయి.

అయితే ఆ సినిమాల్లో తెలుగు స్ట్రయిట్ తో పాటు డబ్పింగ్ మూవీస్ కూడా ఉన్నాయి. ఇతర భాషల చిత్రాలూ అందుబాటులోకి వచ్చాయి. పలు ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ లు ఉన్నాయి. మరి ఏ ఓటీటీలో ఏ మూవీ ఉంది? ఏ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది? వంటి వివరాలు మీకోసం.

నెట్ ఫ్లిక్స్ ఓటీటీ

సెమీ సోయిటర్ - ఇంగ్లీష్ మూవీ

కె పాప్ డీమన్ హంటర్స్ - కొరియన్ మూవీ

ఏ కింగ్ లైక్ మీ - ఇంగ్లీష్ సినిమా

గ్రీన్ బోన్స్ - తగలాన్ చిత్రం

ఏ లాగోస్ లవ్ స్టోరీ - నైజీరియన్ సినిమా

ఒలింపో - స్పానిష్ వెబ్ సిరీస్

బేబీ ఫార్మ్ సీజన్ 1 - నైజీరియన్ వెబ్ సిరీస్

అమెజాన్ ప్రైమ్ వీడియో

ఘటికాచలం - తెలుగు చిత్రం

యుద్ధకాండ ఛాప్టర్ 2 - తెలుగు డబ్బింగ్ మూవీ

లవ్‌ లీ - మలయాళం సినిమా

ఆహా ఓటీటీ

అలప్పుజా జింఖానా - తెలుగు సినిమా

జిన్ ద పెట్ - కోలీవుడ్ మూవీ

యుగీ - తమిళ చిత్రం

సేవ్ నల్ల పసంగ - తమిళ వెబ్ సిరీస్

జీ5 ఓటీటీ

డిటెక్టివ్ షెర్డిల్ - హిందీ మూవీ

గ్రౌండ్ జీరో - హిందీ సినిమా

ప్రిన్స్ అండ్ ఫ్యామిలీ - మలయాళ చిత్రం

జియో హాట్‌స్టార్ లో ఇంగ్లీష్ సిరీస్ ఫౌండ్ సీజన్ 2తోపాటు తెలుగు డబ్బింగ్ సిరీస్ కేరళ క్రైమ్ ఫైల్స్ సీజన్ 2 స్ట్రీమింగ్ కు వచ్చాయి. లయన్స్ గేట్ ప్లేలో ఫ్రెంచ్ సిరీస్ కబోల్ స్ట్రీమింగ్ అవుతోంది. తమిళ మూవీ ఎలెవెన్ కూడా సందడి చేస్తోంది. బుక్ మై షోలో తెలుగు సినిమా హద్దు లేదురా అందుబాటులోకి వచ్చింది. మరి మీ చాయిస్ ఏంటి?