ఓటీటీలతో డేంజర్‌లో టీనేజీ పిల్లలు!
ఒకప్పుడు డిగ్రీ పూర్తి చేసి 22 వయసులో ఉన్న పిల్లాడిని శృం*గారం లేదా రొమాన్స్ గురించి ప్రశ్నిస్తే అతడి ఎక్స్ ప్రెషన్ ఎలా ఉండేది.
By: Tupaki Desk | 21 July 2025 8:00 AM ISTఒకప్పుడు డిగ్రీ పూర్తి చేసి 22 వయసులో ఉన్న పిల్లాడిని శృం*గారం లేదా రొమాన్స్ గురించి ప్రశ్నిస్తే అతడి ఎక్స్ ప్రెషన్ ఎలా ఉండేది. కొంచెమైనా తడబడేంత అమాయకత్వం కనిపించేది. ఇప్పుడు ఏడో క్లాసులోనే ప్రేమాయణాలు మొదలైపోతున్నాయి. పదో తరగతి నాటికి పరిపక్వత వచ్చేస్తోంది. గాళ్ ఫ్రెండ్స్ తో జంట షికార్లు కూడా కామన్ గా మారిపోయాయి. టీనేజర్స్ 2.0 నుంచి 5.0కి అప్‌గ్రేడ్ అయ్యారు.
ఇప్పుడు ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో ఓటీటీల ఉధృతి మరింతగా పరిస్థితిని దిగజార్చింది. చేతిలో మొబైల్ ఫోన్ లేని టీనేజర్ ని చూపించగలరా? ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ యుగంలో అరిచేతిలోనే స్వర్గం చూస్తున్నారు. ఇంద్రలోకంలో రంభ- ఊర్వశి- మేనకల గురించి ఓటీటీల్లో చూసి తెలుసుకుంటున్నారు టీనేజీ పిల్లలు. శృంగారం అంటే వారికి ఇప్పుడు కొత్తగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. పేరెంట్ ఆ పదాన్ని ఒత్తి పలకడానికి ఇబ్బంది ఫీలవ్వాల్సిన పనే లేదు. టీనేజీ పిల్లలతో స్వేచ్ఛగా దాని గురించి మాట్లాడవచ్చు. ఒకవేళ మాట్లాడకపోతే అది పేరెంట్ అమాయకత్వం.
ఇంతటి అభివృద్ధిని పాశ్చాత్య దేశాలలో మాత్రమే ఒకప్పుడు చూడగలిగాం. ఇప్పుడు భారతదేశం అంతకుమించి ఎదిగింది. ఓటీటీలు వినోదానికి మించి ఇంకా చాలా అందిస్తున్నాయి. దేశం ఎదుగుదలకు ఓటీటీల సహకారం అంతా ఇంతా కాదు. ఓటీటీల్లో వినోదం పేరుతో భరితెగించే వ్యవహారాలెన్నిటినో యథేచ్ఛగా చూపిస్తున్నారు గనుక పిల్లలు దీనికి మినహాయింపు ఎలా అవుతారు? కిడ్స్ కూడా వాటికి అడిక్ట్ అయిపోయారు. అది టీనేజీ పిల్లల మధ్య లైంగిక ఉత్ప్రేరకంగా పని చేయడమే గాక, అక్రమ సంబంధాలకు కూడా తెర తీసిన ఘటనలున్నాయి. వీటన్నిటికీ మించి స్వలింగ సంపర్కు(హిజ్రా)ల కమ్యూనిటీ అంశాలపైనా ఇప్పుడు పిల్లలకు అవగాహన వచ్చేసింది. చిన్న వయసులోనే వారిని ఉద్వేగానికి లోను చేసే తాయత్తులా పని చేస్తున్నాయి ఓటీటీలు. అపరిపక్వ వయస్సులో కిడ్స్ చాలా విషయాల్లో ఆరితేరిపోతున్నారు.
పిల్లల్లో చెడు అలవాట్లను ప్రోత్సహించే ఓటీటీలకు విచిత్రంగా సబ్ స్క్రిప్షన్లు పెంచడంలో పేరెంట్ భాగస్వాముల గొప్పతనాన్ని పరిశీలించాలి. పిల్లల మనస్సులపై ఓటీటీ విశృంఖల సిరీస్‌లు తీవ్ర ప్రభావం చూపుతుండడం ఆందోళనకరంగా మారుతున్నా ఇది మారడం లేదు. ఇటీవల మలయాళంలో దీనిపై ఒక సినిమానే తీసి బ్లాక్ బస్టర్ కొట్టారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇది భారతదేశం సాధించిన నిజమైన అభివృద్ధిగా భావించాలి.
