నెట్‌ఫ్లిక్స్ నుంచి అతి పెద్ద ప్రకటన... వారికి గుడ్‌న్యూస్
ఒకప్పుడు హాలీవుడ్ సినిమాలకు, ఇంగ్లీష్ వెబ్ సిరీస్‌లకు పరిమితం అయిన నెట్‌ఫ్లిక్స్ ఈ మధ్య ఇండియన్ కంటెంట్‌తో నిండి పోతుంది.
By: Tupaki Desk | 30 May 2025 12:46 PM ISTఒకప్పుడు హాలీవుడ్ సినిమాలకు, ఇంగ్లీష్ వెబ్ సిరీస్‌లకు పరిమితం అయిన నెట్‌ఫ్లిక్స్ ఈ మధ్య ఇండియన్ కంటెంట్‌తో నిండి పోతుంది. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో నెట్‌ఫ్లిక్స్ తన ఆదిపత్యంను క్లీయర్‌గా చూపించే ప్రయత్నం చేస్తుంది. ప్రైమ్ వీడియోను డామినేట్ చేసే విధంగా నెట్‌ఫ్లిక్స్ ఇండియన్ ఓటీటీ మార్కెట్‌పై పట్టు సాధించింది. నెట్‌ఫ్లిక్స్ అత్యధికంగా సబ్‌స్క్రైబర్స్‌ను సంపాదించేందుకు చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా వరుసగా సినిమాలను, వెబ్ సిరీస్‌లను తీసుకు వచ్చింది. ఇండియన్ ఓటీటీ ప్రేక్షకులు నెట్‌ఫ్లిక్స్ గురించి ప్రముఖంగా చర్చించుకుంటూ ఉన్నారు. పెద్ద సినిమాల్లో ఎక్కువ శాతం సినిమాలు నెట్‌ఫ్లిక్స్‌లోనే వస్తున్నాయి.
ఈ మధ్య కాలంలో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న సినిమాల్లో కొన్ని అట్టర్ ఫ్లాప్ కాగా, కొన్ని పర్వాలేదు అన్నట్లుగా నిలిచాయి. సూపర్ డూపర్ హిట్ అయిన సినిమాలు నెట్‌ఫ్లిక్స్‌లో చాలా చాలా తక్కువ అని చెప్పాలి. అందుకే నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ కంటెంట్ విషయమై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో సినిమాల కంటే ఎక్కువగా వెబ్ సిరీస్‌లకు ఖర్చు చేయాలని నెట్‌ఫ్లిక్స్ నిర్ణయించుకుందా అన్నట్లుగా వరుసగా వెబ్ సిరీస్‌లను మొదలు పెట్టింది. తాజాగా మూడు సూపర్ హిట్ వెబ్ సిరీస్‌లకు సంబంధించిన సీజన్ 2 లను ప్రకటించడం ద్వారా ఆ వెబ్ సిరీస్‌లను ఇష్టపడే ప్రేక్షకులు, అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఈ ఏడాది ఆరంభంలో వచ్చి సూపర్ హిట్‌గా నిలిచిన 'బ్లాక్ వారెంట్' వెబ్ సిరీస్‌కి సీక్వెల్ రూపొందబోతుంది. ఈ విషయాన్ని జహాన్ కపూర్ అధికారికంగా ప్రకటించాడు. మొదటి సీజన్‌కి వచ్చిన స్పందన మాకు చాలా సంతోషంను కలిగించింది. అందుకే మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నామని బ్లాక్ వారెంట్ సీజన్ 2 తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ప్రకటించాడు. ఇప్పటికే సీజన్ 2 కోసం స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేశారని, షూటింగ్ సైతం మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయ్యి సూపర్ హిట్ అయిన మరో వెబ్ సిరీస్ రాయల్స్ ను సైతం సీజన్ 2 కి ప్లాన్ చేశారని తెలుస్తోంది. ఈ వెబ్ సిరీస్ సీజన్ 2 ప్రకటించారు.
మామ్లా లీగల్ హై సీజన్ 2 వెబ్ సిరీస్‌ను అధికారికంగా ప్రకటించారు. ఈ వెబ్ సిరీస్‌కు నెట్‌ఫ్లిక్స్‌లో మంచి స్పందన వచ్చిన కారణంగా సీజన్ 2 కి ఏర్పాట్లు చేస్తున్నారు. బ్లాక్ వారెంట్ వెబ్ సిరీస్‌ను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది. నెట్‌ఫ్లిక్స్ సినిమాలతో పాటు, వెబ్ సిరీస్‌లను బ్యాక్ టు బ్యాక్ తీసుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. కొత్తగా వెబ్ సిరీస్‌లను నెట్‌ఫ్లిక్స్ ప్రకటించడంతో ఆ వెబ్ సిరీస్‌లను ఇష్టపడే వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒకే సారి మూడు వెబ్ సిరీస్‌లకు సంబంధించిన సీజన్ 2 ను ప్రకటించడం ద్వారా నెట్‌ఫ్లిక్స్ అతి పెద్ద ప్రకటన చేసింది.
