Begin typing your search above and press return to search.

'నాయకుడు' కోసం చూస్తున్న వారికి గుడ్ న్యూస్‌

అందుకే తెలుగు లో ఈ సినిమా స్ట్రీమింగ్ అయిన సమయంలో భారీ ఎత్తున జనాలు చూసే అవకాశాలు ఉన్నాయని అంతా భావిస్తున్నారు.

By:  Tupaki Desk   |   27 July 2023 6:28 AM GMT
నాయకుడు కోసం చూస్తున్న వారికి గుడ్ న్యూస్‌
X

గత నెల 29న తమిళ్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'మామన్నన్‌' సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. తమిళ్‌ లో హిట్ టాక్ దక్కించుకోవడంతో ఆలస్యం చేయకుండా తెలుగు లో నాయకుడు టైటిల్ తో డబ్బింగ్ చేసి రిలీజ్ చేయడం జరిగింది. నాయకుడు తెలుగు లో జూలై 14వ తారీకున విడుదల అవ్వడం జరిగింది.

తెలుగు లో సినిమాకు భారీ స్థాయిలో పబ్లిసిటీ చేయక పోవడంతో కమర్షియల్‌ గా గొప్ప విజయాన్ని సొంతం చేసుకోలేదు. కానీ రివ్యూలు.. సోషల్‌ మీడియా టాక్ మాత్రం పాజిటివ్ గా వచ్చిన విషయం తెల్సిందే. పైగా ఆ సమయంలో ఉన్న పోటీ కారణంగా నాయకుడు సినిమాకు ఎక్కువ ఫుట్‌ ఫాల్ దక్కలేదు.

సినిమాకు పాజిటివ్ టాక్‌ వచ్చింది కనుక ఓటీటీ లో చూడ్డం కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. నాయకుడు అనే టైటిల్‌ తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్‌ అయ్యే టైటిల్‌. అందుకే తెలుగు లో ఈ సినిమా స్ట్రీమింగ్ అయిన సమయంలో భారీ ఎత్తున జనాలు చూసే అవకాశాలు ఉన్నాయని అంతా భావిస్తున్నారు.

తమిళంలో విడుదల అయి నాలుగు వారాలు పూర్తి అయిన నేపథ్యంలో ఓటీటీ స్ట్రీమింగ్ మొదలైంది. ప్రముఖ ఓటీటీ నెట్‌ ఫ్లిక్స్ లో మామన్నన్‌ స్ట్రీమింగ్‌ అవుతోంది. ఒరిజినల్‌ భాషలోనే కాకుండా అన్ని సౌత్ భాషల్లో కూడా ఈ సినిమా ను స్ట్రీమింగ్‌ చేస్తున్నట్లుగా నెట్ ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది.

ఉదయనిధి స్టాలిన్.. వడివేలు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాకు మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించాడు. కీర్తి సురేష్‌, ఫాహద్ ఫాజిల్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించి తమిళ్ ప్రేక్షకులను కాకుండా తెలుగు ప్రేక్షకులకు కూడా సినిమా నచ్చే విధంగా మెప్పించారు. ఇక ఈ సినిమా ను థియేటర్ లో మిస్ అయిన వారు కచ్చితంగా ఓటీటీ స్ట్రీమింగ్ చేయడం కోసం ఎదురు చూస్తున్నారు.