Begin typing your search above and press return to search.

బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినా.. వెంటనే ఓటీటీలోకి..!

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు

By:  Tupaki Desk   |   18 July 2023 11:30 AM GMT
బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినా.. వెంటనే ఓటీటీలోకి..!
X

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు, మంత్రి, నటుడు ఉయనిధి స్టాలిన్ హీరోగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం మామన్నన్. జూన్ 29వ తేదీన తమిళ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ మూవీ తమిళంలో బాక్స్ ఆఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది.

ఉదయనిధి కెరీర్ లోని అత్యంత ఎక్కువ ఓపినెంగ్స్ రాబట్టిన సినిమాగా ఇది నిలవడం విశేషం. తక్కువ బడ్జెట్ తో తీసినా ఈ సినిమా రూ.50కోట్లకు పైగా వసూలు చేసింది.

మోస్ట్ టాలెంటెడ్ ద‌ర్శ‌కుడిగా పేరు పొందిన మారి సెల్వ‌రాజ్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. కాగా, అక్కడ బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడంతో, ఈ మూవీని తెలుగులోనూ విడుదల చేశారు. తెలుగులో నాయకుడు పేరిట ఈ మూవీని జూన్ 14 వ తేదీన విడుదల చేస్తుండటం విశేషం.

అయితే, ఈ మూవీకి ఇక్కడ ప్రమోషన్స్ సరిగా చేయకపోవడం వల్ల , ఎక్కువ మంది ఈ మూవీ పై ఇంట్రెస్ట్ చూపించలేదు. కానీ, చూసిన వారు మాత్రం చాలా పాజిటివ్ రివ్యూలు ఇవ్వడం విశేషం. అయితే, ఈ మూవీ తెలుగులో థియేటర్స్ లోకి వచ్చి కనీసం వారం కూడా కాలేదు. ఆలోపే ఈ మూవీని ఓటీటీలో ప్రకటించడం గమనార్హం. ఈ నెల 27వ తేదీన ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చేస్తోంది.

ఇక ఈ మూవీలో ఉదయనిధి స్టాలిన్ హీరో కాగా, ఫ‌హ‌ద్ ఫాసిల్ కీలక పాత్ర పోషించారు. హీరోయిన్ పాత్రలో కీర్తి సురేష్ కనిపించగా, ప్రముఖ కమెడియన్ వడివేలు చాలా కాలం తర్వాత ఈ సినిమాలో కనిపించడం విశేషం. ఎప్పుడూ కామెడీ పాత్రలతో అలరించే వడివేలు ఇందులో సీరియస్ పాత్రలో, ముఖ్యంగా ముఖ్యమంత్రి పాత్రలో కనిపించడం గమనార్హం.

ఇప్పటికే ఈ సినిమాలో ఆయన పాత్రపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ మూవీ రాజకీయ నేపథ్యంలో తెరకెక్కగా, తమిళ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఓ దళిత ఎమ్మెల్యే, ఆయన కొడుకు కథతో ఈ సినిమా సాగుతుండటం విశేషం. చిత్రానికి ప్రముఖ సంగీత ద‌ర్శ‌కుడు అల్లా ర‌ఖా రెహ‌మాన్ సంగీతం అందించారు.