Begin typing your search above and press return to search.

ఆ ఓటీటీని దున్నేస్తున్న అందాల రాక్ష‌సి హీరో!

రాజ‌మౌళి స‌మ‌ర్ప‌ణ‌లో సాయి కొర్ర‌పాటి నిర్మించిన ఈ మూవీ హీరోగా న‌వీన్ చంద్ర‌కు తిరుగులేని గుర్తింపును తెచ్చి పెట్టింది.

By:  Tupaki Desk   |   19 Jun 2025 5:00 PM IST
ఆ ఓటీటీని దున్నేస్తున్న అందాల రాక్ష‌సి హీరో!
X

ఒక ద‌గ్గ‌ర గేట్లు మూసుకుపోయినా మ‌రో చోటు గేట్లు తెరుకుకుంటాయంటే ఇదే నేమో.. హీరోగా థియేట్రిక‌ల్ సినిమాలు త‌గ్గిపోయినా 'అందాల రాక్ష‌సి' హీరో అక్క‌డ మాత్రం దున్నేస్తున్నాడు. వివ‌రాల్లోకి వెళితే.. 'సంభ‌వామి యుగే యుగే' సినిమాతో ఆర్టిస్ట్‌గా అరంగేట్రం చేసిన న‌వీన్ చంద్ర ఆ త‌రువాత మ‌రో సినిమా చేయ‌డానికి దాదాపు 5 ఏళ్లు ప‌ట్టింది. అప్పుడే త‌న‌కు హ‌ను రాఘ‌వ‌పూడి రూపంలో గోల్డెన్ ఛాన్స్ త‌లుపు త‌ట్టింది. అదే 'అందాల రాక్ష‌సి'.

రాజ‌మౌళి స‌మ‌ర్ప‌ణ‌లో సాయి కొర్ర‌పాటి నిర్మించిన ఈ మూవీ హీరోగా న‌వీన్ చంద్ర‌కు తిరుగులేని గుర్తింపును తెచ్చి పెట్టింది. తెలుగుతో పాటు త‌మిళ భాష‌ల్లోనూ అవ‌కాశాల్ని తెచ్చి పెట్టింది. అయితే `నేను లోక‌ల్‌` నుంచి న‌వీన్ చంద్రకు హీరో క్యారెక్ట‌ర్లు త‌గ్గి స‌పోర్టింగ్ క్యారెక్ట‌ర్లు పెర‌గ‌డం మొద‌లైంది. దీంతో హీరోగా న‌వీన్ చంద్ర థియేట్రిక‌ల్ ఫీల్‌ని మిస్ కావ‌డం మొద‌లైంది.

అదే స‌మ‌యంలో న‌వీన్ చంద్ర‌ని ఓటీటీ ప్లాట్ ఫామ్‌లు అక్కున చేర్చుకోవ‌డం మొద‌లు పెట్టాయి. అక్క‌డ ప‌లు వెబ్ సిరీస్‌లు చేస్తూ న‌వీన్ హీరోగా క్రైమ్ థ్రిల్ల‌ర్‌ల‌తో స‌త్తా చాటుతున్నాడు. రీసెంట్‌గా న‌వీన్ చంద్ర న‌టించిన లెవెన్‌, బ్లైండ్ స్పాట్ మూవీస్ ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతూ ట్రెండింగ్‌లో కొన‌సాగుతుండ‌టం విశేషం.

ఈ రెండు సినిమాలు ఒక్క తెలుగు భాష‌లోనే కాకుండా త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ, హిందీ భాష‌ల్లోనూ డైరెక్ట్‌గా స్ట్రీమింగ్ అవుతూ ట్రెండింగ్‌లో ఉండ‌టం గ‌మ‌నార్హం. న‌వీన్ చంద్ర న‌టించిన క్రైమ్ థ్రిల్ల‌ర్ `బ్లైండ్ స్పాట్‌` అమెజాన్ ప్రైమ్‌లో ట్రెండ్ అవుతున్న టాప్ 10 సినిమాల్లో కొన‌సాగుతోంది. దీంతో న‌వీన్ థియేట్రిక‌ల్ ఫీల్‌ని మిస్స‌యినా ఓటీటీల్లో మాత్రం త‌న సినిమాలతో, సిరీస్‌ల‌తో దున్నేస్తున్నాడ‌ని కామెంట్ చేస్తున్నారు.