Begin typing your search above and press return to search.

మోస్ట్‌ అవైటెడ్‌ పాన్ ఇండియా మూవీ ఓటీటీ డేట్‌ ఫిక్స్‌

మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్ లాల్‌ తాజా చిత్రం 'తుడారుమ్‌' బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

By:  Tupaki Desk   |   27 May 2025 4:03 PM IST
మోస్ట్‌ అవైటెడ్‌ పాన్ ఇండియా మూవీ ఓటీటీ డేట్‌ ఫిక్స్‌
X

ఈ మధ్య కాలంలో డబ్బింగ్‌ సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. థియేటర్‌లలోనే కాకుండా ఓటీటీలో ఇతర భాషల సినిమాలను డబ్బింగ్‌ వర్షన్‌ చూసి మురిసి పోతున్న ప్రేక్షకులు చాలా మంది ఉన్నారు. తెలుగు ప్రేక్షకుల్లో ఎక్కువ శాతం మలయాళ సినిమాలను ఇష్టపడుతున్నారు. హిందీ ప్రేక్షకులు ఎక్కువ శాతం మంది తెలుగు డబ్బింగ్‌ సినిమాలను ఇష్టపడుతున్నారు. మలయాళం సినిమాలను దేశ వ్యాప్తంగా అన్ని భాషల ప్రేక్షకులు అభిమానిస్తూ ఉంటారు. ముఖ్యంగా మలయాళ బాక్సాఫీస్ వద్ద సూపర్‌ హిట్ అయిన సినిమాలకు అక్కడ ఇక్కడ అని కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇండియన్ సినీ ప్రేమికుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.

మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్ లాల్‌ తాజా చిత్రం 'తుడారుమ్‌' బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. వరల్డ్‌ బాక్సాఫీస్ వద్ద దాదాపుగా రూ.250 కోట్ల వసూళ్లు రాబట్టడం ద్వారా రికార్డ్‌ బ్రేక్‌ చేసిన ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ జియో హాట్‌స్టార్‌ స్ట్రీమింగ్‌కి సిద్దం అయింది. ముందుగా అనుకున్న ప్రకారం ఇప్పటికే సినిమా స్ట్రీమింగ్‌ మొదలు కావాల్సి ఉంది. ఏప్రిల్‌ మూడో వారంలో విడుదలైన ఈ సినిమాను మే మూడో వారంలో ఓటీటీ స్ట్రీమింగ్‌ చేయాలని భావించారు. కానీ ఇప్పటికీ థియేటర్‌లో స్ట్రీమింగ్‌ అవుతున్న కారణంగా ఓటీటీ స్ట్రీమింగ్‌ వాయిదా వేశారు. వారం ఆలస్యంగా సినిమాను జియో హాట్‌స్టార్‌ వారు స్ట్రీమింగ్‌కు రెడీ చేశారు.

తుడారుమ్‌ సినిమాను మే 30 నుంచి స్ట్రీమింగ్‌ చేయబోతున్నట్లు జియో హాట్‌స్టార్‌ అధికారికంగా ప్రకటించింది. మలయాళంతో పాటు ఇతర భాషల్లోనూ డబ్ అయ్యి థియేట్రికల్‌ రిలీజ్ అయిన ఈ సినిమాను ఎక్కువ శాతం మంది థియేటర్‌లో చూడలేక పోయారు. అందుకే ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఎక్కువ శాతం మంది అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్‌లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ సినిమాను ఓటీటీ ద్వారా కచ్చితంగా అత్యధికులు చూసే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మలయాళ సినిమా అదీ సూపర్‌ స్టార్‌ సినిమా కావడంతో ఓటీటీలో తుడారుమ్‌ కి కచ్చితంగా మంచి డిమాండ్ ఉండే అవకాశాలు ఉన్నాయి.

మోహన్‌లాల్‌తో పాటు ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్‌ శోభన నటించారు. తరుణ్ మూర్తి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను ఎం రంజిత్‌ నిర్మించారు. భారీ మొత్తానికి ఈ సినిమాను కొనుగోలు చేసిన జియో హాట్‌స్టార్‌ వారు కచ్చితంగా పెట్టిన పెట్టుబడికి రెట్టింపు లాభం దక్కించుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. టాక్సీ డ్రైవర్‌గా ప్రశాంతమైన జీవితం సాగించే షణ్ముగం అలియాస్ బెంజ్ తన కారు కోసం చేసే పోరాటం గురించి ఈ సినిమా కథ. ఫ్యామిలీకి అత్యంత ప్రాముఖ్యత ఇచ్చే వ్యక్తి జీవితంలో ఎదురయ్యే సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. సినిమాలో మోహన్‌ లాల్‌, శోభనల నటన విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. అందుకే ఓటీటీలో సినిమా స్ట్రీమింగ్‌ మొదలు అయితే కచ్చితంగా ఓ రేంజ్‌లో సోషల్‌ మీడియాలో సందడి చేయడం ఖాయం.