Begin typing your search above and press return to search.

రెండు వారాలు నిండకుండానే రెండు ఓటీటీల్లో మామా...!

రెండు వారాల లోపే అంటే ఇప్పటికే ఆహా మరియు అమెజాన్‌ ప్రైమ్‌ లో ఈ సినిమాను స్ట్రీమింగ్‌ మొదలు పెట్టారు.

By:  Tupaki Desk   |   20 Oct 2023 7:56 AM GMT
రెండు వారాలు నిండకుండానే రెండు ఓటీటీల్లో మామా...!
X

సుధీర్‌ బాబు ను విభిన్న పాత్రల్లో, విభిన్న గెటప్స్ లో చూపిస్తూ దర్శకుడు హర్ష వర్ధన్‌ రూపొందించిన చిత్రం మామా మశ్చీంద్ర. ఈ సినిమా విడుదలకు ముందు పాజిటివ్‌ బజ్ ను క్రియేట్‌ చేసింది. సుధీర్ బాబు గెటప్స్ సినిమా పై ఆసక్తిని క్రియేట్‌ చేయడంలో సఫలం అయ్యాయి. అంతే కాకుండా హర్షవర్ధన్ పై చాలా మంది నమ్మకం వ్యక్తం చేసి సినిమా బాగుంటుందని భావించారు.

థియేట్రికల్‌ రిలీజ్ అయిన మామా మశ్చీంద్ర సినిమా కు నిరాశ కలిగించే కలెక్షన్స్ నమోదు అయ్యాయి. ఈ మధ్య కాలంలో సుధీర్ బాబు టైం ఏమాత్రం బాగున్నట్లుగా లేదు అని ఈ సినిమా తో కూడా నిరూపితం అయిందని చాలా మంది కామెంట్స్ చేశారు. సినిమా విడుదల అయ్యి రెండు వారాలు కూడా నిండకుండానే అప్పుడే ఓటీటీ లో స్ట్రీమింగ్‌ అవుతుంది అంటే ఈ సినిమా ఫలితం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

సుధీర్‌ బాబు మామా మశ్చీంద్ర సినిమాను థియేటర్లలో అక్టోబర్‌ 6న విడుదల చేయడం జరిగింది. రెండు వారాల లోపే అంటే ఇప్పటికే ఆహా మరియు అమెజాన్‌ ప్రైమ్‌ లో ఈ సినిమాను స్ట్రీమింగ్‌ మొదలు పెట్టారు. ఒకే సారి రెండు ఓటీటీ ల్లో ఈ సినిమా స్ట్రీమింగ్‌ అవుతూ ఉండటం తో ఎక్కువ మంది ఈ సినిమా ను చూసే అవకాశం ఉంటుంది.

బాక్సాఫీస్ వద్ద ప్రతికూల వాతావరణం ఎదుర్కొన్న ఈ సినిమాకు ఓటీటీ వద్ద అయినా పాజిటివ్‌ రెస్పాన్స్ వచ్చేనా.. ఎక్కువ మంది ప్రేక్షకులు ఈ సినిమా ను చూసేనా అంటూ యూనిట్‌ సభ్యులు అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా లో రాజీవ్ కనకాల, హరితేజ, అలీ రెజా, అజయ్‌ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించారు.