Begin typing your search above and press return to search.

బాబోయ్‌... 25 ఏళ్ల క్రితం ఇలాంటి సినిమానా?

ఈమధ్య కాలంలో ఓటీటీ పరిధి విపరీతంగా పెరగడంతో కంటెంట్‌ విషయంలో చాలా మార్పులు వచ్చాయి.

By:  Tupaki Desk   |   14 April 2025 9:00 PM IST
Malena Movie Returns on OTT
X

ఈమధ్య కాలంలో ఓటీటీ పరిధి విపరీతంగా పెరగడంతో కంటెంట్‌ విషయంలో చాలా మార్పులు వచ్చాయి. ప్రముఖంగా అడల్ట్‌ కంటెంట్‌ను ఇచ్చే ఓటీటీలు ఎక్కువ అయ్యాయి. సినిమాల్లో ఆ సన్నివేశాలు ఒక మోస్తరుగా ఉన్నప్పటికీ వెబ్ సిరీస్‌ల్లో ఆ కంటెంట్‌ విచ్చల విడిగా ఉంటుంది. ముఖ్యంగా కొన్ని ప్రత్యేకమైన ఓటీటీల్లో బూతు కంటెంట్‌ను హద్దు పద్దు లేకుండా చూపిస్తూ ఉన్నారు. అలాంటి కంటెంట్‌కు ఎక్కువ డిమాండ్ ఉంది అంటున్నారు. మార్కెట్‌లో ఈ సినిమాల గురించి ప్రముఖంగా చర్చ జరుగుతోంది. అయితే ఇలాంటి సినిమాలో ఇప్పుడే కాదు పాతికేళ్ల క్రితం కూడా వచ్చాయని 'మలేనా' సినిమా చెప్పకనే చెబుతోంది.

లూసియానో విన్సెంజోని కథ ఆధారంగా గియుసేప్‌ టోర్నటోర్ రూపొందించిన 'మలేనా' ఇన్నాళ్లు ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులో లేదు. కానీ తాజాగా ఈ సినిమాను ఓటీటీ ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. ప్రముఖ ఓటీటీలు అమెజాన్‌, నెట్‌ఫ్లిక్స్‌తో పాటు యాపిల్‌ టీవీలోనూ ఈ సినిమాను అందుబాటులో ఉంచారు. ఈమధ్య కాలంలో సోషల్‌ మీడియాలో ఈ సినిమా గురించి ప్రముఖంగా చర్చ జరుగుతున్న కారణంగా అసలు సినిమాలో ఏం ఉంది అనేది చూడాలని చాలా మంది కోరుకుంటున్నారు. ముఖ్యంగా యూత్‌ ఆడియన్స్ ఈ సినిమాను చూసేందుకు ఆన్‌లైన్‌లో వెతుకుతున్నారు. ఎట్టకేలకు అన్ని చోట్ల ఈ సినిమా ఓటీటీ ద్వారా అందుబాటులో వచ్చింది.

2000 సంవత్సరంలో వచ్చిన మలేనా సినిమాకు 2001లో జరిగిన ఆస్కార్‌ అవార్డ్‌ వేడుకలో ఏకంగా రెండు అవార్డులు వచ్చాయి. ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఉత్తమ ఒరిజినల్‌ స్కోర్‌ మ్యూజిక్‌ దక్కించుకుంది. ప్రముఖ ఏఎండీబీలో ఏకంగా 7.4 రేటింగ్‌ను సొంతం చేసుకుంది. 1940లో యూరప్‌ నేపథ్యంలో సాగే కథతో ఈ సినిమాను రూపొందించారు. సినిమా మొత్తం రెండు పాత్రల మధ్య సాగే విధంగా స్క్రీన్‌ప్లేను డిజైన్ చేశారు. మలేనా అనే స్త్రీ పై 12 ఏళ్ల కుర్రాడి ఆకర్షణతో ప్రేమలో పడటం, ఆ తర్వాత జరిగే పరిణామాల నేపథ్యంలో సినిమా సాగుతుంది. ఒంటరి మహిళల పట్ల సమాజంలో కొందరు వ్యవహరించే తీరును ఈ సినిమాలో అద్దం పట్టినట్లు చూపించారు.

పాతిక సంవత్సరాల క్రితం థియేట్రికల్‌ రిలీజ్ అయిన మలేనా సినిమా ఈ మధ్య కాలంలో ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓటీటీలో సినిమాకు మంచి స్పందన వచ్చింది. చాలా మంది పాతిక సంవత్సరాల క్రితం ఇలాంటి సినిమాలు తీశారా... ఇలాంటి కంటెంట్‌ను అప్పటి నుంచే తీసేవారా అంటూ చాలా మంది నోరు వెళ్లబెడుతున్నారు. ఇటాలియన్ నటి మోనికా బెల్లూచి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా మార్చి 29 నుంచి 8 భాషల్లో అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ఓటీటీ ద్వారా ఎన్ని రికార్డ్‌లను బ్రేక్ చేస్తుందో చూడాలి. 73వ ఆస్కార్‌ అవార్డుల్లో ఏకంగా రెండు అవార్డులను సొంతం చేసుకున్న ఈ సినిమా ఓటీటీ ద్వారా ఇప్పుడు మరింత మందికి చేరువ అవుతుంది. అయితే ఇలాంటి బూతు కంటెంట్‌ జనాలకు అవసరమా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.