'లాగౌట్' మూవీ ఎలా ఉందంటే?
సోషల్ మీడియా లేకుండా అనేక మంది రోజు గడవదు. అందులో యువత అయితే అస్సలు విడిచిపెట్టడం లేదు.
By: Tupaki Desk | 19 April 2025 9:26 AMసోషల్ మీడియా లేకుండా అనేక మంది రోజు గడవదు. అందులో యువత అయితే అస్సలు విడిచిపెట్టడం లేదు. సింపుల్ గా చెప్పాలంటే.. కొందరు బానిసలవుతున్నారు. అలాంటి వారి జీవితాలను కళ్లకట్టినట్లు చూపించేలా రూపొందిన లాగ్ అవుట్ మూవీ రీసెంట్ గా జీ5 ఓటీటీలో స్రీమింగ్ కు వచ్చింది.
బాబిల్ ఖాన్, రసికా దుగల్ లీడ్ రోల్స్ లో నటించిన ఆ సినిమాను అమిత్ గొలానీ తెరకెక్కించారు. ప్రత్యూష్ పాత్రలో బాబిల్ కనిపించారు. తన కుటుంబం నుండి దూరమైన తర్వాత, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ ప్రత్యూష్ అపార్ట్ మెంట్ లో ఒంటరిగా జీవిస్తాడు. 10 లక్షల మంది ఫాలోవర్లే లక్ష్యంగా ఉంటాడు. ఇంతలో అతడి ఫోన్ ను ఎవరో దొంగలిస్తారు.
ఓ ఫ్యాన్.. తన ఫోన్ ను దొంగలించాడని తెలుసుకుంటారు. మరి ఆ క్రమంలో ప్రత్యూష్ జీవితం ఎలా మారింది? అనేదే లాగ్ అవుట్ సినిమా కథాంశం. అయితే మూవీలో బాబిల్ తన నటనతో ఆకట్టుకున్నారు. మంచి స్టోరీకి సరైన స్క్రీన్ ప్లే తోడవ్వడంతో బాబిల్ బాగా నటించారు. తనలోని టాలెంట్ ను బయటపెట్టారు.
రసికా దుగల్ కూడా తన యాక్టింగ్ తో మెప్పించారు. లాగ్ అవుట్ అనేది ప్రస్తుత జనరేషన్ కు సరైన సినిమా అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. స్క్రీన్ ప్లే చాలా ఇంట్రెస్టింగ్ ఉందని చెబుతున్నారు. మూవీ చూశాక.. అరే వేస్ట్ గా చూశామని అస్సలు అనిపించదని అంటున్నారు. క్యాస్టింగ్ తమ రోల్స్ కు న్యాయం చేశారని కామెంట్లు పెడుతున్నారు.
ముఖ్యంగా హరూన్, గవిన్ అందించిన మ్యూజిక్ సూపర్ అనే చెప్పాలి. సినిమా సాగుతున్న కొద్దీ.. తమ వర్క్ తో ఆసక్తి పెంచారు. పూజా గుప్తే సినిమాటోగ్రఫీకి మంచి మార్కులు పడ్డాయి. ప్రతీ సీన్ లో ఎక్కడా ఎలాంటి లాజిక్ మిస్ అవ్వకుండా చూసుకున్నారు. ఓవరాల్ గా సినిమాను ఇప్పుడు జనరేషన్ చూడాలని చెబుతున్నారు.
ఫైనల్ గా సినిమాలో బాబిల్ ఖాన్ యాక్టింగే మెయిన్ అట్రాక్షన్ అని, స్టోరీ లైన్ కూడా సూపర్ అని చెబుతున్నారు. ఆకర్షణీయమైన స్క్రీన్ ప్లే మూవీకి మరో బలమని అంటున్నారు. అదే సమయంలో సినిమా కాస్త స్టార్టింగ్ లో స్లోగా అనిపిస్తుందని, తర్వాత అలా ఆకట్టుకుంటుందని చెబుతున్నారు.