Begin typing your search above and press return to search.

కళ్లు చెదిరే భారీ ధరకు కాంతార ఓటీటీ రైట్స్: కన్నడలో రెండో హైయ్యెస్ట్

కన్నడ స్టార్ రిషభ్ శెట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కిన కాంతార ఛాప్టర్ 1 షూటింగ్ కంప్లీట్ చేసుకుని రిలీజ్ కు రెడీ అవుతోంది.

By:  Tupaki Desk   |   12 Sept 2025 5:20 PM IST
కళ్లు చెదిరే భారీ ధరకు కాంతార ఓటీటీ రైట్స్: కన్నడలో రెండో హైయ్యెస్ట్
X

కన్నడ స్టార్ రిషభ్ శెట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కిన కాంతార ఛాప్టర్ 1 షూటింగ్ కంప్లీట్ చేసుకుని రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమా దసర కానుకగా అక్టోబర్ 02న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఈ క్రమంలో ప్రీ రిలీజ్ బిజినెస్ చకచకా జరిగిపోతుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి డిజిటల్ హక్కులు సోల్డ్ అయ్యియి. భారీ ధరకు ఈ సినిమా ఓటీటీ డీల్స్ అమ్ముడయ్యాయి.

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో సినిమా స్టోరీ పై ఫుల్ నమ్మకంతో ఉంది. ఈ నేపథ్యంలో అమెజాన్ కాంతారా ఛాప్టర్ 1 సినిమా ఓటీటీ రైట్స్ ను రూ.125 కోట్ల భారీ ధరకు దక్కించుకుంది. అయితే కన్నడ బ్లాక్ బస్టర్ కేజీఎఫ్ 2 సినిమా రిలీజ్ తర్వాత.. ఇంత భారీ ధరకు అక్కడి చిత్రం ఓటీటీ డీల్స్ క్లోజ్ అవ్వడం ఇదే తొలిసారి. కన్నడలో అత్యధిక ధరకు ఓటీటీ డీల్స్ అమ్ముడైన రెండో సినిమా ఇది. తొలి స్థానంలో కేజీఎఫ్ 2 ఉంది. ఇదిలా ఉండగా, తమిళనాడు థియేట్రిలక్ రైట్స్ కూడా క్లోజ్ అయ్యాయి. ఈ సినిమా తమిళ్ వెర్షన్ రూ.32 కోట్లకు అమ్ముడైంది.

కాంతార తొలి పార్ట్ కు ఇది ప్రీక్వెల్ గా తెరకెక్కింది. తొలి పార్ట్ కు ముందు ఏం జరిగింది అనేది ఈ సినిమాలో చూపించనున్నారు. అయితే అంచనాలు లేకుండా వచ్చిన తొలి పార్ట్ సూపర్ డూపర్ హిట్ అవ్వడం వల్ల.. ప్రీక్వెల్ పై కూడా హైప్ క్రియేట్ అయ్యింది. దీంతో రిలీజ్ కు ముందే ఆమెజాన్ భారీ ధరకు ఓటీటీ హక్కులు దక్కించుకుంది. అయితే అదే తొలి పార్ట్ కు రిలీజ్ కు ముందు ఓ ఓటీటీ సంస్థ కూడా కొనుగోలు చేయడానికి ఆసక్తి కనబర్చలేదు.

కానీ ఆ భాగం హిట్ అవ్వడం వల్ల ప్రీక్వెల్ పై అందరికి నమ్మకం కుదిరింది. దీంతో ఇంత భారీ ధరకు ఓటీటీ డీల్ క్లోజ్ అయ్యింది. అయితే ఈ సినిమా కోసం దాదాపు 20 ఇంటర్నేషనల్ వీఎఫ్ ఎక్స్ సంస్థలు పని చేశాయని తెలుస్తోంది. ఇటీవల షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.

ఈ సినిమాను రిషభ్ శెట్టి స్వయంగా తెరకెక్కించారు. ఈయన హీరోగా నటించగా, రుక్మిణి వసంత్ హీరోయిన్ పాత్ర పోషించింది. ఇక అక్టోబర్ 02 తెలుగు సహా, కన్నడ, హిందీ, మలయాళం, తమిళ్ భాషల్లో పాన్ఇండియా రేంజ్ లో రిలీజ్ కానుంది.