ఈ వారం ఓటీటీలో రానున్న సినిమాలు, సిరీస్‌లు!
జూన్ మూడో వారం వచ్చేసింది. ఎప్పటిలానే ఈ వారం కూడా పలు సినిమాలు థియేటర్లలో రిలీజ్ కానుండగా, మరికొన్ని సినిమాలు ఓటీటీలోకి రానున్నాయి.
By: Tupaki Desk | 16 Jun 2025 9:46 AMజూన్ మూడో వారం వచ్చేసింది. ఎప్పటిలానే ఈ వారం కూడా పలు సినిమాలు థియేటర్లలో రిలీజ్ కానుండగా, మరికొన్ని సినిమాలు ఓటీటీలోకి రానున్నాయి. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున కాంబినేషన్ లో తెరకెక్కిన కుబేర సినిమాతో పాటూ 8 వసంతాలు అనే సినిమా కూడా థియేటర్లలో సందడి చేయనుండగా, బాలీవుడ్ లో చాలా గ్యాప్ తర్వాత ఆమిర్ ఖాన్ చేసిన సితారే జమీన్ పర్ సినిమా కూడా రిలీజ్ కానుంది. వీటితో పాటూ పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లు రిలీజ్ కానుండగా, ఏయే ప్లాట్‌ఫామ్ లో ఏయే సినిమాలు రిలీజవుతున్నాయో చూద్దాం. ముందుగా..
నెట్‌ఫ్లిక్స్‌లో..
జస్టిన్ విలియమ్: మ్యాజిక్ లవర్ అనే ఇంగ్లీష్ సినిమా
కౌలిట్జ్ అండ్ కౌలిట్జ్ అనే జర్మన్ వెబ్‌సిరీస్ సీజన్ 2
ట్రైన్ రెక్: మేయర్ ఆఫ్ మేహమ్ అనే హాలీవుడ్ మూవీ
అమెరికాస్ స్వీట్ హార్ట్స్ అనే హాలీవుడ్ వెబ్‌సిరీస్
సమ్‌బడీ ఫీడ్ ఫిల్ అనే ఇంగ్లీష్ వెబ్‌సిరీస్ సీజన్ 8
రోషారియో టిజెరస్ అనే స్పానిష్ వెబ్‌షిరీస్ సీజన్ 4
యోలాంతే అనే డచ్ వెబ్‌సిరీస్
ది వాటర్ ఫ్రంట్ అనే హాలీవుడ్ వెబ్‌సిరీస్
కే-పాప్: ది డీమన్ హంటర్స్ అనే కొరియన్ సినిమా
గ్రెన్ ఫెల్ అన్ కవర్డ్ అనే హాలీవుడ్ మూవీ
ఒలింపో అనే స్పానిష్ వెబ్‌సిరీస్
సెమీ సొయిటర్ అనే ఇంగ్లీష్ సినిమా
ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో అనే బాలీవుడ్ కామెడీ షో సీజన్3
ప్రైమ్ వీడియోలో..
గ్రౌండ్ జీరో అనే బాలీవుడ్ మూవీ
హాట్‌స్టార్ లో ...
సర్వైవింగ్ ఓహియో స్టేట్ అనే హాలీవుడ్ డాక్యుమెంటరీ
కేరళ క్రైమ్ ఫైల్స్ అనే తెలుగు డబ్బింగ్ వెబ్‌సిరీస్ సీజన్ 2
ఫౌండ్ అనే ఇంగ్లీష్ వెబ్‌సిరీస్ సీజన్ 2
జీ5 లో..
డిటెక్టివ్ షెర్డిల్ అనే బాలీవుడ్ మూవీ
ప్రిన్స్ అండ్ ఫ్యామిలీ అనే మలయాళ సినిమా
సన్ నెక్ట్స్‌లో..
జిన్: ది పెట్ అనే తమిళ సినిమా
ఆపిల్ ప్లస్ టీవీలో..
ది బుకనీర్స్ అనే హాలీవుడ్ వెబ్‌సిరీస్ సీజన్ 2
లయన్ గేట్ ప్లేలో..
కాబోల్ అనే ఫ్రెంచ్ వెబ్‌సిరీస్