ఈ వారం ఓటీటీ రిలీజులివే..!
అది కాకుండా మరికొన్ని సినిమాలు, సిరీస్‌లు ఓటీటీల్లో రిలీజ్ కానున్నాయి. మరి ఏ సినిమాలు ఏ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కు వస్తున్నాయో చూద్దాం.
By: Tupaki Desk | 3 July 2025 5:20 PM ISTచూస్తూ చూస్తుండగానే జులై నెల వచ్చేసింది. జులై నెల ఫస్ట్ వీక్ లో కొన్ని సినిమాలు థియేటర్లలో రిలీజ్ కానుండగా మరికొన్ని సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఓటీటీలో రిలీజ్ కానున్నాయి. అయితే ఈ వారం థియేటర్లలో రానున్న సినిమాల్లో నితిన్ నటించిన తమ్ముడు సినిమా తప్పించి చెప్పుకోదగ్గవేమీ లేవు. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించగా జులై 4న తమ్ముడు ప్రేక్షకుల ముందుకు రానుంది.
అది కాకుండా మరికొన్ని సినిమాలు, సిరీస్‌లు ఓటీటీల్లో రిలీజ్ కానున్నాయి. మరి ఏ సినిమాలు ఏ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కు వస్తున్నాయో చూద్దాం. అందులో ముందుగా..
నెట్‌ఫ్లిక్స్‌లో..
కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ లో వచ్చిన థగ్ లైఫ్
ది శాండ్ మ్యాన్ అనే వెబ్‌సిరీస్ సీజన్2
ది ఓల్డ్ గార్డ్2 అనే హాలీవుడ్ మూవీ
ప్రైమ్ వీడియోలో..
కీర్తి సురేష్, సుహాస్ జంటగా నటించిన ఉప్పు కప్పురంబు అనే సెటైరికల్ కామెడీ
హెడ్ ఆఫ్ స్టేట్ అనే మూవీ
జీ5లో..
కాళీధర్ లపతా అనే సినిమా
ఈటీవీ విన్‌లో..
హర్ష రోషన్, భాను ప్రకాష్, జయతీర్థ ప్రధాన పాత్రల్లో నటించిన ఆల్ ఇండియా ర్యాంకర్స్(ఏఐఆర్) అనే వెబ్ సిరీస్
సోనీ లివ్‌లో..
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ మర్డర్ కేసు ఆధారంగా తెరకెక్కిన ది హంట్ అనే వెబ్‌సిరీస్