సడెన్ గా ఓటీటీలోకి వచ్చిన బాలీవుడ్ హిట్ మూవీ
థియేటర్ రన్ ముగించుకున్న హౌస్‌ఫుల్5 ఇప్పుడు సైలైంట్ గా ఓటీటీలోకి వచ్చింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా ప్రస్తుతం రెంటల్ విధానంలో అందుబాటులోకి వచ్చింది.
By: Tupaki Desk | 18 July 2025 3:36 PM ISTబాలీవుడ్ లో కామెడీ జాతర సృష్టించిన హౌస్‌ఫుల్ ఫ్రాంచైజ్ నుంచి రీసెంట్ గా మరో సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్, రితేష్ దేశ్‌ముఖ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమాకు తరుణ్ మన్సుఖానీ దర్శకత్వం వహించారు. జూన్ 6న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా మంచి హిట్ ను అందుకుంది.
థియేటర్ రన్ ముగించుకున్న హౌస్‌ఫుల్5 ఇప్పుడు సైలైంట్ గా ఓటీటీలోకి వచ్చింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా ప్రస్తుతం రెంటల్ విధానంలో అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమాలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్, సోనమ్ బజ్వా, నర్గీస్ ఫక్రీ, దినో మోరియో, సంజయ్ దత్, జాకీ ష్రాఫ్, నానా పటేకర్ హౌస్‌ఫుల్5లో కీలక పాత్రల్లో నటించారు.
బిలీయనీర్ అయిన రంజిత్ తన 100వ బర్త్ డే ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలనుకుని దాని కోసం అతని కొడుకు దేవ్, దత్త పుత్రుడు షిరాజ్, బాడీ గార్డ్, బోర్డ్ మెంబర్లంతా కలిసి ఓ ప్రాంతానికి వెళ్లాలనుకుంటారు. సడెన్ గా ఈ జర్నీకి ముందు రోజు రంజిత్ చనిపోతారు. అతని మరణ వార్త బయటకు వస్తే, స్టాక్ మార్కెట్, షేర్ వాల్యూ పడిపోతుందని భయపడి ఈ విషయాన్ని సీక్రెట్ గా ఉంచి, ముందు అతని ఆస్తిని పంచుకోవాలనే కొడుకులకు ఎలాంటి సిట్యుయేషన్స్ ఎదురయ్యాయనే కథ చుట్టూ హౌస్ ఫుల్5 సినిమా నడుస్తుంది.
రూ.240 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ గా రిలీజైన హౌస్‌ఫుల్5 మొదటి రోజే వరల్డ్ వైడ్ గా రూ.30 కోట్లు కలెక్ట్ చేసింది. 42 రోజుల వరకు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.288.66 కోట్ల కలెక్షన్లు సాధించి లాభాలను అందుకుంది. ఇప్పుడు థియేట్రికల్ రన్ పూర్తవడంతో ఎలాంటి అనౌన్స్‌మెంట్ లేకుండా ఈ సినిమాను ఓటీటీలోకి తీసుకొచ్చారు. కాకపోతే దీన్ని రెగ్యులర్ ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ తీసుకున్న వాళ్లు చూడలేరని ప్రైమ్ వీడియో పేర్కొంది.
