Begin typing your search above and press return to search.

హార‌ర్ టెర్ర‌ర్: గ‌జ‌గ‌జ ఒణికించే టాప్ ఓటీటీ షోలు

అయితే ఇటీవ‌ల‌ ఓటీటీలో ద‌డ పుట్టించే కంటెంట్ తో టాప్ వెబ్ సిరీస్ లు ఏవి? అన్న‌ది ప‌రిశీలిస్తే తెలిసిన సంగ‌తులివి..

By:  Tupaki Desk   |   22 Aug 2023 5:31 PM GMT
హార‌ర్ టెర్ర‌ర్: గ‌జ‌గ‌జ ఒణికించే టాప్ ఓటీటీ షోలు
X

ఎన్ని జాన‌ర్లు ఉన్నా హార‌ర్ జాన‌ర్ కి ఉన్న ప్ర‌త్యేక‌తే వేరు. భ‌య‌పెట్ట‌గ‌లిగితే చాలు.. ఆడియెన్ ని థియేట‌ర్ల‌కు ర‌ప్పించ‌డం క‌ష్టం కాదని ప్రూవ్ అయింది. కాంచ‌న సిరీస్ స‌హా చాలా హార‌ర్ థ్రిల్ల‌ర్ లు ప్రేక్ష‌కుల‌ను అల‌రించాయి. అయితే ఇటీవ‌ల‌ ఓటీటీలో ద‌డ పుట్టించే కంటెంట్ తో టాప్ వెబ్ సిరీస్ లు ఏవి? అన్న‌ది ప‌రిశీలిస్తే తెలిసిన సంగ‌తులివి..

అనన్య బెనర్జీ- గౌరవ్ కె చావ్లా దర్శకత్వం వహించిన 'అధుర' ఒళ్లు ఝ‌ల‌ద‌రించే హార‌ర్ స్టోరీతో తెర‌కెక్కించిన‌ సిరీస్. 'బోర్డింగ్ స్కూల్‌' చుట్టూ తిరిగే ఒక అతీంద్రియ శ‌క్తి క‌థ‌తో భయానక భీభ‌త్స స‌న్నివేశాల‌తో క‌దిలిస్తుంది. మనస్సును కదిలించే రహస్యాలను తెర‌పై రివీల్ చేసారు.

సుజోయ్ ఘోష్ దర్శకత్వం వహించిన 'టైప్‌రైటర్' హార‌ర్ జాన‌ర్ లో ఆస‌క్తిని రేకెత్తించే సిరీస్. కొంద‌రు పరిశోధకులు హాంటెడ్ విల్లాలో ప్ర‌వేశించాక ఏం జ‌రిగింద‌నేదే ఈ సినిమా. కానీ కొత్త కుటుంబం ఆ విల్లా తాలూకా వింత గతాన్ని ఆవిష్క‌రించిన తీరు ఆస‌క్తిని క‌లిగిస్తుంది. ఈ చిత్రంలో పలోమి ఘోష్, పురబ్ కోహ్లీ, సమీర్ కొచ్చర్ నటించారు. హిందీ హర్రర్ సిరీస్ ఇది.

అంకహి అన్సుని.. టైటిల్ కి త‌గ్గ‌ట్టే ఆస‌క్తిక‌ర క‌థ హార‌ర్ నేప‌థ్యంతో రూపొందిన సిరీస్ ఇది. అతి పిన్న వయస్కుడైన UP ఇన్‌స్పెక్టర్ ఉమేష్ జాగీకి ఎదురైన స‌వాళ్లు ఏమిటి? అపరిష్కృతమైన నేరాలు - వింత సంఘటనల పట్టణంలో అత‌డు క్రైమ్ వెన‌క అస‌లు నిజాల్ని క‌నుగొన్నారా లేదా? అన్న‌దే ఈ సిరీస్ క‌థాంశం. భ‌య‌పెట్టే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో తెర‌కెక్కిన‌ సిరీస్ ఇది.

బేతాళ్.. హార‌ర్ కాన్సెప్ట్ వెబ్ సిరీస్. ప్రత్యేక దళాలు మారుమూల గ్రామంలో మరణించని మ‌నుషుల వ‌ల్ల‌ భయాందోళనలను ఎదుర్కొంటాయి. బ్రిటిష్ అధికారులు జాంబీలుగా మారాక ఏం జ‌రిగింది? అన్న‌ది తెర‌పై చూడాలి. మనుగడ అంటే భయాలు చీకటి చరిత్రను ఎదుర్కోవడం.. అనేది థీమ్ లైన్. బేతాళ్ పూర్తిగా భ‌య‌పెట్టే సిరీస్.

క‌న్న‌మూచీ (హైడ్ అండ్ సీక్).. త‌మిళ‌ వెబ్ సిరీస్ ఇది. ఒంటరి తల్లి, చెవిటి కూతురు, చెన్నైలోని హాంటెడ్ అపార్ట్‌మెంట్‌కు మారాక ఏం జ‌రిగింద‌నేది ఈ సిరీస్ క‌థాంశం. కూతురు అదృశ్యానికి గత హత్య లింకులు ద‌డ పుట్టిస్తాయి. గ్రిప్పింగ్ కథలో మిస్టరీ రివీల‌వుతుంది.. హార‌ర్ టెర్ర‌ర్ తో సిరీస్ ర‌క్తి క‌ట్టిస్తోంది. జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది.

గెహ్రైయాన్.. ఒక హార‌ర్ థ్రిల్ల‌ర్. బెంగుళూరులో ఒక బాధాకరమైన అనుభవాన్ని ఎదుర్కొన్న తర్వాత, రేనా ముంబైకి వెళుతుంది. ఇక్కడ, ఆమె పారానార్మల్ యాక్టివిటీస్ కి టార్గెట్ గా మారుతుంది. పారా నార్మ‌ల్ యాక్టివిటీస్ సినిమా త‌ర‌హాలోనే ద‌డ పుట్టించే హార‌ర్ థ్రిల్ల‌ర్ సిరీస్ ఇది.

పిశాచం.. టైటిల్ కి త‌గ్గ‌ట్టే గుబులు పెంచే సిరీస్ ఇది. రిమోట్ డిటెన్షన్ సెంటర్‌లోని మిస్టీరియస్ ఖైదీ దెయ్యాల ఉనికిని క‌నిపెట్టాక ఏం జ‌రిగిందో సిరీస్ లో చూడాలి. నిదా రహీమ్ (రాధిక ఆప్టే) చిల్లింగ్ ఈవెంట్‌లలో వింతైన అరబిక్ జానపద కథలను తెర‌పై చూపారు.