చందు-జాబిలి గ్లోబల్ ట్రెండింగ్.. రెండోసారి బ్లాక్‌బస్టర్
కోర్ట్ సినిమాతో పాటు బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ఛావా సైతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ సినిమాకు ఏమాత్రం తగ్గకుండా కోర్ట్‌కి స్పందన లభిస్తుందట.
By: Tupaki Desk | 17 April 2025 4:27 PM ISTనాని సమర్పణలో రామ్ జగదీష్ దర్శకత్వంలో రూపొంది గత నెల 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'కోర్ట్' సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. మూడు వారాల పాటు కంటిన్యూగా భారీ వసూళ్లు రాబట్టిన కోర్ట్ సినిమా నిర్మాతలతో పాటు డిస్ట్రిబ్యూటర్స్‌కి లాభాల పంట పండించింది. సినీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం లాంగ్ రన్‌లో ఈ సినిమా రూ.65 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. చిన్న సినిమాకు ఆ స్థాయిలో వసూళ్లు నమోదు కావడం అనేది అరుదుగా చూస్తూ ఉంటాం. సినిమాను సరైన సమయంలో విడుదల చేసి ఉంటే కచ్చితంగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించేది అనేది బాక్సాఫీస్ వర్గాల టాక్.
మార్చి నెల అంటే సినిమా ఇండస్ట్రీకి అన్ సీజన్ అంటూ ఉంటారు. అలాంటి అన్‌సీజన్‌లో వచ్చినప్పటికీ చందు-జాబిలిల ప్రేమ కథకు ఆ స్థాయి కలెక్షన్స్ నమోదు కావడం బాక్సాఫీస్ వర్గాల వారికి సైతం షాకింగ్‌గా ఉంది. సమ్మర్ సీజన్‌లో కోర్ట్ను తీసుకు వచ్చి ఉంటే బాగుండేది అనేది చాలా మంది అభిప్రాయం. థియేట్రికల్ రిలీజ్‌తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమా ఇటీవలే ఓటీటీలో స్ట్రీమింగ్ మొదలు అయింది. తక్కువ సమయంలోనే అత్యధిక వ్యూస్‌ను దక్కించుకుందని తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ఎన్నో పెద్ద సినిమాలు ఉన్నప్పటికీ ఈ సినిమా టాప్ లో ట్రెండ్ అవుతోంది.
కోర్ట్ సినిమాతో పాటు బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ఛావా సైతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ సినిమాకు ఏమాత్రం తగ్గకుండా కోర్ట్‌కి స్పందన లభిస్తుందట. నాన్ ఇంగ్లీష్ సినిమాల కేటగిరీలో కోర్ట్ సినిమా గ్లోబల్ రేంజ్‌లో 5వ స్థానంలో నిలిచింది. నెట్‌ఫ్లిక్స్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. థియేట్రికల్ రిలీజ్ అయ్యి భారీ విజయాలను సొంతం చేసుకున్న చాలా సినిమాలు ఓటీటీలో అంతగా ఆకట్టుకున్న దాఖలాలు లేవు. కానీ ఈ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు ఓటీటీలోనూ బ్లాక్ బస్టర్ సక్సెస్‌ను నమోదు చేయడం జరిగింది. స్ట్రీమింగ్ అయినప్పటి నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది.
చందు-జాబిలి ప్రేమ కథకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన దక్కింది. పోక్సో చట్టం ఉపయోగం ఎంత ఉందో, దాని దుర్వినియోగం కూడా అంతే ఉంది అంటూ ఈ సినిమాతో చెప్పే ప్రయత్నాలు చేశారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఒక ప్రయత్నంను ఎవరు చేయలేదు అంటూ చాలా మంది ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సినిమాను నాని నమ్మి సమర్పించేందుకు ముందుకు వచ్చాడు. ఈ సినిమా నచ్చకుంటే తన హిట్ 3 సినిమా చూడొద్దు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. దాంతో కోర్ట్ సినిమాకు మరింత క్రేజ్ దక్కింది. కోర్ట్ సినిమాలోని ప్రతి పాత్రకు మంచి స్పందన దక్కింది. అందుకే సినిమా విజయాన్ని సొంతం చేసుకుంది. కేవలం థియేట్రికల్ విజయాన్ని సొంతం చేసుకోవడం కాకుండా ఓటీటీలోనూ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
