Begin typing your search above and press return to search.

సిటాడెల్2 క్యాన్సిల్.. నిరాశ‌లో స‌మంత ఫ్యాన్స్

హాలీవుడ్ సిరీస్ సిటాడెల్ కు ఇండియ‌న్ వెర్ష‌న్ గా తెర‌కెక్కిన ఈ సిరీస్ లో స‌మంత‌, వ‌రుణ్ ధావ‌న్ జంట‌గా న‌టించారు.

By:  Tupaki Desk   |   17 April 2025 3:30 PM
సిటాడెల్2 క్యాన్సిల్.. నిరాశ‌లో స‌మంత ఫ్యాన్స్
X

ఖుషి సినిమా త‌ర్వాత స‌మంత నుంచి మ‌రో సినిమా వ‌చ్చింది లేదు. మయోసైటిస్ చికిత్సలో భాగంగా సినిమాల‌కు దూర‌మైన స‌మంత ఇప్పుడు పూర్తిగా కోలుకుని సిరీస్‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. మొన్నీ మ‌ధ్య ప్రైమ్ వీడియో కోసం రాజ్ అండ్ డీకే తో క‌లిసి సిటాడెల్ హ‌నీ బ‌న్నీ సిరీస్ చేసిన స‌మంత ఆ సిరీస్‌లో యాక్ష‌న్ సీన్స్ తో అద‌ర‌గొట్టింది.

హాలీవుడ్ సిరీస్ సిటాడెల్ కు ఇండియ‌న్ వెర్ష‌న్ గా తెర‌కెక్కిన ఈ సిరీస్ లో స‌మంత‌, వ‌రుణ్ ధావ‌న్ జంట‌గా న‌టించారు. ఆ సిరీస్ రిలీజైన టైమ్ లోనే రెండో సీజ‌న్ కూడా ఉంటుంద‌ని మేక‌ర్స్ వెల్ల‌డించారు. దీంతో స‌మంత ఫ్యాన్స్ సిటాడెల్2 కోసం వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు స‌డెన్ గా ప్రైమ్ వీడియో యాజ‌మాన్యం సిటాడెల్2 ను ర‌ద్దు చేస్తున్న‌ట్టు పేర్కొన్నారు.

సిటాడెల్ ఇండియ‌న్ వెర్ష‌న్, ఇటాలియ‌న్ వెర్ష‌న్ సీజ‌న్2 ను ర‌ద్దు చేసి వాటిని ఒరిజిన‌ల్ వెర్ష‌న్ లో విలీనం చేస్తున్న‌ట్టు ప్రైమ్ వీడియో ప్ర‌తినిధులు వెల్ల‌డించారు. సిటాడెల్2 ఒరిజిన‌ల్ వెర్ష‌న్ ను మాత్రం చాలా గ్రాండ్ గా తెర‌కెక్కించి అన్ని భాష‌ల్లోనూ ఆడియ‌న్స్ కు అందుబాటులోకి తీసుకురానున్న‌ట్టు ప్రైమ్ వీడియో టీమ్ క్లారిటీ ఇచ్చింది.

హాలీవుడ్ లో ప్రియాంక చోప్రా, రిచ‌ర్డ్ మ్యాడెన్ న‌టించిన సిటాడెల్ సిరీస్ కు ఇండియ‌న్, ఇటాలియ‌న్ వెర్ష‌న్స్ ను రీమేక్ చేసిన విష‌యం తెలిసిందే. ఈ రీమేక్స్ బాగానే స‌క్సెస్ అయిన‌ప్ప‌టికీ వేరువేరుగా ఇన్ని వెర్ష‌న్స్ తీయాలంటే బ‌డ్జెట్ త‌డిసి మోపెడ‌వుతున్న కార‌ణంగా మిగిలిన వాటిని ఒరిజిన‌ల్ లో విలీనం చేస్తున్నార‌ని తెలుస్తోంది. దీంతో సిటాడెల్2లో స‌మంత ఉండ‌ద‌ని తెలిసిన ఆమె ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు.

ప్రియాంక చోప్రా మెయిన్ లీడ్ లో న‌టిస్తున్న సిటాడెల్ సీజ‌న్2 ఒరిజిన‌ల్ వెర్ష‌న్ మాత్రం చాలా భారీ బ‌డ్జెట్ తో రూపొంద‌నుంది. ఈ సిరీస్ 2026లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా రూపొందిన ఈ సిటాడెల్ సిరీస్‌ల‌కు అన్ని భాష‌ల్లోనూ మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. సిటాడెల్2 గురించి ఓ ఇంట‌ర్వ్యూలో వ‌రుణ్ ధావ‌న్ మాట్లాడుతూ దాన్ని సినిమాగా రూపొందించాల‌ని ఆలోచిస్తున్న‌ట్టు చెప్పాడు. కానీ ఇప్పుడు సిటాడెల్2 ను ర‌ద్దు చేయ‌డం అంద‌రినీ షాక్ కు గురిచేసింది.