ఓటీటీలోకి ఛావా.. నిరాశలో ఫ్యాన్స్
ఛావా మూవీ ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ లో అందుబాటులోకి వచ్చింది.
By: Tupaki Desk | 11 April 2025 3:37 PM ISTబాలీవుడ్ మూవీ ఛావా బాక్సాఫీస్ వద్ద చేసిన సంచలనాలు, సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. ఓ మోస్తరు బజ్ తో రిలీజైన ఛావా, రిలీజయ్యాక అన్ని చోట్ల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుని బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. థియేటర్లలో సక్సెస్‌ఫుల్ రన్ ను ముగించుకున్న ఛావా ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫామ్ లోకి వచ్చేసింది.
ఛావా మూవీ ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ లో అందుబాటులోకి వచ్చింది. ఛతప్రతి శివాజీ కొడుకు, ఛత్రపతి శంభాజీ మహారాజ్ కథగా తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియన్ భాషల్లో రిలీజవగా, నెట్‌ఫ్లిక్స్ లోకి హిందీ వెర్షన్ మాత్రమే స్ట్రీమింగ్ కు వచ్చింది. అన్ని భాషల్లో ఛావా ఓటీటీలో రిలీజ్ అవుతుందనుకుంటే కేవలం హిందీ వెర్షన్ ను మాత్రమే రిలీజ్ చేశారు. దీంతో ఈ విషయంలో తెలుగు ఆడియన్స్ నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి.
లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఛత్రపతి శివాజీ చనిపోయాక ఎలాంటి అల్లర్లు జరిగాయి? వాటిని అతని కొడుకు శంభాజీ మహారాజ్ ఎలా ఆపగలిగాడు? శంభాజీ నాయకత్వం లోకి వచ్చిన తర్వాత మొఘల్ కోట అయిన బుర్హాన్‌పూర్‌పై దాడి చేసి మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పై ప్రతీకారం తీర్చుకోవడం, ఆ తర్వాత జరిగే వరుస గొడవలు, ఘర్షణలను శంభాజీ మహారాజ్ డీల్ చేసిన విధానం చుట్టూ ఛావా కథ నడుస్తుంది.
కథ పరంగానే కాకుండా టెక్నికల్ గా కూడా ఛావా చాలా సక్సెస్ అయింది. సినిమాలోని విజువల్స్ దగ్గర్నుంచి ప్రతీదీ ఆడియన్స్ కు నెక్ట్స్ లెవెల్ శాటిస్‌ఫ్యాక్షన్ ను ఇస్తాయి. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం, ఏఆర్ రెహమాన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, వాటితో పాటూ రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్, ఎంతో గొప్ప సంభాషణలు ఛావాను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లాయి.
ఛావా ఆడియన్స్ ను బాగా మెప్పించినప్పటికీ సినీ విమర్శకులు మాత్రం ఛావాకు మిక్డ్స్ రివ్యూలే ఇచ్చారు. స్క్రీన్ ప్లే ఇంకొంచెం ఫాస్ట్ గా ఉండాలని, స్క్రీన్ ప్లే డల్ అవడం వల్ల సినిమా స్లో అయిందని, ఆ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఛావాలోని ఫస్టాఫ్, వార్ సీన్స్ మరింత ఇంపాక్ట్ కలిగించేవని అభిప్రాయపడ్డారు. ఎవరేమన్నా సరే ఛావాకు ఆడియన్స్ మాత్రం బ్రహ్మరథం పట్టి సినిమాను బ్లాక్ బస్టర్ హిట్ చేశారు.
