Bigg Boss Telugu: నామినేషన్స్ లో బిగ్ బాస్ అదిరిపోయే ట్విస్ట్!
బిగ్‌బాస్ తెలుగు 10 పదో వారం నామినేషన్లలో కంటెస్టెంట్ల మధ్య తీవ్ర వాగ్వాదాలు జరిగాయి. నీతూ మాస్టర్‌తో పలువురు గొడవకు దిగారు. నామినేషన్ల ప్రక్రియ ముగిసిన తర్వాత బిగ్‌బాస్ ట్విస్ట్ ఇచ్చారు. కెప్టెన్ వంశీ మినహా హౌస్‌లోని మిగతా కంటెస్టెంట్లందరినీ ఎలిమినేషన్‌కు నామినేట్ చేశారు.
By: Tupaki Desk | 10 Nov 2026 9:17 AM ISTబిగ్ బాస్ తెలుగు సీజన్ 10 హౌస్ పదవ వారంలోకి అడుగు పెట్టిన తరుణంలో నామినేషన్ల ప్రక్రియ అత్యంత ఉద్రిక్తతలకు, ఊహించని వాగ్వాదాలకు వేదికైంది. సోమవారం జరిగిన ఈ నామినేషన్లలో కంటెస్టెంట్లు ఒకరిపై ఒకరు ఫొటోలను బాల్స్‌కు అంటించి తలుపు బయటికి తన్ని తమ కోపాన్ని ప్రదర్శించారు.
అయితే ఈ నామినేషన్ల తంతు ముగిసిన తర్వాత బిగ్‌బాస్ అందరికీ పెద్ద ట్విస్ట్ ఇస్తూ, ఇంటి సభ్యులందరినీ నామినేట్ చేసారు.
అమన్ శివను నామినేట్ చేయగా, ఇద్దరి మధ్య గోట్ టాస్క్ విషయాలపై తీవ్ర వాదన జరగడంతో త్రిగుణ్ మధ్యలో వచ్చి గొడవలో జోక్యం చేసుకున్నాడు. ముఖేష్ తనను తాను నమ్ముకున్న సుధీర్‌ను నామినేట్ చేశాడు. శ్వేత, నరేష్, దెబ్జానీలు నీతూ మాస్టర్‌ను 'సేఫ్ ప్లేయర్' అంటూ టార్గెట్ చేశారు. వెజిటేబుల్స్ చెడిపోవడం, సరిగ్గా గేమ్ ఆడకపోవడం వంటి పాయింట్లు ఎత్తుతూ నీతూను నామినేట్ చేశారు. ఈ క్రమంలో నీతూ మాస్టర్ తీవ్రంగా స్పందించి, త్రిగుణ్ మరియు వంశీలతో పెద్ద ఎత్తున అరిచి గొడవ పడింది.
శివ ముఖేష్‌ను నామినేట్ చేస్తూ.. దెబ్జానీని అడ్డుపెట్టుకుని తన క్యారెక్టర్‌ను నెగెటివ్‌గా చూపించే ప్రయత్నం చేస్తున్నాడంటూ ఆరోపించాడు. రామ్ ప్రసాద్ వర్షిణిని నామినేట్ చేయగా, గత వారం తనపై లెటర్ రాసిన విషయాన్ని, నరేష్‌ను వాడుకున్న వైనాన్ని ఎత్తిచూపుతూ ఇద్దరి మధ్య స్నేహం గురించి వాగ్వాదం జరిగింది.
నీతూను త్రిగుణ్ నామినేట్ చేయగా, ఆమె జోకర్ అంటూ మాట్లాడటంపై నీతూ ఏడుస్తూ, సింపతీ డ్రామా ఆడుతూ తీవ్రంగా రియాక్ట్ అయింది. నీతూ ఎవరేమి చెప్పినా వినకుండా కేవలం ఏడుపుతోనే కవర్ చేసుకునే ప్రయత్నం చేసిందని తోటి కంటెస్టెంట్లు భావించారు.
చివరగా వంశీ కూడా నీతూ మాస్టర్ తప్పులను ఎత్తిచూపుతూ నామినేట్ చేయగా, ఆమె మళ్లీ కన్నీటి పర్యంతమైంది. కంటెస్టెంట్లు అందరూ ఎవరికి నచ్చినట్లు వారు నామినేషన్లు పూర్తి చేసుకున్న తర్వాత, బిగ్‌బాస్ ఎంట్రీ ఇచ్చి అందరికీ ఒక పెద్ద షాక్ ఇచ్చారు.
ఈ పదవ వారంలో కెప్టెన్‌గా ఉన్న వంశీ మినహా.. హౌస్‌లో ఉన్న మిగతా అందరూ ఎలిమినేషన్ బరిలో నిలుస్తున్నట్లు ప్రకటించారు.
