Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ ఓటీటీ.. ఈ ట్విస్ట్ అస్సలు ఊహించలేదుగా..!

ఓటీటీ బిగ్ బాస్ ని ఆ సీజన్ పెద్దగా ఎవరు చూడలేదని బిగ్ బాస్ టీం ఆ నెక్స్ట్ సీజన్ బిగ్ బాస్ ఓటీటీని వద్దనుకున్నారు.

By:  Tupaki Desk   |   31 Jan 2024 9:30 AM GMT
బిగ్ బాస్ ఓటీటీ.. ఈ ట్విస్ట్ అస్సలు ఊహించలేదుగా..!
X

బిగ్ బాస్ సీజన్ 7 పూర్తి కాగా ఆ సీజన్ సూపర్ సక్సెస్ అయిన సందర్భంగా బిగ్ బాస్ టీం అదే ఉత్సాహంతో ఏమాత్రం ఆలస్యం లేకుండా బిగ్ బాస్ OTTని స్టార్ట్ చేయాలని అనుకున్నారు. బిగ్ బాస్ ఓటీటీ మొదటి సీజన్ బిందు మాధవి విన్నర్ గా నిలిచింది. ఓటీటీ బిగ్ బాస్ ని ఆ సీజన్ పెద్దగా ఎవరు చూడలేదని బిగ్ బాస్ టీం ఆ నెక్స్ట్ సీజన్ బిగ్ బాస్ ఓటీటీని వద్దనుకున్నారు. అయితే బిగ్ బాస్ సీజన్ 7 టైం లో టీవీల్లో చూసిన వారికన్నా డిస్నీ హాట్ స్టార్ లో షో చూసిన వారి పర్సంటేజ్ ఎక్కువని తెలుసుకుని బిగ్ బాస్ ఓటీటీ రెండో సీజన్ మొదలు పెట్టాలని అనుకున్నారు.

బిగ్ బాస్ ఓటీటీ సెకండ్ సీజన్ కి మళ్లీ కంటెస్టెంట్స్ ని సెలెక్ట్ చేసే కార్యక్రమం మొదలు పెట్టాలని చూస్తున్నారు. అయితే ఈ టైం లో కంటెస్టెంట్స్ నుంచి బిగ్ బాస్ టీం కి కొంత షాక్ తగిలిందట. వాళ్లు రెగ్యులర్ షోకి వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారు తప్ప బిగ్ బాస్ ఓటీటీ అయితే నో అనేస్తున్నారట. బిగ్ బాస్ కోసం వచ్చిన ఆడిషన్స్ లో సెలెక్ట్ చేసి పక్కన పెట్టిన వారు కొందరు ఉంటారు. అలాంటి వారిని ఓటీటీ సీజన్ కు మాట్లాడుతుంటారు.

కానీ ఓటీటీ సీజన్ అయితే మాత్రం మాకు ఇంట్రెస్ట్ లేదని అంటున్నారట. OTT సీజన్ కి కొంత క్రేజ్ వచ్చేలా ఆల్రెడీ బిగ్ బాస్ సీజన్స్ లో వచ్చిన కంటెస్టెంట్స్ ని తీసుకుంటారు. అలా యావర్, నయని పావనిని బిగ్ బాస్ ఓటీటీ రెండో సీజన్ కి సెలెక్ట్ చేయాలని అనుకున్నారట. విచిత్రం ఏంటంటే వారు కూడా మరోసారి బిగ్ బాస్ కు వచ్చేందుకు అంత ఆసక్తి చూపించలేదట.

హోస్ట్ గా నాగార్జున కూడా దాదాపు బిజీగానే ఉన్నారు. బిగ్ బాస్ టీం ఓటీటీ 2వ సీజన్ చేయాలనే ఆలోచన తప్ప మిగతా ఏది కూడా పెద్దగా ముందుకు సాగట్లేదట. అందుకే బిగ్ బాస్ ఓటీటీ సెకండ్ సీజన్ ఆలోచన వెనక్కి తీసుకున్నారట. ఓటీటీ సెకండ్ సీజన్ వస్తుందని అనుకున్న ఆడియన్స్ కి ఇది నిరుత్సాహపరిచే వార్తే.. సీజన్ 7 తర్వాత సీజన్ 8ని సరికొత్తగా ప్లాన్ చేయాలని బిగ్ బాస్ టీం ఏర్పాట్లు చేస్తున్నారట.