ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్..వెన్నులో వణుకు పుట్టాల్సిందే
ఓటీటీల ప్రభావం పెరిగిన దగ్గరి నుంచి థయేటర్లకు ప్రేక్షకులు వెళ్లడం లేదన్నది తెలిసిందే.
By: Tupaki Desk | 11 Jun 2025 3:20 PM ISTఓటీటీల ప్రభావం పెరిగిన దగ్గరి నుంచి థయేటర్లకు ప్రేక్షకులు వెళ్లడం లేదన్నది తెలిసిందే. ఇక ఓటీటీల్లో వచ్చే క్రైమ్ థ్రిల్లర్‌లు, ఇన్వెస్టీగేటివ్ థ్రిల్లర్స్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటుండటంతో వాటికి ఓటీటీల్లో భారీ డిమాండ్ ఏర్పడింది. వీటిని వీక్షించడానికి ప్రేక్షకులు కూడా ఆసక్తిని చూపిస్తుండటంతో ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్‌లు కూడా వీటికే అధిక ప్రాధాన్యతనిస్తున్నాయి. తాజాగా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతూ నెట్టింట వైరల్ గా మారిన క్రైమ్ థ్రిల్లర్ `భక్షక్`.
వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్‌లని ప్రేక్షకులు ఇష్టపడుతున్న నేపథ్యంలో ఈ సినిమాకు నెట్ ఫ్లిక్స్‌లో విశేష ఆధరణ లభిస్తోంది. భయంకరమైన ట్విస్ట్‌లతో సాగుతుండటంతో ప్రేక్షకులు ఈ మూవీకి ఓటీటీ వేదికగా బ్రహ్మరథం పడుతున్నారు. చెప్పుకోదగ్గ స్టార్స్ ఇందులో నటించకపోయినా కంటెంట్ విపరీతంగా నచ్చడంతో ఈ సినిమా ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ వన్‌లో ట్రెండ్ అవుతోంది. బీహార్‌లో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా దీన్ని తెరకెక్కించారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన ఈ మూవీకి మంచి ఆదరణ లభించింది, ఇందులో భూమి ఫడ్నేకర్ ప్రధాన పాత్రలో నటించింది. దేశ వ్యాప్తంగాసంచలనం సృష్టించిన ముజాఫర్ పూర్ బస్ షెల్టర్ ఆధారంగా రూపొందించారు. పుల్కిత్ డైరెక్ట్ చేసిన ఈ మూవీని రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై గౌరవ్ వర్మతో కలిసి షారుక్ వైఫ్ గౌరీఖాన్ నిర్మించింది. నెట్ ఫ్లిక్స్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతున్న ఈ సినిమా ఐఎండీబీలో 7.2 రేటింగ్‌ని సాధించింది.
ఆశ్రమాల ముసుగులో అమ్మాయిల అక్రమ రవాణా నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ఇప్పుడు నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతూ సంచలనం సృష్టిస్తోంది. ఇందులోని ఇతర పాత్రల్లో ఆదిత్య శ్రీవాస్తవ, సంజయ్ మిశ్రా, సాయి తమంహర్, సూర్యవంశీ నటించారు. ఆశ్రమాల ముసుగులో అమ్మాయిల అక్రమ రావాణా వెనకున్న రహస్యాలని ఛేదించే జర్నలిస్ట్‌గా భూమి ఫడ్నేకర్ అద్భుతమైన నటనని ప్రదర్శించింది. యాధర్థ సంఘటనల నేపథ్యంలో రూపొందే క్రైమ్ థ్రిల్లర్‌లని ఇష్టపడే ప్రేక్షకులని ఈ సినిమా విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇప్పటికీ చూడని వారు నెట్ ఫ్లిక్స్‌లో చూడొచ్చు.
