ఓటీటీలో ఉన్న బెస్ట్ స్పై థ్రిల్లర్లు ఇవే!
స్పై థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్‌లకు ఈ మధ్య బాగా క్రేజ్, డిమాండ్ పెరిగిపోతుంది.
By: Tupaki Desk | 16 July 2025 1:00 PM ISTస్పై థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్‌లకు ఈ మధ్య బాగా క్రేజ్, డిమాండ్ పెరిగిపోతుంది. ఆడియన్స్ ఈ జానర్ ప్రాజెక్టులను చూడ్డానికి ఎంతో ఇష్టపడుతున్నారు. ఆడియన్స్ ను మెప్పించే, థ్రిల్ కు గురి చేసే స్పై జానర్ కు సంబంధించిన ప్రాజెక్టులు ఏయే ఓటీటీల్లో ఉన్నాయో చూద్దాం.
స్పెషల్ ఓపీఎస్: ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ అందుకున్న యాక్షన్ స్పై థ్రిల్లర్ వెబ్ సిరీస్ స్పెషల్ ఓపీఎస్ నుంచి ఇప్పుడు రెండో సీజన్ రాబోతుంది. జులై 18 నుంచి స్పెషల్ ఓపీఎస్ సీజన్2 జియో హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కు రానుంది.
బెర్లిన్ చెవిటి, మూగ వాడైన అశోక్ 1993 ఢిల్లీలో గూఢచార్యం ఆరోపణలు ఎదుర్కొన్న నేపథ్యంలో అతన్ని విచారించే క్రమంలో ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఎవరి హెల్ప్ తీసుకున్నాయి. నిజంగానే అశోక్ గూఢచర్యం చేశాడా? లాంటి థ్రిల్లింగ్ అంశాలతో రూపొందిన ఈ సినిమాకు అతుల్ సభర్వాల్ దర్శకత్వం వహించగా, ఈ సినిమా జీ5 లో స్ట్రీమింగ్ అవుతుంది.
తనావ్: చనిపోయాడనుకున్న ఓ ఉగ్రవాది బతికున్నాడని తెలిసిన తర్వాత స్పెషల్ టాస్క్ గ్రూప్, ఓ ఉగ్రవాద గ్యాంగ్ మధ్య జరిగే గొడవల ఆధారంగా కశ్మీర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ వెబ్‌సిరీస్ ను సుధీర్ మిశ్రా, సచిన్ కృష్ణ్, నివాస్ తెరకెక్కించారు. ఈ సిరీస్ కు సంబంధించి రెండు సీజన్లు రాగా సోనీ లివ్ లో తనావ్ స్ట్రీమింగ్ అవుతోంది.
కాఠ్మండూ కనెక్షన్: 1993 ముంబై పేలుళ్లు, 1999లో జరిగిన ప్లేన్ హైజాక్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ నుంచి ఇప్పటికే రెండు సీజన్లు వచ్చాయి. డిటెక్టివ్, జర్నలిస్ట్ ప్రధాన పాత్రలుగా రూపొందిన ఈ సిరీస్‌కు సిద్ధార్థ్ మిశ్రా దర్శకత్వం వహించగా, సోనీలివ్ లో ఈ వెబ్ సిరీస్ అందుబాటులో ఉంది.
ముఖ్బీర్ ది స్టోరీ ఆఫ్ ఏ స్పై: శివమ్ నాయర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ 1965 యుద్ధ నేపథ్యంలో పాకిస్థాన్ లో నిఘా సమాచారాన్ని సేకరించే ఇండియన్ సీక్రెట్ ఏజెంట్ కథగా తెరకెక్కింది. ఈ సిరీస్‌లో ప్రకాష్ రాజ్, జైన్ ఖాన్ దురానీ, సత్యదీప్ మిశ్రా ప్రధాన పాత్రల్లో నటించగా ఈ సిరీస్ జీ5లో అందుబాటులో ఉంది.
అదృశ్యం- ది ఇన్విజిబుల్ హీరోస్: బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ యాక్టివిటీస్ కు చెందిన ఇద్దరు హై ప్రొఫైల్ సీక్రెట్ ఏజెంట్స్ నేపథ్యంలో రూపొందిన వెబ్ సిరీస్ కు అన్షుమాన్ కిషోర్ సింగ్ దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ నుంచి రెండు సీజన్లు రాగా అందులో ఐజాజ్ ఖాన్, పూజా గోర్, దివ్యాంక త్రిపాఠి ప్రధాన పాత్రల్లో నటించారు. సోనీలివ్ లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమ్ అవుతుంది.
