Begin typing your search above and press return to search.

వీకెండ్ స్పెషల్.. ఓటీటీలో ఆ మూవీస్ మస్ట్ వాచ్!

కరోనా వచ్చిన తర్వాత మొత్తం ఓటీటీల హవా నడుస్తోంది. అందుకే థియేటర్లలో విడుదలయ్యే ప్రతి సినిమా కూడా ఇప్పుడు ఓటీటీలలో ప్రత్యక్షమవుతూ ఆడియన్స్ కి మంచి వినోదాన్ని పంచుతున్నాయి.

By:  Madhu Reddy   |   7 Aug 2026 10:40 PM IST
వీకెండ్ స్పెషల్.. ఓటీటీలో ఆ మూవీస్ మస్ట్ వాచ్!
X

కరోనా వచ్చిన తర్వాత మొత్తం ఓటీటీల హవా నడుస్తోంది. అందుకే థియేటర్లలో విడుదలయ్యే ప్రతి సినిమా కూడా ఇప్పుడు ఓటీటీలలో ప్రత్యక్షమవుతూ ఆడియన్స్ కి మంచి వినోదాన్ని పంచుతున్నాయి. ఈ క్రమంలోనే వారాంతం వచ్చిందంటే చాలు అటు ఆడియన్స్ ఓటీటీల ముందు వాలిపోతున్నారు. నచ్చిన మూవీ ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఎప్పటిలాగే ఆగస్టు మొదటి వారాంతంలో కూడా కొన్ని చిత్రాలు, సిరీస్ లు ప్రేక్షకులను అలరించడానికి వచ్చేసాయి. ప్రత్యేకించి ఆ కొన్ని చిత్రాలను మాత్రం తప్పకుండా చూడాల్సిందే. మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్, క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ తో పాటు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ జానర్ లో సినిమాలను ఎంజాయ్ చేసేవారికి ఈ సినిమాలు మంచి ఆప్షన్. మరీ ముఖ్యంగా ఏకంగా 17 సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు కూడా స్ట్రీమింగ్ కి వచ్చేసాయి. ఆ చిత్రాలేంటో ఇప్పుడు చూద్దాం..

జీ 5.. రూరల్ బ్యాక్ డ్రాప్ నుండి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ వరకూ..

లెనిన్: అఖిల్ అక్కినేని హీరోగా, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో లేటెస్ట్గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం లెనిన్.. రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా.. ఏకంగా రూ.100 కోట్ల క్లబ్లో చేరి సంచలనం సృష్టించింది. అలాంటి ఈ సినిమా ప్రస్తుతం ప్రముఖ ఓటిటి ఫ్లాట్ ఫామ్ జీ 5 లో నేటి నుంచి స్ట్రీమింగ్ కి వచ్చేసింది.

వంద దేవుళ్ళు:

విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన తాజా ఫ్యామిలీ ఎంటర్టైనర్ వంద దేవుళ్ళు.తెలుగు,తమిళ్ సహ పలు భాషలలో జీ5 వేదికగా స్ట్రీమింగ్ కి వచ్చేసింది.

ఈ రెండు చిత్రాలతో పాటు మరాఠీ మూవీ తుంబడ్ చీ మంజులా చిత్రం కూడా స్ట్రీమింగ్ కి వచ్చేసింది.

అమెజాన్ లో తెలుగు చిత్రాల సందడి..

ఓ! సుకుమారి.. ఐశ్వర్య రాజేష్, తిరువీర్ కాంబినేషన్లో ఇటీవల థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు ఆడియన్స్ ను అలరించడానికి అమెజాన్ వేదికగా స్ట్రీమింగ్ కి వచ్చింది.

వదంది 2:

2022లో వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ వదంది. అప్పట్లో సూపర్ రెస్పాన్స్ అందుకున్న ఈ సిరీస్ సీక్వెల్ శుక్రవారం నుండి ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. తమిళ్ తో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో అందుబాటులోకి వచ్చింది.

ఎమ్.ఆర్.పీ:

శ్రవణ జ్యేష్ఠ దర్శకత్వంలో నరేష్ అగస్త్య, డోనల్ బిస్ట్ ప్రధాన పాత్రల్లో వెన్నెల కిషోర్ ,హర్షవర్ధన్ , పృథ్వీరాజ్ , నందగోపాల్, స్నేహ సింగ్ కీలక పాత్రలు పోషిస్తూ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఎమ్. ఆర్.పీ. కామెడీ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా థియేటర్లలో మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. అటు ఆడియన్స్ ని కూడా బాగా ఆకట్టుకుంది. కష్టాల్లో ఉన్న ముగ్గురు రూమ్ మేట్స్ ఒక వినూత్నమైన వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఒక గ్యాంగ్ స్టర్ నుండి డబ్బు అప్పుగా తీసుకుంటారు.

కానీ ఒక తప్పుడు నిర్ణయం వారిని ఒక గందరగోళమైన విమోచన పథకంలో ఇరికిస్తుంది. ఆ తర్వాత ఆ ముగ్గురు రూమ్ మేట్స్ దాని నుండి ఎలా బయటపడ్డారు? అనే కాన్సెప్ట్ తో జూలై 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హాస్యం, నేరం, ఊహించని మలుపులతో కూడిన ఈ ఉత్కంఠ భరితమైన ప్రయాణం ఇప్పుడు ఓటీటీలో ప్రేక్షకులను అలరించడానికి అమెజాన్ ప్రైమ్ వేదికగా సిద్ధమైంది. ఇకపోతే అమెజాన్ ప్రైమ్ లో మాత్రమే కాకుండా ఆహా , జియో హాట్ స్టార్ వేదికగా కూడా ఈ సినిమా స్ట్రీమింగ్ కి వచ్చింది.

నెట్ ఫ్లిక్:

హృదయం మురళి:

ఆకాష్ భాస్కరన్ దర్శకత్వంలో అధర్వ, ప్రీతి ముకుందన్, కయాదు లోహర్, మాళవిక మోహనన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఇదయం మురళి. ఈ తమిళ్ చిత్రాన్ని తెలుగులో హృదయం మురళి పేరిట డబ్బింగ్ చేసి విడుదల చేశారు. అలాంటి ఈ సినిమా ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కి వచ్చింది.

ఈ చిత్రంతో పాటు హిందీ సినిమా మై వాపస్ ఆవుంగా, ఇంగ్లీష్ మూవీ ది లాస్ట్ హౌస్, హాలీవుడ్ మూవీ లవ్ హార్డ్స్, ద రిబ్బన్ హీరో మూవీతో పాటు మరో హాలీవుడ్ మూవీ బిగ్ చికెన్: ఏ ఫాస్ట్ ఫుడ్ కాన్స్ పరసీ చిత్రాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. అలాగే ఆపరేషన్ సఫేద్ సాగర్ తో పాటు మరికొన్ని సిరీస్ లు కూడా స్ట్రీమింగ్ అవుతున్నాయి.

సన్ నెక్స్ట్:

సత్యతిల్ సంబవిచతు (మలయాళం మూవీ)

మనోరమ మ్యాక్స్:

పొంగల

జియో హాట్ స్టార్:

ది సూపర్ మారియో గెలాక్సీ (ఇంగ్లీష్ మూవీ)

ఇకపోతే మంచి కామెడీ, సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ , విలేజ్ బ్యాక్ డ్రాప్ జానర్ లో సినిమాలు కోరుకునే వారికి లెనిన్, వంద దేవుళ్ళు, ఇదయం మురళి, వదంది 2, ఎమ్.ఆర్.పీ వంటి చిత్రాలు బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.