ఆలియా అప్పుడు క్రైమ్ డ్రామా.. ఈసారి అడల్ట్ డ్రామా!
టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలో రామరాజు ప్రియురాలు సీత పాత్రలో నటించి మెప్పించిన ఆలియా భట్ నటిగా ఫుల్ బిజీగా ఉంది.
By: Tupaki Desk | 10 April 2025 12:52 PM ISTటాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలో రామరాజు ప్రియురాలు సీత పాత్రలో నటించి మెప్పించిన ఆలియా భట్ నటిగా ఫుల్ బిజీగా ఉంది. హీరోయిన్‌గా వరుస సినిమాల్లో నటిస్తున్న ఆలియా భట్ మరో వైపు నిర్మాతగానూ ప్రాజెక్ట్‌లను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తోంది. గతంలో ఆలియా భట్ తన ఎటర్నల్ సన్ షైన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో అమెజాన్ ప్రైమ్‌తో కలిసి పోచర్ అనే వెబ్ సిరీస్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చింది. 2015లో కేరళలో జరిగిన ఆపరేషన్ శిఖర్ ఆధారంగా రూపొందించారు. క్రైమ్ డ్రామాగా ఆ సిరీస్ సాగింది. గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన పోచర్‌కి మంచి స్పందన దక్కింది.
గత ఏడాది క్రైమ్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆలియా భట్ వచ్చే ఏడాది అడల్ట్ డ్రామా వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అమెజాన్ ప్రైమ్‌తో కలిసి మరోసారి తన ఎటర్నల్ సన్ షైన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో ఆలియా భట్ ఒక వెబ్ సిరీస్‌ను నిర్మించేందుకు సిద్ధం అయింది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్‌కి సంబంధించిన నటీనటుల ఎంపిక జరుగుతోంది. ఈ వెబ్ సిరీస్‌లో అడల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉండబోతుందట. అదే సమయంలో డ్రామా కూడా ఉంటుందని, తప్పకుండా యూత్ ఆడియన్స్‌ను ముఖ్యంగా జెన్ జెడ్ ప్రేక్షకులను మెప్పించే విధంగా ఈ వెబ్ సిరీస్ ఉంటుంది అంటూ బాలీవుడ్‌లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
ఒక నగరంలో జరిగే కథ ఆధారంగా ఈ వెబ్ సిరీస్‌ను రూపొందిస్తున్నారు. నలుగురు కుర్రాళ్లు ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. ఆ పాత్రల కోసం నలుగురు కొత్త కుర్రాళ్లను వెతికి పట్టుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అతి త్వరలోనే వెబ్ సిరీస్‌కి సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు మొదలు పెట్టాలని భావిస్తున్నారు. విభిన్నమైన రొమాంటిక్ డ్రామాలకు, అడల్ట్ కంటెంట్ వెబ్ సిరీస్‌లకు ఓటీటీ ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ దక్కుతుంది. కనుక ఈ వెబ్ సిరీస్ సైతం ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటూ బాలీవుడ్ వర్గాల వారు, మీడియా సర్కిల్స్ వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఆలియా, అమెజాన్ కలయికలో రాబోతున్న ఈ రెండో ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన అతి త్వరలోనే వచ్చే అవకాశాలు ఉన్నాయి. హీరోయిన్‌గా ఎంత బిజీగా ఉన్నా ప్రొడక్షన్ పై ఆసక్తితో ఆలియా భట్ ఆ పనులు కూడా చూసుకుంటూ ఉంది. తనకు ఉన్న బ్రాండ్ ఇమేజ్‌ను వినియోగించుకుంటూ నిర్మాతగా రాణిస్తోంది. ముందు ముందు స్టార్ హీరోల సినిమాలను, తాను నటించే సినిమాలను సైతం ఆలియా నిర్మిస్తుందేమో చూడాలి. ప్రస్తుతం ఆలియా భట్ సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందుతున్న 'లవ్ అండ్ వార్' సినిమాలో నటిస్తోంది. రణబీర్ కపూర్, విక్కీ కౌశల్‌లు ఆ సినిమాలో నటిస్తున్నారు. విభిన్నమైన కథతో రూపొందుతున్న ఆ సినిమాను వచ్చే ఏడాది మార్చిలో విడుదల చేయబోతున్నారు.
