Begin typing your search above and press return to search.

మ్యాచ్ మధ్యలో వెళ్లి కోహ్లీ జెర్సీ మార్చుకు వచ్చారెందుకు?

టీమిండియా.. పాకిస్థాన్ తో జరిగే క్రికెట్ మ్యాచ్ కు ఉండే ప్రత్యేక స్థానం గురించి తెలిసిందే.

By:  Tupaki Desk   |   15 Oct 2023 4:15 AM GMT
మ్యాచ్ మధ్యలో వెళ్లి కోహ్లీ జెర్సీ మార్చుకు వచ్చారెందుకు?
X

టీమిండియా.. పాకిస్థాన్ తో జరిగే క్రికెట్ మ్యాచ్ కు ఉండే ప్రత్యేక స్థానం గురించి తెలిసిందే. అందునా.. ప్రపంచకప్ టోర్నీలో భాగంగా జరిగే మ్యాచ్ కు మరింత ఆసక్తికరంగానే కాదు.. హైవోల్టేజ్ తో నిండి ఉంటుంది. తాజాగా మరోసారి మ్యాచ్ జరగటం.. అందులో టీమిండియా సునాయాసంగా విజయాన్ని సాధించటం తెలిసిందే. స్వల్ప స్కోర్ కే పాక్ బ్యాట్స్ మెటన్లు అలౌట్ కావటం.. విజయ లక్ష్యాన్ని ఇట్టే పూర్తి చేసిన టీమిండియా సభ్యులతో క్రికెట్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు.

భారీ స్టేడియంలో లక్షలాది మంది సొంత అభిమానుల చెంత ఉండగా చెలరేగిపోయిన టీమిండియా ప్లేయర్ల ధాటికి పాక్ జట్టు విలవిలాడిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్ జట్టు బ్యాటింగ్ చేస్తున్న వేళ.. మ్యాచ్ మధ్యలో కోహ్లీ పెవిలియన్ కు పరిగెత్తుకెళ్లటం ఆసక్తికరంగా మారింది. కాసేపటికి బయటకు వచ్చిన అతగాడి జెర్సీ మారటం అందరూ చర్చించుకునేలా చేసింది.

ప్రపంచకప్ కోసం టీమిండియా సభ్యులు ధరించే షర్టు భుజం మీద మువ్వెన్నెల జెండా గుర్తుతో ఉండే జెర్సీని రూపొందించారు. అయితే.. విరాట్ కోహ్లీ ఆ జెర్సీని ధరించాల్సి ఉన్నప్పటికీ.. తెల్ల స్ట్రిప్ ఉన్న తప్పుడు జెర్సీని వేసుకొని పెవిలియన్ కు వచ్చాడు. మ్యాచ్ ఏడో ఓవర్ ముగిసిన వేళలో.. తాను వేసుకున్న తప్పుడు జెర్సీని గుర్తించిన విరాట్.. పెవిలియన్ కు పరిగెత్తుకెళ్లి.. జెర్సీ మార్చుకు వచ్చాడు.

ఆసక్తికరమైన విషయం ఏమంటే.. కోహ్లీ జెర్సీ మార్చుకు వచ్చిన తర్వాతి ఓవర్లోనే షఫీజ్ ను హైదరాబాదీ బౌలర్ సిరాజ్ ఔట్ చేసి భారత్ కు తొలి వికెట్ ను ఇచ్చారు. ఆ తర్వాత నుంచి వికెట్లు ఒకదాని తర్వాత మరొకటి అన్నట్లుగా పడిపోవటం తెలిసిందే. ఈ మ్యాచ్ లో మరో ఆసక్తికర పరిణామం ప్రేక్షకులకు కనిపించింది. కీలకమైన వికెట్ కు ముందు బంతిని నోటికి దగ్గరగా పెట్టి.. ఏదో మాట్లాడి బంతి వేసిన హార్దిక్ కు ఆ బంతికి వికెట్ పడటం ఆసక్తికరంగా మారింది.

హార్దిక్ 13వ ఓవర్ లో వేసిన రెండో బంతిని ఇమాముల్ హక్ ఫోర్ కొట్టాడు. ఆ తర్వాతి బంతిని వేసేందుకు సిద్ధమైన హార్దిక్.. బాల్ ను నోటికి దగ్గరగా పెట్టుకొని ఏదో అనటం.. ఆ వెంటనే తనకు దూరంగా వెళుతున్న బంతిని కదిలించుకొన్న ఇమాముల్ హక్.. వికెట్ కీపర్ కు దొరికిపోయాడు. దీంతో.. అతగాడు తన వికెట్ ను సమర్పించుకున్నాడు. దీంతో.. బంతికి ఏదో మంత్రం వేసిన హార్దిక్ వికెట్ సాధించాడని సరదాగా వ్యాఖ్యలు చేయటం కనిపించింది.