Begin typing your search above and press return to search.

విండీస్ 27 ఆలౌట్..టెస్టుల్లో 2వ అత్యల్పం.. 15 బంతుల్లో స్టార్క్ 6/9

కేవలం 15 బంతుల్లో 9 పరుగులు మాత్రమే చేసి 6 వికెట్లు తీసి కుప్పకూల్చాడు. అసలే స్కాట్ బోలాండ్ (3/2), హేజిల్ వుడ్ (1/10) మిగతా పని పూర్తిచేశారు.

By:  Tupaki Desk   |   15 July 2025 3:37 PM IST
విండీస్ 27 ఆలౌట్..టెస్టుల్లో 2వ అత్యల్పం.. 15 బంతుల్లో స్టార్క్ 6/9
X

గులాబీ బంతితో టెస్టు మ్యాచ్ అంటే మామాలుగా ఉండదు... టీమ్ ఇండియా వంటి జట్టే 36 పరుగులకు ఆలౌటైంది. అలాంటిది వెస్టిండీస్ ఏం నిలుస్తుంది..? అది కూడా ఆస్ట్రేలియాతో...? ఇప్పుడు ఇదే జరిగింది.. సోమవారం అర్థరాత్రి ముగిసిన ఈ టెస్టులో కరీబియన్లు అత్యంత దారుణంగా ఓటమిని మూటగట్టుకున్నారు. అదే సమయంలో ఆస్ట్రేలియా సూపర్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ అదిరిపోయే రికార్డులను కొల్లగొట్టాడు.

కింగ్ స్టన్ లో వెస్టిండీస్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన మూడో టెస్టు మూడు రోజుల్లోనే ముగిసింది. మూడు మ్యాచ్ లను గెలిచిన ఆసీస్ 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. గులాబీ బంతితో జరిగిన మూడో టెస్టులో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 225 పరుగులు చేయగా, వెస్టిండీస్ 121కి ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 121కే ఆలౌట్ చేశారు కరీబియన్ బౌలర్లు. తర్వాత 204 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగారు.

ఆస్ట్రేలియా పేసర్ స్టార్క్ వెస్టిండీస్ బ్యాట్స్ మెన్ ను బెంబేలెత్తించాడు. కేవలం 15 బంతుల్లో 9 పరుగులు మాత్రమే చేసి 6 వికెట్లు తీసి కుప్పకూల్చాడు. అసలే స్కాట్ బోలాండ్ (3/2), హేజిల్ వుడ్ (1/10) మిగతా పని పూర్తిచేశారు. దీంతో వెస్టిండీస్ 27 పరుగులకే ఆలౌటైంది. జస్టిన్ గ్రీవ్స్ (11) టాప్ స్కోరర్. ఇతడొక్కడే డబుల్ డిజిట్ దాటాడు.

టెస్టు క్రికెట్ చరిత్రలో ఒక ఇన్నింగ్స్ లో మొట్టమొదటిసారిగా మొత్తం ఏడుగురు బ్యాట్స్ మెన్ డకౌట్ కాగా.. అందులో ముగ్గురు గోల్డెన్ (ఎదుర్కొన్న తొలి బంతికే ఔట్) డకౌట్ కావడం గమనార్హం. ఇక స్టార్క్ అత్యంత వేగంగా (15 బంతుల్లోనే) ఐదు వికెట్ల ఘనత సాధించిన బౌలర్ గా రికార్డులకెక్కాడు. గతంలో ఈ రికార్డు బోలాండ్, ఎర్నీ షాక్ (ఆస్ట్రేలియా), స్టువర్ట్ బ్రాండ్ (ఇంగ్లండ్) పేరిట ఉంది. వీరు 19 బంతుల్లో ఐదు వికెట్లు పడగొట్టారు.

వెస్టిండీస్ 27 పరుగుల ఆలౌట్.. టెస్టు క్రికెట్ చరిత్రలో ఒక జట్టు రెండో అత్యల్ప స్కోరు. దీనికిముందు 1955లో ఇంగ్లండ్ చేతిలో న్యూజిలాండ్ 26 పరుగులకే ఆలౌటైంది.