Begin typing your search above and press return to search.

కోహ్లీ రికార్డు సెంచరీపై అనుష్క ఎమోషనల్‌...పోస్ట్ వైరల్!

ఇందులో ప్రధానంగా భారత్ తరఫున బౌలింగ్‌ లో మహ్మద్ షమీ 7 వికెట్లు తీయగా, బ్యాటింగ్‌ లో విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ లు సెంచరీలతో రాణించారు

By:  Tupaki Desk   |   16 Nov 2023 6:46 AM GMT
కోహ్లీ రికార్డు సెంచరీపై అనుష్క ఎమోషనల్‌...పోస్ట్ వైరల్!
X

ఊహించినట్లుగానే తాజా వన్డే వరల్డ్ కప్ లో టీం ఇండియా ఫైనల్‌ కు చేరుకుంది. లీగ్ లో 9 మ్యాచ్ లు ఆడి తొమ్మిదింట్లోనూ గెలిచి పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ లో నిలిచిన టీం ఇండియా.. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌ లో న్యూజిలాండ్‌ పై 70 పరుగుల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్ లో టీం ఇండియా ఫెర్ఫార్మెన్స్ కు సరికొత్త రికార్డులు క్రియేట్ అయ్యాయి.


ఇందులో ప్రధానంగా భారత్ తరఫున బౌలింగ్‌ లో మహ్మద్ షమీ 7 వికెట్లు తీయగా, బ్యాటింగ్‌ లో విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ లు సెంచరీలతో రాణించారు. ఇక ఈ తాజా సెంచరీతో విరాట్ కోహ్లీ 50వ వన్డే సెంచరీలు సాధించి సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు. దీంతో కొహ్లీ ఫోటోలతో సోషల్ మీడియా హోరెత్తిపోతుండగా... ప్రపంచ క్రీడా దిగ్గజాలు ప్రశంసల జల్లులు కురిపిస్తున్నాయి.

ఇక మ్యాచ్‌ అనంతరం తన రికార్డును బద్దలు కొట్టిన కోహ్లీని సచిన్ కౌగిలించుకుని ఆనందం వ్యక్తం చేశాడు. మరోపక్క రికార్డ్ సెంచరీ పూర్తి చేయగానే స్టేడియంలో ఉన్న తన భార్య అనుష్క వైపు చూస్తూ కొహ్లీ గాల్లో ముద్దులు విసిరేశాడు. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ అనంతరం ఎమోషనల్‌ పోస్ట్‌ షేర్‌ చేసింది అనుష్క. కొహ్లీని ఆకాశానికెత్తుతూ.. ఎమోషనల్ అయ్యింది!

ఇందులో భాగంగా... ఇన్‌ స్టా గ్రాం వేదికగా "దేవుడు ఉత్తమ స్క్రిప్ట్ రైటర్! నీ ప్రేమ నాకు దక్కినందుకు.. నీ ఎదుగులను చూసే అవకాశం ఇచ్చినందుకు ఆ భగవంతుడికి ఎప్పటికీ రుణపడి ఉంటా. మనసులోనూ, ఆటపైనా నిజాయతీగా ఉండే నువ్వు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహిస్తావు. నువ్వు నిజంగా దేవుడి బిడ్డవు" అని రాస్తూ... తన అమితానందానికి అక్షర రూపమిచ్చింది అనుష్క.

కాగా తాజాగా జరిగిన మ్యాచ్ లో వన్డే క్రికెట్లో విరాట్‌ కోహ్లి శతకాల సంఖ్య 50కి చేరిన సంగతి తెలిసిందే. దీంతో... ఈ ఫార్మాట్లో అత్యధిక సెంచరీల రికార్డును కొహ్లీ సొంతం చేసుకున్నాడు. 279 ఇన్నింగ్స్‌ లోనే అతనీ ఘనత దక్కించుకోవడం గమనార్హం. ఇదే సమయంలో ఒకే ప్రపంచ కప్‌ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సచిన్‌ (2003లో 673)ను కొహ్లీ అధిగమించాడు. ఈ ప్రపంచకప్‌ లో ఇప్పటివరకూ కోహ్లి చేసిన పరుగులు 711.