Begin typing your search above and press return to search.

మరో టి20 లీగ్ లో విరాట్ కోహ్లి.. అదీ కొడుకుతో కలిసి.. నిజమేనా?

కోహ్లి గురించిన కొత్త న్యూస్ ఏమంటే అతడు.. త్వరలో జరిగే టి20 లీగ్ ఢిల్లీ ప్రీమియర్ లీగ్ (డీపీఎల్)లో పాల్గొంటాడని.

By:  Tupaki Desk   |   12 July 2025 12:00 AM IST
మరో టి20 లీగ్ లో విరాట్ కోహ్లి.. అదీ కొడుకుతో కలిసి.. నిజమేనా?
X

2024లో అంతర్జాతీయ టి20 ఫార్మాట్ కు గుడ్ బై చెప్పిన టీమ్ ఇండియా స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లి.. ఈ ఏడాది ఏకంగా టెస్టులకూ వీడ్కోలు పలికి ఆశ్చర్యపరిచాడు. అంటే మనం కోహ్లిని భారత జెర్సీలో చూడగలిగేది కేవలం వన్డేల్లోనే అన్నమాట. అయితే, ఆ వన్డేలు కూడా ఎక్కువగా జరగడం లేదు. ఏడాదికి 10 మ్యాచ్ లు జరిగితేనే గొప్ప. కాబట్టి.. కోహ్లి బ్యాటింగ్ ను ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మాత్రమే పూర్తిస్థాయిలో ఆస్వాదించగలం.

ఈ మధ్యలోనే కోహ్లి గురించిన మరో వార్త చక్కర్లు కొడుతోంది. లండన్ లో శాశ్వత నివాసం కొనుక్కున్న అతడు కుటుంబంతో పాటు అక్కడే గడిపేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నాడని సమాచారం. ఇప్పటికే టోర్నీలు లేకుంటే కోహ్లి ఎక్కువ రోజులు ఇంగ్లండ్ లోనే ఉంటున్నాడు.

ప్రస్తుతం కూడా దాదాపు నెల రోజుల నుంచి ఇంగ్లండ్ లోనే ఉన్నాడు. గత నెల మూడో వారంలో టీమ్ ఇండియా కొత్త కెప్టెన్ శుబ్ మన్ గిల్, వైస్ కెప్టెన్ రిషభ్ పంత్ లను లండన్ లోని తన నివాసానికి ఆహ్వానించాడు. ఇక ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ టోర్నీ టెన్నిస్ మ్యాచ్ లు చూసేందుకు భార్య అనుష్కతో కలిసి వెళ్తున్నాడు.

కోహ్లి గురించిన కొత్త న్యూస్ ఏమంటే అతడు.. త్వరలో జరిగే టి20 లీగ్ ఢిల్లీ ప్రీమియర్ లీగ్ (డీపీఎల్)లో పాల్గొంటాడని. ఈ లీగ్ కోసం గత వారం నిర్వహించిన వేలంలో కోహ్లి అన్న వికాస్ కోహ్లి కుమారుడు ఆర్యవీర్ కోహ్లి (15)ని సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్స్ జట్టు రూ.లక్షకు కొనుగోలు చేసింది. డీపీఎల్ ను ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్స్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) నిర్వహిస్తోంది. దీని అధ్యక్షుడు రోహాన్ జైట్లీ. ఇతడు మాజీ అధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ కుమారుడు.

కోహ్లి డీపీఎల్ లో ఆడే అంశంపై రోహాన్ స్పందించారు. ఢిల్లీ క్రికెట్ కు కోహ్లి ఎప్పుడూ అండగా నిలిచాడని.. యువ క్రికెటర్లను గైడ్ చేశాడని చెప్పుకొచ్చారు. ఎప్పుడు అవసరం ఉన్నా.. అతడు అందుబాటులో ఉంటాడని పేర్కొన్నారు. కోహ్లి ఆడితే అంతకంటే ఏం కావాలని కూడా అన్నారు. ఢిల్లీలోనే పుట్టి పెరిగిన కోహ్లి.. ఆ రాష్ట్ర రంజీ జట్టుకు ఆడాడు. బీసీసీఐ కొత్త నిబంధన ప్రకారం ఈ ఏడాది ఫిబ్రవరిలో రంజీ మ్యాచ్ బరిలో దిగాడు.

మరి డీపీఎల్ లో ఆడతాడా?

కోహ్లి డీపీఎల్ లో ఆడతాడా? అదీ అన్న కుమారుడితో కలిసి లేదా ప్రత్యర్థిగానా? అంటే.. అసలు సాధ్యం కాదని చెప్పాలి. డీపీఎల్ చాలా చిన్న లీగ్. కోహ్లి రంజీ మ్యాచ్ కోసం బరిలో దిగితేనే అభిమానుల సందడి తట్టుకోలేకపోయారు. అలాంటిది లోకల్ లీగ్ అయిన డీపీఎల్ లో ఆడితే ఇంకేమైనా ఉందా? అయినా, అంత ఆసక్తి కూడా విరాట్ కు లేదనేది స్పష్టం.